Off The record: మిత్రపక్షం టీడీపీకే షాకిచ్చిన బీజేపీ నేత..!
- అడారి ఆనంద్‌కు ఏపీ బీజేపీ ఉపాధ్యక్ష పదవి..
- పొలిటికల్ చెక్ ట్రయల్స్‌ను లాబీయింగ్‌తో తిప్పికొట్టారా?..
- టీడీపీతో అడారి ఫ్యామిలీకి మూడున్నర దశాబ్దాల అనుబంధం..
- ఒకప్పుడు ఆనంద్ తండ్రి తులసీరావుది కింగ్ మేకర్ పాత్ర..
- విశాఖ డెయిరీ దన్నుతో ఐదు నియోజకవర్గాల్లో అడారి ప్రభావం..
- 2019కి ముందు యాక్టివ్ పాలిటిక్స్‌లోకి అడారి ఆనంద్..
- నాడు అనకాపల్లి టీడీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ, ఓటమి..
- పవర్‌లోకి వచ్చాక విశాఖ డెయిరీ మీద దృష్టి పెట్టిన వైసీపీ..
- అనూహ్యంగా వైసీపీ కండువా కప్పుకున్న ఆనంద్..
- అప్పుడు తండ్రి టీడీపీలో, కొడుతు వైసీపీలో..
- ఊహించని విధంగా బీజేపీలోకి అడారి ఆనంద్ జంప్..
- ఇప్పుడు టీడీపీ నేతలు ఆరోపణల్ని కొనసాగిస్తారా?..
- మిత్ర పక్షం రాష్ట్ర ఉపాధ్యక్షుడి మీద ఎంక్వైరీ అడుగుతారా?..
- హౌస్ కమిటీ విచారణ ముందుకు వెళ్తుందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The record: షార్ట్ కట్‌లో కాషాయ కండువా కప్పుకున్న ఆ లీడర్ మిత్ర పక్షం టీడీపీకే మాస్టర్ స్ట్రోక్ ఇచ్చారా? బీజేపీ ఆయనకు పెద్ద పదవి ఇస్తే… తెలుగుదేశం లీడర్స్‌కి ఎందుకు మండుతోంది? ఎంక్వైరీలతో పాత, కొత్త లెక్కలు తేల్చేసుకుందామని అనుకుంటే సీన్ రివర్స్ అయ్యింది ఎక్కడ? ఎవరా లీడర్? ఏంటా కడుపు మంట కహానీ?
Read Also: Drugs Mafia: డ్రగ్స్, గంజాయి మత్తులో తూగుతున్న కాలేజీ పోరగాళ్లు.. 50 మందికి పాజిటివ్!
Also Read
అడారి ఆనంద్ కుమార్.. ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు. కాషాయ కండువా కప్పుకున్న ఆరు నెలల్లోనే… అది కూడా ఎలాంటి సంఘ్ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా రాష్ట్ర స్థాయి కీలక పదవి లభించడం కమలదళంలో కొత్త ట్రెండ్. ఇప్పుడీ పరిణామం బీజేపీ కంటే టీడీపీ వర్గాల్లోనే ఆసక్తికరమైన చర్చకు తెరతీసింది. కారణం, రాజకీయంగా చెక్ పెట్టేందుకు జరిగిన ప్రయత్నాలను లాబీయింగ్ ద్వారా తిప్పికొట్టడంలో ఆనంద్ సక్సెస్ అవ్వడమేనంటున్నారు. టీడీపీతో ఆడారి ఫ్యామిలీది మూడున్నర దశాబ్దాల అనుబంధం. ఉమ్మడి విశాఖ జిల్లా రాజకీయాలు విజయ విశాఖ కో ఆపరేటివ్ డెయిరీ చుట్టూ తిరుగుతుంటాయి. ఐదు నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఎంపిక చేసేది టీడీపీ హైకమాండ్ అయినా తెరవెనుక వ్యూహాలను అమలు చేసి పార్టీకి విజయాలను అందించడంలో విశాఖ డెయిరీ మాజీ చైర్మన్ అడారి తులసీరావుది కింగ్ మేకర్ ఇమేజ్. మాడుగుల, చోడవరం, పెందుర్తి, యలమంచిలి, అనకాపల్లి నియోజకవర్గాల్లో రైతులు, పాల డెయిరీ సంఘాలతో ఉన్న నెట్ వర్క్ కారణంగా… అభ్యర్థుల గెలుపు ఓటములను నిర్దేశించే స్థాయిలో ఆయన లాబీయింగ్ చేసేవారనేది టీడీపీ వర్గాల టాక్. ఈ కారణంతోనే డెయిరీ వ్యవహారాలపై వచ్చిన ఆరోపణల మీద 2004 – 2009 మధ్య అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ నిర్వహించింది.
Read Also: Rahul Gandhi : ఓటు చోరీ కోసమే ఆ కొత్త చట్టాన్ని బీజేపీ తీసుకొచ్చింది
అయితే, ఆ నివేదికలు., యా జమాన్యంపై తీసుకున్న చర్యలు బహిర్గతం కాకపోగా అసలు చర్చల్లోకి రావడం మానేసి చాలా కాలం అయింది. ఈ పరిస్థితుల్లో.. 2019ముందు తెలుగుదేశం పార్టీలో యాక్టివ్ పాలిటిక్స్ ప్రారంభించారు తులసీరావు కుమారుడు అడారి ఆనంద్ కుమార్. తండ్రి కేవలం తెర వెనక రాజకీయం చేయగా.. ఆనంద్ మాత్రం ఆన్ స్క్రీన్ ఎంటరైపోయారు. 2019 ఎన్నికల్లో అనకాపల్లి లోక్‌సభ సీట్లో టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగారాయన. రాజకీయ కుటుంబం, సామాజిక, ఆర్థికంగా పటిష్టంగా ఉండటంతో ఆనంద్‌పై ఆఖరి నిముషంలో అభ్యర్థిని మార్చి కొత్త స్కెచ్ వేసి సక్సెస్ అయింది వైసీపీ. అనూహ్యంగా గవర సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ సత్యవతి అభ్యర్థిగా నిలిపిన ఫ్యాన్ పార్టీ భారీ విజయం నమోదు చేసింది. ఇక వైసీపీ అధికారంలోకి వచ్చాక కుటుంబ పాలనగా వున్న విజయ విశాఖ డెయిరీపై పాలకవర్గం మీద దృష్టి సారించిందనే ప్రచారం జరిగింది.
Read Also: Crime News: కుండలో బంగారు నాణేలు దొరికాయని.. రూ.20 లక్షలు టోకరా! చివరికి ఏమైందంటే?
ఆ ప్రచారం నడుమే.. ఎవ్వరూ ఊహించని విధంగా.. వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు ఆనంద్. తండ్రి టీడీపీకి స్టాండ్ అయితే కుమారుడు వైసీపీలో యాక్టివ్ పాలిటిక్స్ మొదలెట్టారు. గ్రేటర్ విశాఖపై పట్టు బిగించడం ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్న వైసీపీ.. 2024 ఎన్నికల్లో విశాఖ పశ్చిమ నియోజకర్గంపై ఫోకస్ పెట్టింది. ఆ క్రమంలో టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గణబాబుపై పోటీ చేసిన ఆనంద్.. బలమైన అభ్యర్థిగా ప్రొజెక్ట్ అవ్వడంతో ఫలితాలు వచ్చే వరకు ఉత్కంఠ కొనసాగింది. కానీ, కూటమి వేవ్, వైసీపీ అంతర్గత రాజకీయాలు కారణంగా ఆనంద్ ఓడిపోయినట్టు చెప్పుకుంటారు. దీంతో ఆయన యాక్టివ్ పాలిటిక్స్‌కు దూరం అవుతారని, వ్యాపారాలపైనే దృష్టి సారిస్తారనే ప్రచారం జరిగింది. అందుకు తగ్గట్టుగానే కొన్ని నెలలు కామ్‌గా ఉన్నారు అడారి. అదే సమయంలోలో కూటమి పార్టీలు కీలక ఆరోపణలను తెరపైకి తెచ్చాయి.
Read Also: Fake Liquor Labels: మీరు తాగుతున్న మద్యం క్వాలిటీనేనా? అసలు మ్యాటరేంటంటే?
విశాఖ డెయిరీ నిధులు గోల్ మాల్ అయ్యాయని, కుటుంబ పాలన కారణంగా నష్టం జరుగుతోందని, పాడి రైతుల కష్టానికి ఫలితం లేకుండా పోతోందని ఆరోపించింది టీడీపీ. డెయిరీ యాజమాన్యం ప్రభుత్వ భూమిని కలిపేసుకుందంటూ జనసేన మరో విషయాన్ని బయటపెట్టింది. ఈ పరిణామాలన్నిటి మధ్య… విచారణ కోసం శాసనసభ లో పట్టుబట్టింది టీడీపీ. దీంతో విచారణకు హౌస్ కమిటీని నియమించారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు. జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ నేతృత్వంలోని కమిటీ క్షేత్ర స్థాయి పర్యటన జరిపి.. అసలు వచ్చిన ఫిర్యాదుల కంటే ఎక్కువ, ఇంకా తీవ్రమైన అవకతవకలు జరిగినట్టు అభిప్రాయపడింది. లెక్కలు తీసేందుకు సాంకేతిక సహకారం కూడా అవసరమని భావించింది. దీంతో విశాఖ డెయిరీలో అడారి ఫ్యామిలీ హవా ముగిసినట్టేనన్న ప్రచారం మొదలైంది. కీలకమైన డైరెక్టర్లు టీడీపీలోకి జంప్ అయిపోవడంతో డెయిరీ పాలిటిక్స్ ఆసక్తికరంగా కనిపించాయి.
Read Also: Lord Ganesh: 4,000 మంది విద్యార్థులు, 5,000 దీపాలతో అద్భుతం.. వైరల్ వీడియో
ఈ వ్యూహాలను ఆనంద్ ఎలా ఎదుర్కొంటారన్న చర్చ జరుగుతుండగానే మాస్టర్ స్ట్రోక్ ఇచ్చారాయన. అనూహ్యంగా బీజేపీ తీర్థం పుచ్చేసుకోవడం…..దానికి పార్టీ ముఖ్య నాయకత్వం నుంచి పూర్తిస్థాయి సానుకూలత వ్యక్తం కావడం ఆసక్తికర పరిణామం. కేవలం డెయిరీ మీద పట్టు నిలబెట్టుకోవడం కోసమే ఆనంద్ సేఫ్ గేమ్ ఆడారన్న అభిప్రాయం వ్యక్తం అయింది. అదలా ఉండగానే… ఇప్పుడు అడారికి రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్ష పీఠం లభించింది. ఇది కూటమిలో ప్రధాన భాగస్వామిగా వున్న తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఊహించనిది. ఇప్పుడు కూడా టీడీపీ నాయకులు అడారి అవినీతి గురించి బహిరంగంగా మాట్లాడతారా? మిత్రపక్షం రాష్ట్ర ఉపాధ్యక్షుడి మీద విచారణ కోరతారా అన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు హౌస్ కమిటీ విచారణ ఎంత సమర్ధవంతగా ముందుకు వెళుతుందన్నది బిగ్ క్వశ్చన్. అడారి ఎత్తును టీడీపీ చిత్తు చేస్తుందా? లేక మన కూటమిలోకి వచ్చేశాడు కదా అని సర్దుకుపోతుందా అన్నది ఆసక్తికరంగా మారింది.
తాజావార్తలు
-
Harish Rao: సామాన్యుడిపై ధరల భారం.. ప్రభుత్వం నిద్రమత్తులో ఉందా?
-
ICC fine: వెస్టిండీస్‌తో ఓటమి.. టీమిండియాకు బిగ్ షాక్ ఇచ్చిన ఐసీసీ..
-
Oppo F35, F35 Pro: ఒప్పో F35, F35 Pro భారత్‌లో లాంచ్.. రూ.38,999కే 8,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్!
-
Supreme Court: జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు
-
Karimnagar Collectorate : కలెక్టరేట్లో బిగ్ షాక్.. తృటిలో తప్పిన ప్రమాదం.!
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?