Site icon NTV Telugu

Off The Record: అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడుపై జిల్లా వాసుల ఆగ్రహం

Atc

Atc

Off The Record: ఇద్దరు మంత్రులు… ఒకరిది స్టేట్‌, మరొకరిది సెంట్రల్‌ లెవల్‌. పైగా ఒకటే ఫ్యామిలీ. ఇద్దరూ కలిసి తమకేదో చేసేస్తారని ఇన్నాళ్ళు ఎదురు చూసిన ఆ జిల్లా వాసుల్లో ఇప్పుడు అసహనం పెరుగుతోందట. ఇద్దరూ కలిసి ఏం పొడిచారంటూ మెల్లిగా వాయిస్‌ రెయిజ్‌ అవుతోంది. ఎవరా ఇద్దరు మంత్రులు? వాళ్ళ మీద ఆ స్థాయి ఎక్స్‌పెక్టేషన్స్‌ ఎందుకు పెరిగాయి?

Read Also: Hyderabad: హైదరాబాద్‌లో నకిలీ మెహందీ కలకలం..

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఈసారి రెండు మంత్రి పదవులు ఒకే కుటుంబానికి దక్కాయి. బాబాయ్‌ అచ్చెన్నాయుడు రాష్ట్ర మంత్రి అయితే…. అబ్బాయ్‌ రామ్మోహన్‌ నాయుడు సెంట్రల్‌ మినిస్టర్‌. ఇద్దరూ ఇద్దరే కావడం, ఇద్దరికీ ఆయా ప్రభుత్వాల్లో ప్రాధాన్యం ఉండటంతో… సిక్కోలు వాసుల అంచనాలు పెరిగాయి. డబులింజన్‌ సర్కార్‌లో బాబాయ్‌, అబ్బాయ్‌ కలిసి తమకున్న ట్రబుల్స్‌ అన్నిటినీ ఉఫ్‌మని ఊదేస్తారని అనుకున్నారట జిల్లా వాసులు. కానీ… రెండేళ్ళు దగ్గర పడుతున్నా… ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉండటం, పైగా తాము వద్దనుకున్న ప్రాజెక్ట్‌ను నెత్తిన రుద్దే ప్రయత్నం చేయడం లాంటి కారణాలతో జిల్లా వాసుల్లో అసహనం పెరుగుతున్నట్టు చెప్పుకుంటున్నారు. మరీ ముఖ్యంగా… పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించే పరిశ్రమలు, ఇతర ప్రాజెక్టులు తీసుకొస్తారని ఆశించారు జిల్లా వాసులు. మూలపేట పోర్ట్‌కు అనుబంధంగా వేల ఎకరాల భూమి అందుబాటులో ఉంది.

Read Also: Off The Record: మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కు నో వేకెన్సీ?

ఇక్కడ బీపీసీఎల్‌ ఆయిల్ రిఫైనరీ వస్తుందంటూ సందు దొరికినప్పుడల్లా డప్పు కొట్టేవారు బాబాయ్‌, అబ్బాయ్‌. కానీ.. చివరికి ఆ ప్రాజెక్ట్‌ నెల్లూరుకు తరలిపోవడంతో ఉసూరుమనడం సిక్కోలు వాసుల వంతయింది. జిల్లా వాసులకు ఓపిక ఎక్కువ కాబట్టి… సర్లే… ఎన్నెన్నో అనుకుంటాం, అనుకున్నవన్నీ అవుతాయా ఏంటి అంటూ… మనోళ్ళు అది కాకుంటే మరో ప్రాజెక్ట్‌ అయినా తీసుకురాకపోతారా అని ఎదురు చూశారట. అలా ఎదురు చూస్తూ… చూస్తూ… నెలలు సంవత్సరాలు గడిచిపోతున్నాయిగానీ ఫలానా ప్రాజెక్ట్‌ వస్తుందన్న వాసన కూడా తెలియడం లేదు. దీంతో.. జిల్లాలో ఇద్దరు మంత్రుల మీద అసహనం పెరుగుతోందట. ఉద్యోగాలు, ఉపాధి మీకు దొరికితే సరిపోయిందా? మాకు అక్కర్లేదా అన్న నిష్టూరపు మాటలు గట్టిగానే వినిపిస్తున్నాయి ఇద్దర్నీ ఉద్దేశించి. చిన్న చితక పనులు ఎవరైనా చేస్తారు… అంత పలుకుబడి ఉండి కూడా… ఇద్దరూ కలిసి జిల్లాకు తీసుకువచ్చిన చెప్పుకోతగ్గ ప్రాజెక్ట్‌ ఒక్కటి చెప్పండని టీడీపీ నేతలు సైతం బహిురంగంగానే మాట్లాడుతున్నట్టు సమాచారం. అసలు మేం కోరుకుంటోంది ఒకటైతే… అందుకు భిన్నంగా… ఉద్దానం ప్రాంతంలో పచ్చని పొలాల్లో కార్గో ఎయిర్ పోర్టు అంటూ బలవంతంగా రుద్దేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడుతున్నట్టు తెలుస్తోంది.

Read Also: Off The Record: దానం నాగేందర్ కు ఉన్న ఎమ్మెల్యే పదవి కూడా పోయేలా ఉందా?

స్థానికులకు పెద్దగా ఉద్యోగావకాశాలు కల్పించలేని ఇలాంటి ప్రాజెక్ట్‌లు ఎందుకు, అదే ఏదన్నా పెద్ద ఫ్యాక్టరీ తెస్తేకదా.. అందరూ బాగుపడేది అంటున్నారట జిల్లా వాసులు. అలాంటి వాటిని తీసుకు రావడంలో ఇద్దరూ విఫలం అవుతున్నారన్న ఆగ్రహం వ్యక్తం అవుతోంది. జిల్లా సరిహద్దుల్లో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ఉండగా… మళ్ళీ.. ఇక్కడ కార్గో ఎయిపోర్ట్ ఎందుకు? అనవసరంగా రైతులను ఇబ్బంది పెడ్డడానికి కాకుంటే అన్న మాటలు సైతం వస్తున్నాయట. ప్రజలకు మేలు చేయకపోగా… కింజరాపు ఫ్యామిలీలోని ఇద్దరూ కలిసి ఉద్దానం ప్రాంతంలో చిచ్చు రగులుస్తున్నారని, ఆ పనులు మానుకోవాలని సూచిస్తున్నారు జనం. ఓ వైపు కార్గోఎయిర్ పోర్టు ప్రయత్నాలు సాగిస్తున్నా, ఇద్దరిలో ఏ ఒక్కరూ… ఒక్క ఊరిని కూడా సందర్శించకపోవడం, ప్రజాభిప్రాయాలను తెలుసుకోకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.

Read Also: Dasara : మాంసం ప్రియులకు బిగ్ ఆప్డేట్..!

కార్గో ఎయిర్ పోర్టు వస్తే అభివృద్ధి జరిగిపోతుందని, ఉద్యోగాలు వస్తాయంటూ భ్రమలు కల్పించే ప్రయత్నం చేస్తున్నారు తప్ప అందులో వాస్తవం లేదన్నది లోకల్‌ వాయిస్‌. సిక్కోలు రాజకీయాలను శాసిస్తున్న ఈ ఇద్దరూ ఒక్క పెద్ద ప్రాజెక్ట్‌ అయినా తీసుకువచ్చి తమను తాము నిరూపించుకోవాలని అంటున్నారు జిల్లా జనం. అభివృద్ధి ఆధారితమైన వాటిని వదిలేసి ఏవో ప్రయోజనాల కోసం స్థానికులకు పెద్దగా ఉపయోగపడని ప్రాజెక్ట్‌ జోలికి పోవద్దన్నది శ్రీకాకుళం వాసుల మాట.

Exit mobile version