Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Are Kcr And Arvind Kejriwal Going To Team Up

KCR :కేసీఆర్, అరవింద్ కేజ్రీవాల్ జట్టు కట్టబోతున్నారా..?

Published Date :May 22, 2022 , 11:19 am
By Premchand Chowdary
KCR :కేసీఆర్, అరవింద్ కేజ్రీవాల్ జట్టు కట్టబోతున్నారా..?
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

దేశానికి ప్రత్యామ్నాయ అజెండా కావాలని గతంలో ప్రకటించిన గులాబీ దళపతి, తెలంగాణ సీఎం కేసీఆర్‌.. ఆ దిశగా వడి వడిగా అడుగులు వేస్తున్నారు. తాజాగా కేసీఆర్‌ జాతీయస్థాయి పర్యటనలో కీలక భేటీలు ఆసక్తి కలిగిస్తున్నాయి. ఫ్రంట్‌లు కాదు.. ప్రత్యామ్నాయ అజెండా కావాలని అన్నప్పుడే వివిధ పార్టీల నేతలతో సమావేశమై చర్చించారు కేసీఆర్. తమిళనాడు సీఎం స్టాలిన్‌, మహారాష్ట్ర సీఎం ఉద్దవ్‌ థాక్రేతోపాటు ప్రగతి భవన్‌కు వచ్చిన పలు జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీల నేతలతో మాట్లాడి చర్చలను ముందుకు తీసుకెళ్లారు. 2019 సార్వత్రిక ఎన్నికల ముందు తర్వాత వివిధ పార్టీల నాయకులతో సమావేశమైనా.. తాజాగా నిర్వహిస్తున్న భేటీలు మాత్రం చాలా బలమైన లక్ష్యంతోనే సాగుతున్నాయి…అందుకే సీఎం కేసీఆర్ ఢిల్లీ, చండీగఢ్‌ పర్యటనలపై ఆసక్తి నెలకొంది.

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్‌ఆద్మీపార్టీ ముందుగా దేశ రాజధాని.. తర్వాత పంజాబ్‌లో అధికారంలోకి వచ్చింది. మరిన్ని రాష్ట్రాల్లో పాగా వేయాలనే ఆలోచనతో త్వరలో ఎన్నికలు జరిగే వివిధ అసెంబ్లీ ఎన్నికలపై ఫోకస్‌ పెడుతోంది. అలాంటి ఆప్‌ చీఫ్‌తో సీఎం కేసీఆర్ ప్రత్యామ్నాయ అజెండాపై చర్చించే వీలుందా? అనేది ప్రశ్న. కేంద్ర ప్రభుత్వం గతంలో తీసుకొచ్చిన మూడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిర్వహించిన ఉద్యమంలో దాదాపు 600 మంది రైతులు చనిపోయారు. ఆ రైతు కుటుంబాలకు 3 లక్షల చొప్పుల ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించారు కేసీఆర్‌. ఆ క్రమంలోనే చండీగడ్‌ టూర్‌ పెట్టుకున్నారు. ఈ సందర్భంగానే ఆప్‌ చీఫ్‌తో అజెండాపై చర్చిస్తారని ఒక వాదన.

Also Read

  • Off The Record : కాకినాడ ఎంపీ పనితీరుపై జనసేనలోనే అసహనం!
  • Off The Record : బెంగాల్ తర్వాత టార్గెట్ తెలంగాణేనా..?
  • Off The Record : ఎన్టీఆర్ జిల్లాలో బలమైన కాపు నేతల కోసం వైసీపీ వెదుకులాట
  • Off The Record : టేకాఫ్ ఉంటుందా? లేదా పర్మినెంట్ ల్యాండిగేనా?
Add as a preferred
source on google

గతంలోనే సీఎం కేసీఆర్.. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌తో సమావేశం కావాలనుకున్నా వర్కవుట్ కాలేదని ప్రచారం జరిగింది. టీఆర్‌ఎస్‌ సర్కార్‌ను వివిధ సందర్భాలలో ఆప్‌ టార్గెట్‌ చేసిన ఉదంతాలు ఉన్నాయి. తాజాగా తెలంగాణలోనూ పార్టీని విస్తరించాలని చూస్తోంది ఆమ్‌ ఆద్మీ పార్టీ. కొంత కసరత్తు కూడా మొదలుపెట్టింది. ఈ తరుణంలో ప్రత్యామ్నాయ అజెండా దిశగా రెండు పార్టీల చర్చలు ఎంత వరకు ముందుకెళ్తాయన్నది ఆసక్తి రేకెత్తిస్తోంది. గతంలో ప్రగతి భవన్‌కు వచ్చి సీఎం కేసీఆర్‌తో సమావేశమైన ఎస్పీ చీఫ్‌ అఖిలేష్‌యాదవ్‌.. తాజాగా ఢిల్లీలో మరోసారి భేటీ అయ్యారు. ఈ క్రమంలో ఫోకస్‌ ఆప్‌పై నెలకొంది. మరి.. ప్రత్యామ్నాయ అజెండాపై టీఆర్ఎస్‌తో కలిసి వచ్చే పార్టీల జాబితాలో ఆప్‌ కూడా చేరుతుందో లేదో చూడాలి.

 

 

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Aam Aadmi Party
  • AAP
  • Arvind Kejriwal
  • kcr
  • Telangana Politics

తాజావార్తలు

  • Tamil Nadu: తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్‌కు లైన్‌క్లియర్.. రేపే ప్రమాణస్వీకారం

  • DC vs KKR: టాస్ గెలిచిన కేకేఆర్.. ఢిల్లీ ఫస్ట్ బ్యాటింగ్!

  • Hantavirus: వెలుగులోకి హంటావైరస్ కేసులు.. భారత్‌లో వైద్య నిపుణుల కీలక సూచనలు..

  • Tamil Nadu: అన్నాడీఎంకేకు మద్దతు ఇవ్వాలని డీఎంకే చెప్పింది.. లెఫ్ట్ పార్టీల సంచలన వ్యాఖ్యలు..

  • Britannia Biscuit: బిస్కెట్ ప్రియులకు బ్యాడ్ న్యూస్.. పెరగనున్న బ్రిటానియా ధరలు, తగ్గనున్న బిస్కెట్లు!

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions