Check Wine Quality: ఈ రోజుల్లో వైన్ తాగడం నిజంగా కొంత మందికి ఫ్యాషన్ అయిపోయింది. సరే ఇంతకీ తాగే వైన్ మంచిదో కాదో ఎప్పుడైనా ఆలోచించారా. లేకపోతే ఇప్పటి నుంచి ఆలోచించండి. తాగే ముందు ఒకసారి ఈ సింపుల్ టెస్ట్‌తో చెక్ చేయండి. ఎందుకైనా మంచిదిల చెక్ చేస్తే పోయేది ఏముంది చెప్పండి. సరే ఇంతకీ ఆ టెస్ట్ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..
READ ALSO: Charlie Kirk: చార్లీ కిర్క్‌ను చంపింది 22 ఏళ్ల టైలర్ రాబిన్సన్.. హత్య చేసింది ఇందుకేనా..
వైన్ నిపుణురాలు సోనాల్ హాలండ్ మాట్లాడుతూ.. ఈ మధ్య కాలంలో చెడిపోయిన వైన్‌ను అందిస్తున్న సందర్భాలు వెలుగుచూస్తున్నాయని అన్నారు. అందుకే ఒకసారి తాగే ముందు అది మంచిదా లేదా చెడిపోయిందా అనేది గుర్తించాలని సూచిస్తున్నారు. చెక్ చేయడం అంత కష్టం కాదని, వైన్ చూడటం ద్వారా అది చెడ్డదా, కాదా అని సులభంగా చెప్పవచ్చని అంటున్నారు.
వైన్ నిపుణురాలు సోనాల్ హాలండ్ మాట్లాడుతూ.. వైన్ అనేక కారణాల వల్ల చెడిపోతుందని తెలిపారు. సూర్యకాంతి వైన్‌పై పడితే అది చెడిపోయే ప్రమాదం పెరుగుతుంది. సూర్యకాంతి కారణంగా వైన్‌లో చర్యలు జరిగి దాని రుచి చెడిపోతుంది. వైన్‌లోపలికి గాలి చేరినప్పుడు అది చెడిపోతుంది. వైన్ రంగు మారితే అది చెడిపోయిందని సూచిస్తుందని అన్నారు. ఎరుపు వైన్ రంగులో గోధుమ రంగులోకి మారడం లేదా తెల్లటి వైన్ రంగు పసుపు రంగులోకి మారడం చూస్తే, అది చెడిపోయిందని అర్థం అంటున్నారు. ఇలా వైన్ రంగు మారడం అనేది ఆక్సీకరణ ప్రక్రియ వల్ల జరుగుతుందని చెబుతున్నారు. ఒక ఆపిల్‌ను కత్తిరించినప్పుడు, దాని రంగు గోధుమ రంగులోకి మారుతుంది కదా అచ్చం అలాంటిదే అన్నట్లు.
వైన్ వాసనలో మార్పు కూడా అది చెడిపోతోందని సూచిస్తుందని చెబుతున్నారు. ఒక పర్ఫెక్ట్ వైన్ తాజాగా పండ్ల వాసనను కలిగి ఉంటే, అది వైన్ తాజాదనాన్ని తెలియజేస్తుందని అంటున్నారు. వాసన తాజాగా లేకపోతే, అది వైన్‌లో వచ్చే మార్పుకు సంకేతం అంటున్నారు. వైన్‌లో వెనిగర్ లేదా నెయిల్ పాలిష్ రిమూవర్ వాసన వస్తే, అది చెడిపోతుందని అర్థం. ఈ వైన్ ఇకపై తాగడానికి పనికిరాదని సూచించారు.
READ ALSO: Off The Record: బాన్సువాడ కాంగ్రెస్లో బీభత్సంగా గ్రూప్వార్, మళ్లీ బీఆర్ఎస్లోకి జంపింగ్స్..?