The Paradise : నాని.. ఏం డెడికేషన్ అబ్బా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నాని హీరోగా, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ‘దసరా’ అనే సినిమా రూపొంది ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమా నానిలోని సరికొత్త యాంగిల్ ను తెలుగు సహా పాన్ ఇండియన్ ఆడియన్స్ కు పరిచయం చేసింది. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్లో ‘డి పారడైజ్’ అనే సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలోని ఒక కీలక ఫైట్ సీన్ RFC లో నిర్మించిన ప్రత్యేకమైన సెట్ లో ఈ 15 రోజుల లెంతీ ఫైట్ షెడ్యూల్ షూట్ చేశారు. ఈ ఫైట్ అద్భుతంగా కుదిరిందని ఫైట్ చూస్తుంటే గూజ్ బంప్స్ మూమెంట్స్ గ్యారెంటీ అని అంటున్నారు. నాని చాలా ప్యాషన్ , డెడికేషన్ తో కష్టపడి ఈ ఫైట్ సీక్వెన్స్ షూట్ చేసినట్లుగా సమాచారం. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు 12 గంటల పాటు సుమారు 15 రోజులపాటు ఇదే ఫైట్ సీక్వెన్స్ షూట్ చేసినట్లు తెలుస్తోంది. షూటింగ్ లోకేషన్ అంతా దుమ్ముతో కూడి ఉంటుందని అక్కడ కాసేపు ఉండడమే ఇబ్బంది అనుకుంటే నాని ఏకంగా 15 రోజులు పాటు అలా షూటింగ్లో పాల్గొనడం ఆయన డెడికేషన్ కి నిదర్శనం అని చెప్పొచ్చు.
Also Read: Akhanda 2: గూజ్ బంప్స్ స్టఫ్ లోడింగ్.. పోటీ పడుతున్న ఓటీటీలు!
Also Read
ఇక సినిమాలో నాని లుక్ ఎలా ఉంటుందో, ఇప్పటికే మనకి క్లారిటీ ఇచ్చేశారు. ఇక ఈ ఫైట్‌లో కూడా అలాంటి లుక్‌తోనే నాని ఉంటాడని అంటున్నారు. ఈ ఫైట్ లొకేషన్ చూసిన వారు నాని డెడికేషన్‌కు హ్యాట్స్ఆఫ్ చెప్పకుండా ఉండలేరు. ఎందుకంటే, ఆ స్థాయిలో ఈ సినిమా ఫైట్‌ను షూట్ చేసినట్లు తెలుస్తోంది. ఎక్కడా వెనక్కి తగ్గకుండా శ్రీకాంత్ ఓదెల ఈ ఫైట్‌ను ప్లాన్ చేసినట్లు చెబుతున్నారు. కేవలం ఈ ఫైట్ ఒక్కటే కాదు సినిమాలోని అన్ని యాక్షన్ బ్లాక్స్ ను ఇదే లెవల్ లో ప్లాన్ చేసినట్టు చెబుతున్నారు.
Also Read:Disha Patani : అందాల ఆరబోతలో దయ లేని దిశా పటాని
రియల్ సతీష్ కంపోజ్ చేస్తున్న ఈ ఫైట్‌లో కొంతమంది ఇంటర్నేషనల్ ఫైట్ కంపోజర్లు పాల్గొన్నారు. సినిమాను అంతర్జాతీయ స్థాయిలో రిలీజ్ చేయబోతున్న నేపథ్యంలో, ఈ ఫైట్‌ను అత్యద్భుతంగా తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది. నిజానికి, ‘దసరా’ క్లైమాక్స్ సీక్వెన్స్ ఒక్కసారిగా హై ఇచ్చేలా శ్రీకాంత్ ఓదెల ప్లాన్ చేశాడు. దానికి మించి ఈ ఫైట్‌తో హై ఇస్తాడని టీమ్ చెబుతోంది. ఈ సినిమాను ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్ మీద సుధాకర్ చెరుకూరి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!