Off The Record: జూబ్లీహిల్స్ అభ్యర్థి ఎంపిక విషయమై కాంగ్రెస్ పార్టీలో కంగాళీ ఉందా? సామాజికవర్గాల లెక్కలు, క్యాండిడేట్స్ బలాబలాలు కుదరడం లేదా? ప్రతిపక్షం ఇప్పటికే… క్లారిటీ ఇచ్చేస్తే… అధికార పార్టీ మాత్రం అవసరానికి మించి సాగదీస్తోందా? గెలుపే లక్ష్యంగా అడుగులేస్తున్న పార్టీకి ఎందుకంత సాగదీత? లెట్స్ వాచ్.
Read Also: Off The Record: అరాచక ఎమ్మెల్యేలపై సీఎం వార్నింగ్స్ పని చేస్తున్నాయా? మార్పు మొదలైందా..?
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే అధికార కాంగ్రెస్ పార్టీ డివిజన్ల వారీగా అభివృద్ధి కార్యక్రమాలు, ఇన్ఛార్జ్‌ల నియామకాన్ని పూర్తి చేసింది. అయితే అభ్యర్థి ఎంపిక మీదనే మల్లగుల్లాలు పడుతున్నట్టు కనపడుతోంది. ఆ విషయంలో బీఆర్‌ఎస్ ఇప్పటికే కొంత క్లారిటీ ఇచ్చేసింది. కానీ… కాంగ్రెస్ మాత్రం ఇంకా సర్వేలు.. స్ట్రాటజీలు అంటూ నాన్చుతున్నట్టు కనిపిస్తోంది. కానీ.. త్వరగా తేల్చకుండా.. ఎక్కువ సాగదీస్తే….పోటీ ఎక్కువై అసంతృప్తులు మొదలు కావచ్చని అంటున్నారు.ఇప్పుడున్న పరిస్థితుల్లో… అధికార పార్టీగా… జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ గెలిచి తీరాల్సిందేనని టార్గెట్ పెట్టింది హైకమాండ్. దీంతో ముగ్గురు మంత్రులను ఇన్చార్జిలుగా నియమించి గ్రౌండ్ క్లియర్ చేసుకునే పనిలో భాగంగా బూత్‌ల వారీగా ఓటర్ మ్యాపింగ్ చేసింది రాష్ట్ర నాయకత్వం. కానీ… అభ్యర్థి ఎంపికే ఇంకా కొలిక్కి రాలేదు. సోషల్ జస్టిస్ తో పాటుగా బీసీ కులగణన అంశాన్ని ప్రధానంగా ఫోకస్ చేస్తున్న క్రమంలో…జూబ్లీహిల్స్ అభ్యర్థి ఎంపికపై ఎలాంటి వ్యూహాన్ని అనుసరిస్తుందన్నది ఇంకా సస్పెన్స్ గానే ఉంది.
Read Also: Charlie Kirk: చార్లీ కిర్క్‌ను చంపింది 22 ఏళ్ల టైలర్ రాబిన్సన్.. హత్య చేసింది ఇందుకేనా..
అయితే, బీసీలకు టికెట్ ఇస్తారా లేదంటే రెడ్డి సామాజిక వర్గం నుంచి అభ్యర్థులను పరిశీలిస్తుందా అన్నది ప్రధాన చర్చ. సాధారణ ఎన్నికల్లో పోటీ చేసిన అజారుద్దీన్‌ను ఎమ్మెల్సీగా ఎంపిక చేసింది ప్రభుత్వం. దీంతో ఇప్పుడు ఈ టిక్కెట్ ఏ సామాజిక వర్గానికి వెళ్తుందోనని ఆసక్తిగా చూస్తున్నాయి కాంగ్రెస్ వర్గాలు. అయితే… సామాజిక వర్గం ఏదైనా సరే… గెలిచి తీరాలన్నదే కాంగ్రెస్ ప్రధాన టార్గెట్. ప్రస్తుతం ఇక్కడ రేస్‌లో పార్టీ తరపున నవీన్ యాదవ్ ఉన్నారు. మొదటి నుండి ఆయనకు నియోజక వర్గంలో కొంత బలం ఉంది. బీసీలకు చాన్స్ ఇవ్వాల్సి వస్తే నవీన్ యాదవ్ పేరు బలంగా వినిపిస్తోంది. దీంతో పాటు మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ పేరు కూడా ఇప్పుడు చర్చలోకి వచ్చింది. మేయర్ గా పని చేసినఅనుభవం…పరిచయాలు..సామాజిక వర్గాలు కలిసి వస్తాయనే లెక్కలున్నాయి. పార్టీ కీలక నేత ఒకరు రామ్మోహన్‌ను ప్రోత్సహిస్తున్నట్టు సమాచారం. ఢిల్లీ వెళ్లి లాబీయింగ్ కూడా మొదలుపెట్టారు బొంతు రామ్మోహన్. ఈ ఉప ఎన్నిక ఇప్పుడు అధికార, ప్రతిపక్ష పార్టీకి సవాల్‌గా మారింది. అధికార పార్టీగా గెలిచి నిలబడాలని కాంగ్రెస్ కోరుకుంటుంటే.. సానుభూతి అస్త్రంతో గెలిచి పట్టు నిలుపుకోవాలని చూస్తోంది బీఆర్ఎస్. రెండు పార్టీలకు ఎన్నికలు సవాలే కావడంతో.. అన్ని రకాలుగా హంగులు ఉన్న అభ్యర్థులను బరిలోదించాలని చూస్తున్నాయి.
Read Also: Check Wine Quality: అలర్ట్.. వైన్ నాణ్యత చెక్ చేయడానికి 3 సింపుల్ టెస్ట్‌లు
మరోవైపు రహమత్ నగర్ కార్పొరేటర్ cn రెడ్డి పేరు కూడా ప్రధానంగా పరిశీలనలో ఉందట. ఇటీవల పిసిసి… ఎఐసిసి కార్యదర్శుల సమావేశంలో కూడా cn రెడ్డి పేరు చర్చకు వచ్చినట్టు తెలిసింది. స్థానికంగా ఉన్న నాయకుడు, నియోజక వర్గంలో మంచి పట్టున్నట్టు చెప్పుకుంటున్నారు. ఇక తెర వెనక మరో వ్యక్తి పేరు కూడా చర్చలో ఉంది. మాజీ ఎంపీ రంజిత్ రెడ్డిని బరిలో దించితే ఎలా ఉంటుందన్న ఆలోచన కూడా చేస్తున్నారట పార్టీ పెద్దలు. ఆయన్ని బరిలో దింపడం వ్యూహాత్మకం కావచ్చని, ఐతే… ఇది అంతర్గతం ఎత్తుగడలో భాగం కావచ్చని అంటున్నారు. సాధారణంగా కాంగ్రెస్‌లో ఇవాళ జరిగిన చర్చ రేపు… రేపటి చర్చ ఎల్లుండి ఉండదు. అభ్యర్ధుల ఎంపికలో కూడా.. ఎప్పటికప్పుడు స్ట్రాటజీ మారుతూనే ఉంటుంది. కానీ… ఈ చర్చలు ఇలాగేకొనసాగుతుంటే… పోటీ దారులు…పెరక్క తప్పదన్న వాదన బలపడుతోంది. వ్యూహాత్మకంగా ఉన్నామని పార్టీ భావిస్తుండవచ్చుగానీ…అంతర్గత లొల్లికి తావు ఇవ్వకుండా చూడాలన్నది కాంగ్రెస్ వర్గాల మాట.