Kubera : కుబేర.. శేఖర్ కమ్ముల సినిమానా.. లేదంటే ధనుష్ సినిమానా.. లేదా నాగార్జున మూవీనా. ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే రచ్చ. ఎందుకంటే మూవీలో బలమైన పాత్ర ధనుష్ ది. మార్కెట్ జరిగింది తెలుగు స్టేట్స్ లో. ఇదే అందరికీ ఆశ్చర్యంగా అనిపిస్తోంది. సాధారణంగా మూవీలో మెయిన్ రోల్ ఎవరిదైతే హవా అంతా వారిదే ఉంటుంది. అతనే మూవీకి మెయిన్ హీరో అవుతాడు. అతని ఏరియాలోనే మూవీకి బజ్, బిజినెస్ ఉంటాయి. కానీ కుబేరలో అంతా రివర్స్ అయింది.
read also : Anchor Shyamala: పవన్ కళ్యాణ్ ఎక్కడైనా కనిపించారా?.. ప్లకార్డ్ ప్రదర్శించిన శ్యామల!‘
పోనీ ధనుష్ కంటే పెద్ద పాన్ ఇండియా స్టార్ కుబేరలో ఉన్నారా అంటే లేదు. ధనుష్ సినిమాల కలెక్షన్లతో పోలిస్తే నాగార్జున సినిమాల కలెక్షన్లు తక్కువే. అలాంటప్పుడు ధనుష్ కు భారీ ఫాలోయంగ్ ఉన్న తమిళంలో కుబేరకు కనీసం ధనుష్ మామూలు సినిమాలకు జరిగినంత మార్కెట్ కూడా జరగలేదు. తమిళనాడులో కుబేర బిజినెస్ రూ.20కోట్లు. తెలుగులో రూ.33 కోట్లు. ఇదే ఇప్పుడు సర్వత్రా చర్చకు దారి తీస్తోంది. సినిమా పోస్టర్లు, టీజర్లు, ట్రైలర్ అన్నీ ధనుష్ ను హైలెట్ చేశాయి.
అలాంటప్పుడు ధనుష్ ను బేస్ చేసుకుని మార్కెట్ ఎందుకు జరగలేదు. మూవీ డైరెక్టర్ తెలుగు వ్యక్తి. కీలక పాత్ర చేసిన నాగార్జున తెలుగు వ్యక్తి. పైగా టాలీవుడ్ లో బలమైన బేస్ ఉన్న వారే వీరిద్దరూ. తెలుగునాట అక్కినేని ఫ్యామిలీకి ఉన్న ఇమేజ్ కావచ్చు.. శేఖర్ కమ్ముల సినిమాలపై ఉన్న నమ్మకం కావచ్చు. ఈ రెండింటి వల్ల తెలుగు స్టేట్స్ లో మార్కెట్ రూ.33 కోట్లు జరిగింది. ఇదేమంత భారీ బిజినెస్ కాకపోయినా.. తమిళంతో పోలిస్తే ఎక్కువే. ధనుష్ కు పాన్ ఇండియా మార్కెట్ ఉంది.
ఆయన సినిమాలు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంలో మంచి వసూళ్లు సాధిస్తాయి. శేఖర్ కమ్ముల సినిమాలు ఇప్పటి వరకు పాన్ ఇండియా లెవల్లో రాలేదు. నాగార్జున సినిమాలు పాన్ ఇండియాలో ఆడిన సందర్భాలు అసలే లేవు. మరి ఎటు చూసుకున్నా ధనుష్ ను బేస్ చేసుకునే పాన్ ఇండియా బిజినెస్ అయినా.. తమిళ బిజినెస్ అయినా జరగాలి. కానీ తెలుగు బిజినెస్ ఎక్కువ జరగడమేంటి. సినిమాలో డైరెక్టర్, సీనియర్ స్టార్ హీరో ఉండటం వల్ల దీన్ని తెలుగు సినిమాగా చూస్తున్నారా అనిపిస్తోంది. ఇప్పటి వరకు ఇలాంటి కుడి ఎడమైన సందర్భాలు లేవు. మూవీ చూసిన వారంతా ధనుష్ పర్ఫార్మెన్స్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
బిచ్చగాడి పాత్రలో జీవించేశాడని మెచ్చుకుంటున్నారు. ఒకవేళ ప్రీ రిలీజ్ బిజినెస్ తమిళంలో ఎక్కువ జరిగి ఉంటే నిర్మాతకు భారీ లాభాలు వచ్చేవే. ఎందుకంటే తమిళంలో ఎంత బిజినెస్ జరిగినా ధనుష్ పర్ఫార్మెన్స్ తో రాబట్టుకోవచ్చు. కానీ బ్యాడ్ లక్. తమిళ మార్కెట్ కుబేరను ఆశించిన స్థాయిలో పట్టించుకోలేదు. పైగా ధనుష్ కూడా ప్రమోషన్లలో పెద్దగా పాల్గొనకపోవడం ఇంకో మైనస్ అయింది. తెలుగునాట వచ్చే కలెక్షన్లు ఎవరికి క్రెడిట్ ఇస్తాయో చూడాలి.
read also : RajaSaab : ప్రభాస్ సినిమా ‘రాజాసాబ్’ టీజర్ లీక్‌పై ఫిర్యాదు.