TRS : టీఆర్ఎస్ లో గ్రూప్ వార్ కి చెక్ పడినట్టేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉమ్మడి నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గం టీఆర్ఎస్లో కొన్నాళ్లుగా వర్గపోరు తగ్గేదే లేదన్నట్టుగా సాగుతోంది.ఉపఎన్నిక తర్వాత అది మరీ ఎక్కువైందనే అభిప్రాయం ఉంది. ఎమ్మెల్యే నోముల భగత్, ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి వర్గాలకు అస్సలు పడటం లేదు. పలు అంశాల్లో రెండు వర్గాలు ఆధిపత్యపోరు ప్రదర్శించిన ఉదంతాలు ఉన్నాయి. ఇదే సమయంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాగార్జున సాగర్ పర్యటన గ్రూప్ వార్‌కు చెక్ పెట్టినట్టుగా ప్రచారం జరుగుతోంది. ఆయన చేసిన కామెంట్స్‌పై ఎవరికి వారుగా విశ్లేషణ చేసుకుంటున్నారు.
ఎమ్మెల్యే భగత్‌కు నియోజకవర్గ అభివృద్ధి తప్ప మరో ఆలోచన లేదని కేటీఆర్ చెప్పడంతో.. వైరివర్గంలో చర్చ మొదలైందట. పైగా భగత్‌కే అందరూ అండగా ఉండాలని.. సీఎం కేసీఆర్ ఆశీర్వాదాలు ఎమ్మెల్యేకే ఉన్నాయని కేటీఆర్ స్పష్టంగా చెప్పడంతో ఎమ్మెల్సీ కోటిరెడ్డి వర్గానికి అస్సలు రుచించలేదట. వాస్తవానికి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ వర్గాలు నాగార్జున సాగర్‌లో పట్టు సాధించేందుకు చేయని ప్రయత్నాలు లేవు. ఇలాంటి తరుణంలో కేటీఆర్ చేసిన కామెంట్స్‌తో ఎమ్మెల్సీ శిబిరం కంగుతిందట.
Also Read
అదే వేదిక నుంచి పార్టీ అగ్రనేత చేసిన మరికొన్ని కామెంట్స్ చూట్టూ ప్రస్తుతం చర్చ నడుస్తోంది. గతంలో ఇచ్చిన హామీ మేరకు కోటిరెడ్డికి ఎమ్మెల్సీ ఇచ్చామని కేటీఆర్ గుర్తు చేశారు. ఇలా భగత్, కోటిరెడ్డిల విషయంలో ఎవరి పరిధి ఏంటో.. ఎవరు ఏ గీత లోపల పనిచేయాలో స్పష్టంగా చెప్పడంతో వర్గపోరుకు ముగిసినట్టేనని కేడర్ చెవులు కొరుక్కుంటోంది. అంతేకాదు.. సాగర్‌లో టికెట్‌పై కన్నేసిన మరికొందరికి కూడా సమాధానం చెప్పేశారని అనుకుంటున్నారు. మరి.. ఇదే విధంగా హద్దుల్లో ఉండి.. కలిసి పార్టీ కోసం పనిచేస్తారో.. లేక కలిసి మెలిసి తిరుగుతూ.. తెరవెనక కత్తులు దూసుకుంటారో చూడాలి.
తాజావార్తలు
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
-
Daily Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధనయోగం!
-
Drishyam 3 : దృశ్యం3తో అజయ్ దేవగన్ సాలిడ్ కంబ్యాక్.. రూ. 230 కోట్లు క్రాస్ చేసిన ఫ్యామిలీ థ్రిల్లర్
-
PNB Loan Interest Rate Hike: PNB, బ్యాంక్ ఆఫ్ బరోడా సహా పలు బ్యాంకుల్లో లోన్లు భారం.. కొత్త వడ్డీ రేట్లు ఇవే
ట్రెండింగ్
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!