ప్రభుత్వ వైద్యుల రచ్చరచ్చ..యూనియన్ పాలిటిక్స్ తో డాక్టర్స్ వార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగ సంఘాలు కీలకపాత్ర పోషించాయి. అందులో ప్రభుత్వ డాక్టర్ల సంఘాలు సైతం ఉన్నాయి. ప్రస్తుతం ప్రభుత్వ వైద్యులు తమ దృష్టంతా రాజకీయాలపై పెడుతున్నారనే ఆరోపణలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఉద్యమ సమయంలో ఏర్పాటైన సంఘం పేరును వాడుకునే విషయంలో రెండు గ్రూపుల మధ్య వివాదం తలెత్తింది. పోలీసు కేసులు.. కోర్టులో విచారణ వరకు వెళ్లింది సమస్య. పైగా ఒకరిపై మరొకరు పదేపదే ఫిర్యాదులు చేసుకుంటూ శాఖాధిపతులకు కొరకరాని కొయ్యగా మారారు వైద్యులు.
డ్యూటీలపై ఫోకస్ పెట్టకుండా యూనియన్లను బలోపేతం చేయడానికే దృష్టి పెడుతున్నారట ప్రభుత్వ వైద్యులు. రాజకీయ పార్టీల తరహాలోనే కొందరు పాలిటిక్స్ చేస్తున్నారట. సోషల్ మీడియాల్లో చర్చలు, సవాళ్లు విసురుకుంటున్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అన్ని యూనియన్లు కలిసికట్టుగా పనిచేయాలని మంత్రి హరీష్‌రావు సూచించినా.. ఆ దిశగా అడుగులు పడడం లేదట. వైద్యుల సంఘాలతోనే సమస్య ఎక్కువగా ఉన్నట్టు అభిప్రాయపడుతున్నారట. ప్రభుత్వ విధానాలపై సంఘాలు చేస్తున్న ప్రకటనలు చిక్కులు తెచ్చిపెడుతున్నాయట. ప్రభుత్వ కార్యక్రమాలకు ఒక సంఘం అంగీకరిస్తుండగా, మరొక సంఘం వ్యతిరేకిస్తోంది. ఈ అంశంపై ఇటీవల కాలంలో సర్కార్ గట్టిగానే ఫోకస్ పెట్టిందట.
Also Read
వాస్తవానికి యూనియన్ల పేరుతో ఎవరి అవసరాలు వాళ్లు తీర్చుకుంటున్నారట కొందరు డాక్టర్లు. ఇదేదో లాభసాటిగా ఉందని భావించిన మరికొందరు ప్రభుత్వ డాక్టర్లు కూడా వృత్తిని వదిలేసి.. సంఘాల పేరుతో రోడ్డెక్కుతున్నారు. నలుగురు ప్రభుత్వ డాక్టర్లు కలిస్తే.. ఒక యూనియన్ ఏర్పాటు చేసేస్తున్నారు. నీకు ఇది.. నాకు అది అని వాటాలు వేసేసుకుని రాజకీయ నేతలను కలవడానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. వారానికో.. నెలకో ప్రభుత్వ వైద్యుల సంఘం పుట్టుకు రావడం కామనైపోయింది. ఇవాళ ఒక యూనియన్‌లో ఉన్నవారు.. రేపు సొంతంగా సంఘం పెడతారో.. మరో వర్గంతో కలిసి కనిపిస్తారో ఊహించడం కష్టంగా ఉంది.
గంటల కొద్ది ఫోన్లలో ఛాటింగ్‌లకు సమయం కేటాయిస్తున్న వైద్య సంఘాల మేధావులు.. ఒక గంట కూడా ఓపీలో ఉండటం లేదట. పైగా ఎవరైనా ప్రశ్నిస్తే.. తమ హక్కులు.. ఆదేశ సూత్రాలను వల్లెవేస్తున్నట్టు విమర్శలు ఉన్నాయి. వీటికి మంత్రి హరీష్‌రావు చెక్ పెడతారో లేదో చూడాలి.
తాజావార్తలు
-
Khairatabad Ganapathi Shobha Yatra: అంగరంగ వైభవంగా ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర..!
-
Minapa Jantikalu: నూనె పీల్చకుండా, నెల రోజులు క్రిస్పీగా శెనగపిండి లేకుండానే కరకరలాడే “మినప జంతికలు” చేసేయండి ఇలా..!
-
Minister Atchannaidu: తుఫాన్ ఎఫెక్ట్.. అధికారులకు మంత్రి అచ్చెన్నాయుడు కీలక ఆదేశాలు
-
Joshna Chinappa History: ఏడు ఏషియన్ గేమ్స్.. ఆరు పతకాలు.. 40 ఏళ్ల వయసులోనూ జోష్నా జోరు!
-
PM SVANidhi: వీధి వ్యాపారులకు బంపర్ ఆఫర్.. 50 రోజుల వరకు రూపాయి వడ్డీ లేకుండా లోన్.. అప్లై చేసుకోండిలా..
-
Balapur Ganesh Laddu Auction: సరికొత్త రికార్డు.. రూ.39 లక్షలతో బాలాపూర్ గణేశుడి లడ్డూ దక్కించుకున్న సామ ప్రణీత్ రెడ్డి..!
ట్రెండింగ్
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!