Chiru Anil: నయనతార కోసం తగ్గేదేలే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. సంక్రాంతికి వస్తున్నాం లాంటి ఇండస్ట్రీ హిట్ కొట్టిన అనిల్ రావిపూడి, మెగాస్టార్ చిరంజీవితో ఒక ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైనర్ సిద్ధం చేసేందుకు రెడీ అవుతున్నాడు. అయితే, ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎవరు నటిస్తారనే విషయంపై చాలా రోజుల నుంచి ప్రచారం జరుగుతోంది. చాలామంది బాలీవుడ్ హీరోయిన్‌లను కూడా ఈ సినిమాలో నటింపజేసేందుకు ప్రయత్నించారు. కానీ, చివరిగా నయనతారను టీమ్ ఫిక్స్ చేసింది.
Also Read : Vijay : విజయ్ దేవరకొండ నెక్స్ట్ మూవీ లో రష్మిక కన్ఫర్మ్..
Also Read
అనిల్ రావిపూడి నయనతారను ప్రపోజ్ చేయగా, మెగాస్టార్ చిరంజీవి కూడా అందుకు ఒప్పుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి నయనతార కలిసి గతంలో సైరా నరసింహారెడ్డి, గాడ్ ఫాదర్ లాంటి సినిమాలు చేశారు. ఈ సినిమాకు నయనతార 18 కోట్లు డిమాండ్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అది ఇచ్చేందుకు సైతం నిర్మాతలు రెడీగా ఉన్నారని అంటున్నారు. ఎందుకంటే, నయనతారకు ఇతర భాషల్లో మంచి మార్కెట్ ఉంది, తెలుగులో కూడా ఆమెకు మంచి క్రేజ్ ఉంది. ఈ సినిమాను మార్కెట్ దృష్ట్యా ఇతర భాషల్లో కూడా రిలీజ్ చేయవచ్చనే ఆలోచనలతో మేకర్స్ ఆమెకు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. కాస్త అటూ ఇటూ అయినా సరే, ఆమెనే ఫైనల్ చేసి షూట్‌కి వెళ్లే ఆలోచనలో ఉన్నారు. ఈ చిత్రాన్ని సాహూ గారపాటి షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై, అదేవిధంగా మెగాస్టార్ చిరంజీవి కుమార్తె సుష్మిత కొణిదల గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌లపై నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాకు సంబంధించి అనిల్ రావిపూడి ఎంతో కేర్ తీసుకుంటున్నాడు.
తాజావార్తలు
-
Primebook 3 Max: రూ.35,990కే కొత్త ల్యాప్‌టాప్.. 12 గంటల బ్యాటరీ, 8GB RAM, AI ఫీచర్లతో Primebook 3 Max
-
Aadarsha Kutumbam : ‘ఆదర్శ కుటుంబం’ మళ్లీ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
-
Tragedy : ట్యాంక్‌బండ్‌పై విషాదం.. పుట్టినరోజు వేడుకల్లో రెండు ప్రాణాలు బలి..
-
Tamil Nadu Bypolls: తమిళనాడు ఉప ఎన్నికల్లో బిగ్ ఫైట్.. విజయ్ వర్సెస్ స్టాలిన్.!
-
Suvendu Adhikari on UCC: UCCపై సువేందు అధికారి కీలక ప్రకటన.. 6 నెలల్లో ‘లవ్ జిహాద్’, ‘ల్యాండ్ జిహాద్’ చట్టాలు!
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!