IPL 2025: పిల్లలు సెంచరీలు కొడుతున్నారు…కొంచెమైనా బుద్ది ఉండక్కర్లా!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వేలంలో ఒక ప్లేయర్ భారీ ధర పలికాడంటే.. కొనుగోలు చేసిన ఆ ఫ్రాంచైజీ అతనిపై భారీ ఆశలే పెట్టుకుని ఉంటుంది. కానీ కొందరు కాస్ట్లీ ప్లేయర్లు తమ ఫ్రాంచైజీల నమ్మకాన్ని ఏ మాత్రం నిలుపుకోలేకపోతున్నారు. మ్యాచ్ విన్నర్లు అని కోట్లిచ్చి కొనుక్కుంటే.. జట్టుకు భారమవుతున్నారు. ఈ ఐపీఎల్ లో భారీ ధర పలికిన వారిలో ఇద్దరు స్టార్ ప్లేయర్లు తమ చెత్త ప్రదర్శనతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. అందులో ఒకరు రిషభ్ పంత్ కాగా మరొకరు వెంకటేశ్ అయ్యర్. లక్నో సూపర్ జాయింట్స్ కేఎల్ రాహుల్ ని విడుదల చేసి రిషబ్ పంత్ ని జట్టులోకి తీసుకుంది.
Read More: Story Board : పహల్గామ్ ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం ఎలా? పాక్‌కు గట్టిగా బుద్ధి చెప్పడం ఖాయమేనా?
Also Read
- Tollywood: ఫేక్ హౌస్‌ఫుల్స్... డమ్మీ కలెక్షన్స్! టాలీవుడ్లో కొత్త "మైండ్ గేమ్"!
- Anchor Charmila Exclusive Interview : హీరోయిన్ ఆఫర్'కి నో, డబ్బింగ్ ఆర్టిస్ట్ అవ్వాలనుకున్నా..విజయవాడ ఆర్జే to టాలీవుడ్ సెన్సేషన్!
- Anchor Charmila : స్టార్ ప్రొడ్యూసర్స్ హీరోయిన్ ఆఫర్ ఇచ్చినా వద్దన్న యాంకర్ చర్మిల.. అసలు కారణం ఇదే!
- Charmila Nalluri Background : ట్రెండింగ్ యాంకర్ చర్మిల బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?
ఏకంగా 27 కోట్లతో పంత్ ని తమ జట్టులో చేర్చుకుంది. కానీ పంత్ దారుణంగా విఫలమయ్యాడు. చెత్త షాట్లకు పోయి వికెట్ సమర్పించుకుంటున్నాడు. అతని బ్యాటింగ్ తీరుపై ఎన్ని విమర్శలు వస్తున్నా పంత్ లో మార్పు కనిపించడం లేదు. అవసరం లేని షాట్లకు పోయి పరువు తీసుకుంటున్నాడు. ఈ సీజన్లో రిషబ్ 10 మ్యాచుల్లో 98 స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేసి 110 పరుగులు చేశాడు. ఈ పది మ్యాచుల్లో పంత్ ఒక మ్యాచులో మాత్రమే ఫిఫ్టీ కొట్టాడు. గతేడాది లక్నో కెప్టెన్ గా కేఎల్ రాహుల్ అద్భుతంగా ఆడాడు. 14 మ్యాచుల్లో 4 హాఫ్ సెంచరీలతో 520 పరుగులు చేశాడు. అయినా ఆ జట్టులో అతనికి గౌరవం దక్కలేదు. సన్ రైజర్స్ తో జరిగిన మ్యాచ్ అనంతరం ఆ ఫ్రాంచైజీ ఓనర్ సంజీవ్ గోయెంకా రాహుల్ ని తిట్టడం అప్పట్లో సెన్సేషన్ గా మారింది. దాంతో ఇద్దరి మధ్య బేధాభిప్రాయాలు రావడంతో రాహుల్ లక్నోని వీడాలనుకున్నాడు.
Read More:BHOGI : శర్వానంద్ ‘భోగీ’ ఫస్ట్ స్పార్క్ రిలీజ్..
రాహుల్ స్థానంలో వచ్చిన పంత్ చెత్త ప్రదర్శన కారణంగా పాపం గోయెంకా తలపట్టుకుంటున్నాడు. వేలంలో 23 కోట్ల భారీ ధర పలికిన వెంకటేశ్ అయ్యర్ కూడా కేకేఆర్ ని నిండా ముంచేశాడు. 10 మ్యాచుల్లో ఒక్క హాఫ్ సెంచరీతో 142 పరుగులతో తీవ్రంగా నిరాశపరిచాడు. 7 ఇన్నింగ్స్‌లలో 4 సార్లు 2 అంకెలు స్కోర్ కూడా చేరుకోలేకపోయాడు. వెంకటేశ్ అయ్యర్ మీద ఖర్చు చేసిన డబ్బుని మిచెల్ స్టార్క్,లేదా కేఎల్ రాహుల్ లాంటి ప్లేయర్లు మీద ఖర్చు చేసి ఉంటె ఈ రోజు కేకేఆర్ పరిస్థితి మరోలా ఉండేది. వచ్చే సీజన్ లో లక్నో రిషభ్ పంత్‌ను.. కేకేఆర్ వెంకటేశ్ అయ్యర్‌లను వేలంలోకి వదలడం ఖాయం. ఫ్యాన్స్ కూడా ఇదే భావిస్తున్నారు. పిల్లలు సెంచరీలు కొడుతున్నారు అంటూ విమర్శిస్తున్నారు.
తాజావార్తలు
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్‌కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
-
Dhurandhar : నెట్‌ఫ్లిక్స్‌లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!