Elon Musk X: ఇకపై ‘ఎక్స్’ ఉచితం కాదు.. డబ్బులు కట్టాల్సిందే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
X will charge 1 dollar annual fee for basic features: ఎక్స్ (ట్విటర్)లో ఇప్పటికే ఎన్నో మార్పులు తీసుకొచ్చిన ఆ సంస్థ అధినేత ఎలాన్ మస్క్.. తాజాగా మరో మార్పునకు సిద్ధమయ్యారు. ఇకపై ఎక్స్ ఉచితం కాదని, ఎక్స్ వాడాలంటే ప్రతి యూజర్ డబ్బు చెల్లించాల్సిందే అని స్వయంగా మస్క్ వెల్లడించారు. ఇజ్రాయెల్ ప్రధానితో భేటీ సందర్భంగా ఈ విషయం చెప్పారు. కొత్త సబ్‌స్క్రిప్షన్ మోడల్‌ను పరీక్షించేందుకు ఎక్స్ సిద్ధమైందని, ప్రస్తుతానికి ఈ కొత్త సబ్‌స్క్రిప్షన్ పాలసీని ప్రయోగాత్మకంగా న్యూజిలాండ్, ఫిలిప్పీన్స్‌లో అందుబాటులోకి తెచ్చామని మస్క్ పేర్కొన్నారు.
‘నాట్ ఎ బాట్’ అనే కొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ న్యూజిలాండ్, ఫిలిప్పీన్స్ దేశాలలో ఈరోజు నుండి ప్రారంభమవుతుంది. కొత్తగా ఎక్స్ ఖాతా తెరిచే యూజర్లు ఏడాదికి 1 డాలర్ చెల్లించాల్సి ఉంటుంది. వెబ్ వెర్షన్‌లో ఇతరుల సందేశాలను రీపోస్ట్ చేయడం, లైక్ చేయడం, బుక్‌మార్క్ చేయడం, ఇతరుల ఖాతాలను మెన్షన్ చేయడం లాంటి ఫీచర్లు కావాలనుకునే వారు ఈ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. కేవలం ఖాతా తెరిచి.. పోస్ట్‌లను చదవడం ఫొటోలు-వీడియోలు చూడ్డానికి ఎలాంటి డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు. ప్రస్తుతానికి దీన్ని కొత్త యూజర్లకు మాత్రమే పరిమితం చేసింది. ఇప్పటికే ఎక్స్ ఖాతా ఉన్న వారిపై ఎలాంటి ప్రభావం ఉండదు.
Also Read
- Dharmana Krishnadasu: వర్షాలు లేక సాగు ఆలస్యం.. ఎరువులు లేక రైతుల అవస్థలు.. ధర్మాన కృష్ణదాసు ఆవేదన..
- Krishna Delta Water Crisis: 90 శాతం భూముల్లో సాగు కాలేదు.. కృష్ణా డెల్టా పరిస్థితిపై పేర్ని నాని కీలక వ్యాఖ్యలు
- Gang R*ape Case: మద్యం తాగించి, తుపాకీతో బెదిరించి సామూహిక అత్యాచారం..! బీజేపీ మాజీ ఎమ్మెల్యే సహా ఇద్దరిపై కేసు
- KAAKA: రూమర్స్‌కి చెక్మెట్.. సంక్రాంతి బరిలో చిరంజీవి ‘కాక’ ఫిక్స్.!
ఎక్స్‌లో నకిలీ ఖాతాల బెడదపై ఎలాన్ మస్క్ ఎప్పటినుంచో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నకిలీ ఖాతాలను అరికట్టడం కోసం ఇప్పటికే చర్యలు చేపట్టారు. తాజాగా తీసుకొస్తున్న సబ్‌స్క్రిప్షన్ కూడా అందులో భాగమేనని. దీని వల్ల నకిలీ ఖాతాలకు అడ్డుకట్ట పడే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేసింది. అయితే సబ్‌స్క్రిప్షన్ ఛార్జీలు దేశాన్ని బట్టి మారతాయి. భవిష్యత్తులో ఇతర దేశాలలో కూడా సభ్యత్వ రుసుము ప్రారంభించబడుతుందని, ఇప్పటికే ఉన్న వినియోగదారులను దాని పరిధిలోకి తీసుకురావచ్చని సమాచారం.
Also Read: IND Playing 11 vs BAN: శార్దూల్, సిరాజ్ ఔట్.. బంగ్లాదేశ్‌తో బరిలోకి దిగే భారత్ తుది జట్టు ఇదే!
ఇప్పటికే ‘ఎక్స్ ప్రీమియం’ పేరిట ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ను ఎక్స్ అందుబాటులో ఉంచింది. దీని వల్ల యూజర్లు తమ ట్వీట్లను ఎడిట్ చేయడం, సుదీర్ఘ సందేశాలను పోస్ట్ చేయడం, ఫోల్డర్ల బుక్ మార్క్, యాప్ ఐకాన్‌ను మార్చుకోవడం చేసుకోవచ్చు.
Starting today, we’re testing a new program (Not A Bot) in New Zealand and the Philippines. New, unverified accounts will be required to sign up for a $1 annual subscription to be able to post & interact with other posts. Within this test, existing users are not affected.
This…
— Support (@Support) October 17, 2023
- Tags
- Elon Musk
- Elon Musk X
- Fee
- subscription
- X
తాజావార్తలు
-
Sarah Shahi: బెడ్రూమ్ సీన్లలో హీరోల స్పర్శ తగలకుండా ఆ బాల్తోనే.. బోల్డ్ సీన్స్ అసలు గుట్టు విప్పిన హీరోయిన్!
-
Dharmana Krishnadasu: వర్షాలు లేక సాగు ఆలస్యం.. ఎరువులు లేక రైతుల అవస్థలు.. ధర్మాన కృష్ణదాసు ఆవేదన..
-
Sanju Samson: ఇక ఫెయిల్ అవ్వడు.. హాఫ్ సెంచరీలే.. సంజు శాంసన్‌పై సన్నీ కీలక వ్యాఖ్యలు!
-
Tollywood: లాస్ట్ మినిట్ టెన్షన్స్.. చిన్న సినిమాల మేకర్స్ కి ఏమైంది?
-
Prithviraj Sukumaran: రాజమౌళితో అంత ఈజీ కాదు, పిండేస్తారు.. పృథ్వీరాజ్ సుకుమారన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!