Telangana BJP : బీజేపీ రాష్ట్రంలో అధికారం దక్కించుకోవడమే టార్గెట్ గా పెట్టుకుందా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana BJP :బీజేపీ జాతీయ నాయకత్వం తెలంగాణపై ప్రత్యేక దృష్టి సారించింది.రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకోవటమే టార్గెట్‌గా పావులు కదుపుతోంది. ఇలాంటి తరుణంలోనే మరో కీలక నిర్ణయం తీసుకుంది.ఇంతకీ..ఏంటా నిర్ణయం?రాష్ట్రంలో ఇంకా ఎలాంటి మార్పులు జరగబోతున్నాయ్?
జాతీయ కార్యవర్గ సమావేశాలు ముగియగానే కమలం పార్టీ కేంద్ర నాయకత్వం సంస్థాగత మార్పులు చేపట్టింది. పలు రాష్ట్రాల సంస్థాగత ప్రధాన కార్యదర్శులను ఇప్పటికే మార్చింది. తెలంగాణ రాష్ట్ర సంఘటనా కార్యదర్శిని పంజాబ్‌కు పంపించింది. ఇంకా అయన స్థానంలో కొత్త వారిని నియమించలేదు.
Also Read
తెలంగాణపై ఫోకస్ పెట్టిన బీజేపీ రాష్ట్రాన్ని దృష్టిలో పెట్టుకొని సంస్థాగత మార్పులు చేస్తూ వస్తోంది. రాష్ట్ర సంఘటన ప్రధాన కార్యదర్శిని మార్చిన కేంద్రనాయకత్వం తాజాగా రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జిని కూడా మార్చేసింది. తరుణ్‌చుగ్ స్థానంలో సునీల్ బన్సల్‌ను నియమించింది పార్టీ హై కమాండ్. సునీల్ బన్సల్ రాష్ట్ర ఇంఛార్జిగా వస్తుండటంతో పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది. అయన గురించి పార్టీ కార్యకర్తలకు ఇప్పటికే తెలిసి ఉండటంతో పార్టీ పరిస్థితి ఎలా ఉండబోతుందోనని చర్చించుకుంటున్నారట.
ఐతే…సునీల్ బన్సల్‌ను రాష్ట్రానికి పంపించడం అంటే తెలంగాణలో జెండా పాతేందుకేననే ప్రచారం జరుగుతోంది. తమ తరువాతి టార్గెట్ పశ్చిమ బెంగాల్, తెలంగాణ, ఒడిశా అని చెబుతూ వస్తున్నారు బీజేపీ నేతలు. ఆ దిశగా అడుగులు వేస్తుందనడానికి సునీల్ బన్సల్ నియామకం ఒక ఉదాహరణ అని అనుకుంటున్నారట. తెలంగాణకు అయనను ఇంఛార్జిగా వేయడంతో శ్రేణుల్లో సంతోషం వ్యక్తం అవుతోందట.
నిజానికి…సునీల్ బన్సల్ అమిత్ షా కు అత్యంత సన్నిహితుడు. రాష్ట్ర వ్యవహారాలపై మరింత దృష్టి సారించేందుకు అమిత్ షా ఆయనను ఇక్కడకు పంపించారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నేరుగా అమిత్ షా, సంతోష్లతోనే అయన టచ్‌లో ఉంటారని టాక్. అందుకే నిర్ణయాలు చకచకా తీసుకుంటారని సమాచారం. ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రంలోనే అయన అందరినీ ఒక దగ్గరికి చేర్చి పార్టీని విజయ తీరాలకు నడిపించారట. తెలంగాణ ఆయనకు పెద్ద ఇష్యూ కాదని అనుకుంటున్నారు.
మరోవైపు…నేతలు ఇగోలకు పోవడం, ఎడమొహం పెడ మొహంగా ఉంటే వారికే నష్టం అని మాట్లాడుకుంటున్నారు. సంస్థాగత వ్యవహారాలలో, సామాజిక సమీకరణాలలో, ఎన్నికల స్ట్రాటజీలో బన్సల్‌కి అపార అనుభవం ఉందంటున్నారు స్థానికనేతలు. ఉత్తరప్రదేశ్‌లో బిజెపి విజయం వెనుక అయన కృషి ఎంతగానో ఉందని పార్టీ శ్రేణులే చెబుతున్నాయి. కష్టపడే వారికి ప్రాధాన్యత ఉంటుందని అంటున్నారు.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!