ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సిన రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా పలు కారణాలతో వాయిదా పడిన సంగతి తెలిసిందే. చివరిగా ఈ సినిమాని జూన్ 4వ తేదీన రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి కావడంతో, పోస్ట్ ప్రొడక్షన్ మీద పూర్తిగా ఫోకస్ పెట్టింది టీం. ప్రస్తుతానికి డైరెక్టర్ బుచ్చిబాబు ఈ సినిమా ఎడిటింగ్ లో బిజీగా ఉన్నట్లు సమాచారం.
ఈ సినిమాకి సంబంధించి ఒక్కొక్క డైలాగ్ కూడా చాలా కీలకంగా భావిస్తున్న బుచ్చిబాబు, ఆ డైలాగ్స్ బయటకు వెళ్లకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వాస్తవానికి ఎడిట్ సూట్ దగ్గరకు ఎవరినీ వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఎవరైనా ఎడిట్ రూమ్ దగ్గరకు వెళితే, లోపల నుంచి వినబడే డైలాగ్స్ లీక్ అవుతాయేమో అన్న ఉద్దేశంతో ఆయన ఎవరినీ అలౌ చేయడం లేదని తెలుస్తోంది.
అసలు ఈ సినిమా విషయంలో ఎలాంటి చిన్న పొరపాట్లకు కూడా చోటు ఇవ్వకుండా బుచ్చిబాబు జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని ‘వృద్ది సినిమాస్’ బ్యానర్ మీద సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ తో పాటు సుకుమార్ రైటింగ్స్ సంస్థలు ఈ సినిమాని సమర్పిస్తున్నాయి.
