Fake Liquor Labels: మీరు మద్యం కొనుగోలు చేసేటప్పుడు ఎప్పుడైనా క్వాలిటీ గమనించారా? పోనీ లేబుల్ అయినా కరెక్ట్‌గా చూసుకునే కొనుక్కున్నారా? ఎందుకంటే.. కొంత మంది కేటుగాళ్లు కల్తీ మద్యం తయారు చేయడమే కాదు.. నకిలీ లేబుళ్లు వేసి.. వినియోగదారులను బురిడీ కొట్టిస్తున్నారు. అలాంటి ఓ గ్యాంగ్‌ను హైదరాబాద్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణలోని నకిలీ మద్యం తయారు చేస్తున్న ముఠాలతో సంబంధం పెట్టుకుని దందా చేస్తున్నట్లు గుర్తించారు.
Crime Love: ప్రేమించుకున్న ఇద్దరు అబ్బాయిలు.. భార్యాభర్తల్లా కలిసిందామనుకొని చివరకు?
ఖరీదైన మద్యం.. అప్పుడప్పుడు తక్కువ ధరలోనే దొరుకుతుంది. దాన్ని చూసి చాలా మంది ఆఫర్ పెట్టారేమో అనుకుంటారు. కానీ వెనుక ఉన్న అసలు నిజం తెలిస్తే షాకవుతారు. ఇక్కడ చూడండి.. ఇవన్నీ మద్యం బాటిళ్ల మీద ఉండే లేబుళ్లు, బార్ కోడ్ స్టిక్కర్లు, సీల్ వేసే స్టిక్కర్లు. ఇక్కడే ప్రింట్ చేస్తున్నారు. నిజానికి ఇది అంతా దొంగ దందా. హైదరాబాద్ కుషాయిగూడలో ఈ దొంగ దందా నడుస్తోంది. పక్కా సమాచారంతో పోలీసులు ఈ దందా చేస్తున్న ఫ్యాక్టరీపై రైడ్ చేశారు. ఇక్కడ ఎక్సైజ్ శాఖకు సంబంధించిన మద్యం అంటూ నమ్మించేందుకు నకిలీ లేబుల్స్ తయారు చేస్తున్నారు.
Mahbubnagar: రేబిస్ ఫోబియా.. తల్లి, కూతురుని బలి!
దాన్ని గుర్తించిన పోలీసులు.. మద్యం లేబుళ్లతోపాటు మిషన్లు కూడా సీజ్ చేశారు. ఇందులో భాగం 15 రకాల సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. ఈ ఫ్యాక్టరీని నడిపిస్తున్న వ్యక్తిని గడ్డమీది నవీన్ గౌడ్‌గా గుర్తించారు. ఏసీ బ్లాక్ విస్కీ, నంబర్ 1 ఎంసీ విస్కీ, ఓల్డ్ అడ్మిరల్ బ్రాండీ, కేరళ మాల్ట్ విస్కీ, రాయల్ స్టాగ్ విస్కీ లాంటి ప్రీమియమ్ బ్రాండ్లకు నకిలీ లేబుల్స్ తయారు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అలాగే కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని కల్తీ మద్యం తయారీదారులతో సంబంధాలు ఏర్పాటు చేసుకుని దందా చేస్తున్నారన్నారు.