Long Run time With 1 AM Shows May Damage Devara: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన దేవర పార్ట్ వన్ ఈనెల 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. రిలీజ్ కి ఇంకా రెండు వారాలు సమయం ఉండడంతో సినిమా టీం ప్రమోషన్స్ మీద ఫోకస్ చేసింది. ఇప్పటికే ముంబై వెళ్లి ట్రైలర్ రిలీజ్ చేసి రావడమే కాక దాదాపు మీడియా సంస్థలతో పాటు ఇన్ఫ్లుయెన్సర్లతో కూడా తారక రచ్చ చేసి వచ్చాడు. ఒక రెండు మూడు రోజులు ఆగి సౌత్ లో కూడా ప్రమోషన్స్ చేసే ఆలోచనలో ఉన్నారు. ఆ సంగతి పక్కన పెడితే దేవర సినిమాకి రెండు గంటల 57 నిమిషాల నిడివితో సెన్సార్ పూర్తయినట్లు తెలుస్తోంది. ఈ మధ్యకాలంలో ఇంత నిడివితో వచ్చి ప్రేక్షకుల మదిని దోచుకున్న సినిమాలు చాలా తక్కువే.
Tamannah: తమన్నాకు పిల్లలంటే భయం.. కారణం ఏంటో తెలుసా?
ఒక కమర్షియల్ సినిమాకి ఇది చాలా ఎక్కువ రన్ టైం అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దానికి తోడు ఈ సినిమాని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో అర్థరాత్రి ఒంటి గంటకే ప్రదర్శించేలా ఇప్పటినుంచే ప్రయత్నాలు జరుగుతున్నాయి. తెలంగాణలో ఎప్పటినుంచో ఈ సంస్కృతి ఉంది. ఆంధ్రప్రదేశ్లో గత ఐదేళ్లలో కాస్త ఇబ్బంది కానీ ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం కావడంతో ఈజీగానే పర్మిషన్లు రావచ్చని భావిస్తున్నారు. అదే ఇప్పుడు ఎన్టీఆర్ అభిమానులను టెన్షన్ పెడుతోంది. ఎందుకంటే ఒంటిగంటకు ఫ్యాన్ షోస్ వేస్తే ఫ్యాన్స్ తో పాటు ఇతర ఆడియన్స్ కూడా వస్తారు. కానీ ఒంటిగంట నుంచి షోస్ పడితే కనుక మూడు గంటల సినిమా నడిచేటప్పటికీ తెల్లవారుజాము నాలుగవుతుంది. అప్పుడు ప్రేక్షకుల మైండ్ సెట్ వేరేగా ఉంటుందని అభిప్రాయపడుతున్నారు విశ్లేషకులు.
దానికి తోడు ఇప్పటికే ఈ సినిమాకి మంచి హైపుంది. దానికి తోడు సోషల్ మీడియాలో అభిమానులతో పాటు కొంతమంది సినీ టెక్నీషియన్లు కూడా ఆ హైప్ ని మరింత పెంచుతున్నారు. ఇంత హైప్ ఉన్న నేపథ్యంలో అర్ధరాత్రి ఒంటిగంట షోస్ వేయడం ఇబ్బందిగా అంశమే. ఎందుకంటే ఒకవేళ సినిమా ఏ మాత్రం అంచనాలకు తగ్గట్టుగా లేకపోయినా నెగటివ్ టాక్ విపరీతంగా బయటికి స్ప్రెడ్ అవుతుంది. సాధారణంగా ఏ ఉదయం 10 గంటల షోకో లేక పదకొండు గంటల షోకో వెళితే పెద్దగా ఫీల్ అవ్వరు. కానీ ఒకవేళ అర్ధరాత్రి సినిమాకి వెళ్లి అది ఏ మాత్రం నిరాశపరిచినా నెగిటివ్ టాక్స్ స్ప్రెడ్ అయ్యే విషయంలో దాని ఇంపాక్ట్ డబల్ ఉంటుంది. కొరటాల ఇచ్చిన కంటెంట్ మీద నమ్మకం ఉంటే మాత్రమే ఒంటిగంట షోస్కు వెళ్లాలని లేదంటే సైలెంట్ గా ఎర్లీ మార్నింగ్ షోస్ ప్లాన్ చేసుకోవచ్చు అని కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ విషయంలో సినిమా యూనిట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి మరి.