మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. సంక్రాంతికి వస్తున్నాం లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తున్న సినిమా కావడంతో పాటు మెగాస్టార్ కామెడీ టైమింగ్‌కి అనిల్ రావిపూడి కరెక్ట్‌గా సూట్ అవుతాడని భావిస్తున్న నేపథ్యంలో ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. దానికి తగ్గట్టుగానే సినిమాలో నయనతార హీరోయిన్గా ఎంపిక చేసినప్పటి నుంచి సినిమా మీద అంచనాలు మరింత పెరిగాయి. ఇక ఈ సినిమా షూటింగ్ శరవేగంగా పూర్తి చేస్తున్నాడు అనిల్ రావిపూడి.
Also Read:Vishwambhara : విశ్వంభర ఆ మూవీకి సీక్వెలా.. వశిష్ట ఏమన్నాడంటే..?
ఇప్పటికే మూడు షెడ్యూల్స్ షూటింగ్ పూర్తి చేసిన ఆయన నాల్గవ షెడ్యూల్ అన్నపూర్ణ స్టూడియోలో ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది. దాని కోసం ప్రత్యేకంగా ఒక సెట్ నిర్మించినట్లుగా తెలుస్తోంది. ఆగస్టు మొదటి వారంలో ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టబోతున్నారు. నిజానికి అనుకున్న షెడ్యూల్స్ ముందుగానే పూర్తి చేస్తూ షూటింగ్ శరవేగంగా పూర్తి చేస్తున్నాడు అనిల్ రావిపూడి. ఈ మధ్యనే మూడవ షెడ్యూల్ షూటింగ్ కేరళలోని అందమైన ప్రదేశాలలో జరిపారు. ఒక సాంగ్ షూట్ అక్కడ జరిపినట్లు తెలుస్తోంది. ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియోలో మాత్రం టాకీ పార్ట్ షూట్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమాని మెగాస్టార్ కుమార్తె సుష్మిత కొణిదెల గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌తో పాటు సాహు గారపాటి షైన్ స్క్రీన్స్ బ్యానర్ మీద నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.