Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Ntv Exclusives Puri Connects Charmi Kaur To Produce Vijay Sethupathi Puri Jagganth Film

Beggar: పూరీ – విజయ్ సేతుపతి ‘బెగ్గర్’ను వదలని ఛార్మి?

Published Date :March 20, 2025 , 3:44 pm
By Bhargav Chaganti
Beggar: పూరీ – విజయ్ సేతుపతి ‘బెగ్గర్’ను వదలని ఛార్మి?
  • Follow Us :
  • google news
  • dailyhunt

తెలుగు సినిమా పరిశ్రమలో మాస్ డైరెక్టర్‌గా పేరొందిన పూరీ జగన్నాధ్, తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతితో కలిసి ఓ కొత్త సినిమా చేయడానికి సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా గురించి ఇటీవల కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. పూరీ సొంత నిర్మాణ సంస్థ ‘పూరీ కనెక్ట్స్’ బ్యానర్‌పై ఈ సినిమా రూపొందనుందని, ఇందులో ఛార్మి కౌర్ నిర్మాతగా వ్యవహరించనుందని సమాచారం. గతంలో ఈ సినిమా నిర్మాణంలో ఛార్మి ఇన్వాల్వ్‌మెంట్ లేకుండా జరుగుతుందని కొన్ని వార్తలు వచ్చినప్పటికీ, అవి నిజం కాదని తాజా సమాచారం ద్వారా తేలింది. పూరీ జగన్నాధ్‌తో ఎన్నో చిత్రాలను నిర్మించిన ఛార్మి, ఈ ప్రాజెక్ట్‌లోనూ కీలక పాత్ర పోషిస్తున్నట్లు స్పష్టమవుతోంది. ‘లైగర్’, ‘డబుల్ ఇస్మార్ట్’ వంటి చిత్రాల తర్వాత వరుస డిజాస్టర్‌లను ఎదుర్కొన్న పూరీకి ఈ సినిమా ఒక గట్టి కమ్‌బ్యాక్‌గా నిలవనుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ చిత్రానికి ‘బెగ్గర్’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ టైటిల్ అన్ని భాషల్లో అందుబాటులో ఉంటే, అదే పేరును అధికారికంగా ఖరారు చేసే అవకాశం ఉందని సమాచారం.

Vaishnavi Chaitanya: ఎస్కేఎన్ ఎవరి గురించి అన్నారో మరి!

‘బెగ్గర్’ అనే టైటిల్ వినూత్నంగా, ఆకర్షణీయంగా ఉండటంతో ఇప్పటికే సినీ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. విజయ్ సేతుపతి వంటి నటుడితో పూరీ ఎలాంటి కథను అందిస్తారనే దానిపై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. పూరీ జగన్నాధ్ గతంలో ‘పోకిరి’, ‘బిజినెస్‌మ్యాన్’, ‘టెంపర్’, ‘ఇస్మార్ట్ శంకర్’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలతో తన సత్తా చాటారు. అయితే, ఇటీవలి కాలంలో వచ్చిన ‘లైగర్’, ‘డబుల్ ఇస్మార్ట్’ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాయి. ఈ నేపథ్యంలో విజయ్ సేతుపతితో చేయబోయే ఈ కొత్త చిత్రం పూరీకి మళ్లీ విజయాల బాట పట్టించే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. విజయ్ సేతుపతి తాజాగా ‘మహారాజా’ చిత్రంతో తమిళంలో మరోసారి తన నటనా ప్రతిభను నిరూపించుకున్నారు. ఇక ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని ఏకకాలంలో తెరకెక్కించనుండగా పాన్ ఇండియా భాషలలో విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కాంబినేషన్‌లో రాబోయే ‘బెగ్గర్’ సినిమా పూరీ జగన్నాధ్‌కు కొత్త ఊపిరి పోస్తుందా లేదా అనేది చూడాలి. అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Charmi Kaur
  • Puri Connects
  • Puri Jagganth
  • Vijay Sethupathi

తాజావార్తలు

  • Satyadev: మహేష్ బాబుతో సీన్ చేశానని ఊరంతా చెప్పిన.. కానీ కట్ చేస్తే..!

  • RCB-POTM: ఆర్‌సీబీకి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ల వర్షం.. అయితే ఎవ్వరూ మనోళ్లు కాదు సుమీ!

  • Beach: హద్దులు దాటిన జంట.. అందరూ చూస్తుండగా బీచ్‌లో అసభ్య ప్రవర్తన

  • Exclusive : యంగ్ హీరో కెరీర్‌ భారీ బడ్జెట్ సినిమాకు ఆర్థిక ఇబ్బందులు

  • IPL Match Fixing: “5 మ్యాచ్‌ల్లో 42 రన్స్.. కావాలనే ఇలా చేస్తున్నాడు?”.. స్టార్ బ్యాటర్‌పై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు!!

ట్రెండింగ్‌

  • Fatal Surgery: రోగి ప్లీహాన్ని తొలగించబోయి.. కాలేయాన్ని తొలగించిన డాక్టర్.. తర్వాత ఏం జరిగిందంటే..

  • 4K QD Mini-LED టెక్నాలజీ, ప్రీమియం ఫీచర్లతో Xiaomi TV S Mini LED Series 2026 లాంచ్..!

  • 144Hz AMOLED డిస్‌ప్లే, 9020mAh బ్యాటరీ, IP68/IP69 రేటింగ్‌తో VIVO T5 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే.?

  • Google Notice: గూగుల్‌కు నోటీసులు.. మెటా, ఎక్స్(ట్విట్టర్)కు కూడా.. కారణం ఇదే..

  • 1080p ఫుల్ HD, 120 అంగుళాల స్క్రీన్ సపోర్ట్‌తో Portronics Beem 570 ప్రొజెక్టర్ లాంచ్.. ధర కూడా తక్కువే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions