Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Each Ycp Leader Has One Mandal Have They Given A License For Corruption

YCP :ఒక్కో వైసీపీ నేతకు ఒక్కో మండలం..అవినీతికి లైసెన్స్ ఇచ్చేశారా ?

Published Date :July 9, 2022 , 12:28 pm
By Premchand Chowdary
YCP :ఒక్కో వైసీపీ నేతకు ఒక్కో మండలం..అవినీతికి లైసెన్స్ ఇచ్చేశారా ?
  • Follow Us :
  • google news
  • dailyhunt

పెన్నా నది పరివాహక ప్రాంతం కావడంతో నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో భూములకు డిమాండ్‌ ఎక్కువ. నియోజకవర్గంలోని బుచ్చిరెడ్డిపాలెం.. కొడవలూరు.. కోవూరు.. విడవలూరు మండలాల్లో గ్రావెలతోపాటు ఇసుక అధికంగా లభిస్తుంది. ఇవే స్థానిక వైసీపీ నేతలకు కాసులు కురిపిస్తున్నాయి. ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి తీసుకున్న నిర్ణయం సైతం ప్రస్తుతం చర్చగా మారింది. అధికారపార్టీ వర్గాల్లోనే కుమ్ములాటలకు.. వర్గపోరుకు.. కేడర్‌కు ఎమ్మెల్యేకు మధ్య దూరం పెరగడానికి కారణమైందని చెబుతున్నారు.

కోవూరు నియోజకవర్గంలోని మండలాలకు పార్టీ నేతలను ఇంఛార్జులుగా నియమించారు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్‌రెడ్డి. వారికే పూర్తి బాధ్యతలు అప్పగించారు. దాంతో ఆ నాయకులు ప్రతి విషయంలో జోక్యం చేసుకుంటూ సమస్యలు సృష్టిస్తున్నారని పార్టీలోనే విమర్శలు ఉన్నాయి. మూడేళ్లుగా ఇదే జరుగుతున్నా ఎమ్మెల్యే లైట్‌ తీసుకుంటున్నారట. కొడవలూరులో DCMS అధ్యక్షుడు చలపతిరావు చెప్పిందే వేదంగా మారిపోయిందట. అక్కడేం జరగాలన్నా చలపతిరావు అనుమతి కావాలని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. ఇటీవల మండలంలో గ్రావెల్‌ తవ్వకాలపై వైసీపీలో వర్గపోరు మొదలైంది. సమస్య ఎమ్మెల్యే దృష్టికి వెళ్లింది. అన్నీ విన్న ప్రసన్నకుమార్‌రెడ్డి ఏదీ పట్టించుకోలేదట.

విడవలూరు మండలంలో వైసీపీ నేతల మధ్య పంపకాల్లో తేడాలు వచ్చాయట. ఎమ్మెల్యే పేరు చెప్పి కొందరు డబ్బులు వసూలు చేశారని గుప్పుమంది. ఆ సంఘటనపై మాత్రం ప్రసన్న కుమార్‌రెడ్డి భగ్గుమన్నారు. ఇందుకూరుపేట మండలంలో పార్టీ నేతలు శ్రీనివాసరెడ్డి, ఆదిశేషారెడ్డిలపై మరో నేత సురేష్‌రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. నేతల అవినీతి చిట్టా బయటపెడతానని సురేష్‌రెడ్డి చెప్పడంతో కలకలం రేగింది. కొందరు నాయకులైతే.. జనాల్లో డ్యామేజీ అవుతోందని భావించి.. నేరుగా ఎమ్మెల్యే దగ్గర పంచాయితీ పెట్టారట. పార్టీలో వారైనా ఉండాలి లేదాంటే మేమైనా వెళ్లిపోతామని తెగేసి చెప్పారట.

బుచ్చిరెడ్డిపాలెం మండలంలో వైసీపీ నేత సూరా శ్రీనివాసరెడ్డి సర్వం తానై వ్యవహరిస్తున్నారట. ఇక్కడ ఇసుక, గ్రావెల్‌ తవ్వకాలపై నిత్యం తగువే. కొందరు కోట్లు గడించారని పార్టీ వర్గాలే ఆరోపిస్తున్నాయి. పైగా వైసీపీకి మొదటి నుంచి పనిచేస్తున్న వారిని కాదని.. కొత్తగా వచ్చిన వారికి ఎలా పెత్తనం ఇస్తారని ప్రశ్నిస్తున్నారట. అయితే ఎమ్మెల్యేకు స్నేహితుడిగా ఉన్న తనను ఎవరూ ఏమీ చేయలేరని ఒక నాయకుడు చేస్తున్న ప్రకటనలు కేడర్‌ను దిక్కతోచని స్థితిలో పడేస్తున్నాయి. ఈ మండలంలో జరుగుతున్న వ్యవహారాలను కొందరు వైసీపీ నేతలు సీఎం జగన్‌కు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. ఇక కోవూరు మండలంలోనూ ఇదే పరిస్థితి ఉందట. అక్కడా వాటల కోసం పార్టీ నేతలు గొడవలు పడుతున్నారు.

మొత్తానికి ఒక్కో మండలాన్ని ఒక్కో నేతకు అప్పగించి.. ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి ఏదీ పట్టించుకోవడం లేదనే వైసీపీ కేడర్‌ గుర్రుగా ఉంది. తనకు కావాల్సిన వాళ్లకు మండలాలు రాసిచ్చేసి.. అక్కమార్జనకు లైసెన్స్ ఇచ్చారని పార్టీ నేతలే వాపోతున్నారు. సొంత పార్టీ వాళ్లకే మామూళ్లు ఇచ్చుకోవాల్సి వస్తోందని కేడర్‌ గగ్గోలు పెడుతోంది. అన్నీ తెలిసిన ఎమ్మెల్యే ఎందుకు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారో పార్టీ శ్రేణులకు అర్థం కావడం లేదట.

 

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Chalapathirao
  • Indukurupeta
  • Kovvur
  • Nallapareddy Prasanna Kumar Reddy
  • ycp

తాజావార్తలు

  • Hormuz Amid Crisis: హోర్ముజ్‌ దాటాలంటే భారీ మొత్తం చెల్లించాల్సిందే.. ఒక చమురు ట్యాంకర్‌కు ఇరాన్‌ ఎంత వసూలు చేస్తుందంటే..?

  • Gold &Silver Rates: యాహూ భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. అస్సలు ఊహించి ఉండరు!

  • Cabinet Meeting: నేడు కేబినెట్ సమావేశం.. గిగ్ వర్కర్ల బిల్లుతో సహా 10 బిల్లుల ఆమోదం.?

  • JrNTR : ఎన్టీఆర్ డెడికేషన్.. 7 వారాల్లో 10 కిలోల బరువు తగ్గిన యంగ్ టైగర్!

  • NBK 112 : బాలయ్య – వివేక్ ఆత్రేయ సినిమా కోసం ఇద్దరు టాప్ టెక్నిషియన్స్

ట్రెండింగ్‌

  • Upcoming Smartphones: స్మార్ట్‌ఫోన్ బూం.. ఈ వారంలో లాంచ్ కాబోతున్న సరికొత్త స్మార్ట్‌ఫోన్స్ ఇవే..!

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions