NTRIVIKRAM: పురాణాలకు, జన్యుశాస్త్రానికి లింక్.. ఏం చేస్తున్నావయ్యా త్రివిక్రమ్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కాంబినేషన్లలో జూనియర్ ఎన్టీఆర్, ‘మాటల మాంత్రికుడు’ త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కలయిక ఒకటి. వీరిద్దరి కలయికలో రాబోతున్న తాజా మూవీ ప్రకటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తూ ఒక అద్భుతమైన పోస్టర్ ద్వారా బయటకు వచ్చింది. నిజానికి ఈ సినిమా కార్తికేయుని జీవితం ఆధారంగా రూపొందనుందని ప్రచారం జరిగింది. దానికి ఊతం ఇస్తూ అధికారికంగా ప్రకటించారు.
ఈ పోస్టర్ ను షేర్ చేస్తూ జూనియర్ ఎన్టీఆర్ తన సోషల్ మీడియాలో రాసుకొచ్చిన వాక్యాలు ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. “The Son of Shiva. The Pride of Parvathi. The Eternal Commander. And, once again with TRIVIKRAM.” పరమశివుని పుత్రుడు, పార్వతీమాత గర్వకారణం అంటూ నేరుగా సుబ్రహ్మణ్య స్వామి (కార్తికేయుడు) జననాన్ని గురించి హింట్ ఇచ్చారు. తారకాసురుడిని సంహరించడానికి ఉద్భవించిన ఆ పరమశివుని తేజస్సును ఈ సినిమా కథకు ఆధారంగా తీసుకున్నట్లు కూడా చెప్పకనే చెప్పి ఉండొచ్చు.అలానే కుమారస్వామి దేవతల సైన్యానికి అధ్యక్షుడు (దేవ సేనాధిపతి). ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర ఒక మహా సైన్యాన్ని నడిపించే వీరుడిగా లేదా సాక్షాత్తూ ఆ దేవసేనాధిపతి అంశతో జన్మించిన యోధుడిగా ఉండబోతోందని ఈ పదం బలంగా చెబుతోంది. అయితే పోస్టర్ తో పాటు చిత్ర బృందం విడుదల చేసిన మరో పవర్ ఫుల్ కోట్ కూడా కధ మీద మరిన్ని అంచనాలు పెంచుతోంది.
Also Read
“Born in the North. Forged in the Heartland. Worshipped in the South. Now… A tale destined to belong to the universe” అనే వాక్యాలకు మీనింగ్ పరిశీలిస్తే కుమారస్వామి జననం హిమాలయాల దరిదాపుల్లోని శరవణ భవ (రెల్లు గడ్డి) లో జరిగిందని పురాణాలు చెబుతున్నాయి. ఇక ఆ శివకుమారుడు పెరిగి పెద్దవాడై, అస్త్రశస్త్రాలు ధరించి తన శక్తులను కూడదీసుకున్న ప్రదేశాన్ని ఇది సూచిస్తోంది. బహుశా కథలో హీరో ప్రయాణం కూడా ఇలాగే సాగుతుందేమో అని అనుకోవచ్చు. కుమారస్వామిని దక్షిణ భారతదేశంలో (ముఖ్యంగా తమిళనాడులో ‘మురుగన్’ గా, తెలుగు రాష్ట్రాల్లో ‘సుబ్రహ్మణ్యేశ్వరుడు’ గా) అత్యంత భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తారు. ఉత్తర, దక్షిణ భేదాలు లేకుండా యావత్ భారతదేశాన్ని ఏకం చేసే ఆ స్కంద తత్వాన్ని ఇప్పుడు “పాన్-ఇండియా” లేదా “పాన్-వరల్డ్” స్థాయిలో విశ్వవ్యాప్తం చేయబోతున్నారని హిట్ ఇస్తుండడంతో ఇది కేవలం ఒక ప్రాంతానికి పరిమితమయ్యే కథ కాదు, యూనివర్సల్ అప్పీల్ ఉన్న కథ అని అర్ధం అవుతోంది.
ఇక పోస్టర్ చూస్తె ఈ సినిమా ఒక సాధారణ కమర్షియల్ ఎంటర్టైనర్ కాదని, ఒక వినూత్నమైన సోషియో-ఫాంటసీ లేదా పౌరాణిక నేపథ్యం ఉన్న కథ అని స్పష్టమవుతోంది. పోస్టర్ లో ప్రధానంగా మన దృష్టిని ఆకర్షించేది యుద్ధభూమిలో నిటారుగా గుచ్చుకుని ఉన్న ఒక భారీ ఆయుధం. పైకి చూడటానికి ఇది పరమశివుని త్రిశూలంలా కనిపిస్తున్నప్పటికీ, నిశితంగా గమనిస్తే దీనికి కుమారస్వామి (సుబ్రహ్మణ్య స్వామి) ఆయుధమైన ‘వేల్’కు మధ్య ఒక బలమైన సంబంధం ఉంది.
పోస్టర్ లో ఇంగ్లీషులో రాసిన “ONE SPEAR | ONE PURPOSE | ONE DIVINE RECKONING” అంటే (ఒక అస్త్రం, ఒకే లక్ష్యం, ఒక దైవిక తీర్పు) అనే వాక్యాలు ఈ ఆయుధం ఒక మహాశక్తివంతమైన ‘వేల్’ అని నిర్ధారిస్తున్నాయి. ఈ పోస్టర్ లో అత్యంత ఆసక్తికరమైన మరియు ఆశ్చర్యకరమైన అంశం ఆయుధం పైభాగం. ఆయుధం చుట్టూ కమ్ముకున్న పొగ, మబ్బులు కలిసి ఒక డి.ఎన్.ఏ ఆకృతిని ఏర్పరిచాయి. పౌరాణిక కాలం నాటి ఆయుధానికి, ఆధునిక జీవశాస్త్రం అలానే జన్యుశాస్త్రానికి మధ్య దర్శకుడు త్రివిక్రమ్ ఏదో బలమైన లింక్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇది కర్మ సిద్ధాంతం గురించా? లేక వంశపారంపర్యంగా వచ్చే ఒక దైవిక శక్తి గురించా? అన్నది కథపై మరింత ఆసక్తిని పెంచుతోంది.
దానికి తోడు పోస్టర్ మధ్యలో ఒక అద్భుతమైన సంస్కృత శ్లోకం పొందుపరచబడింది. ఆ శ్లోకం ఆదిశంకరాచార్యులు రచించిన సుబ్రహ్మణ్య భుజంగం లోనిది కావచ్చు లేదా కుమారస్వామిని స్తుతించే మరొక శక్తివంతమైన మంత్రం అయి ఉండొచ్చని అంటున్నారు.
ఈ కథకు సుబ్రహ్మణ్య స్వామి తత్వానికి ఏదో గట్టి లింకే ఉందని స్పష్టం చేస్తోంది. అలానే కాలిపోతున్న రథాలు, తెగిపడిన గుర్రాల ఆనవాళ్లు, ఎగిరుతున్న ఎర్రటి జెండాలు నెత్తురోడుతున్న ఒక చారిత్రక యుద్ధానికి ప్రతీకగా నిలుస్తున్నాయి. వెనుక భాగంలో మసకగా కనిపిస్తున్న పురాతన ఆలయ నిర్మాణాలు, గోపురాలు ఈ కథ ఏ కాలానికి చెందినది? అనే ప్రశ్నను లేవనెత్తుతున్నాయి. ఇది ఇప్పటి వర్తమానానికి, గతానికి మధ్య జరిగే ఒక ప్రయాణంగా ఉండొచ్చు. ఇక ఎన్టీఆర్ (NTR), త్రివిక్రమ్ (TRIVIKRAM) పేర్లను కలిపి “NTRIVIKRAM”గా డిజైన్ చేసిన విధానం చాలా ఆకర్షణీయంగా ఉంది. రాక్ స్టార్ అనిరుధ్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, నందమూరి తారకరామారావు ఆర్ట్స్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఎస్. రాధాకృష్ణ (చినబాబు), నందమూరి కళ్యాణ్ రామ్ లు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
తాజావార్తలు
-
Montra Electric Auto: రూ.3.97 లక్షలకే మోంట్రా కొత్త ఎలక్ట్రిక్ ఆటో.. ఒక్క ఛార్జింగ్‌తో 180 కి.మీ.కు పైగా రేంజ్!
-
Akvan Cyclone Alert: అక్వాన్ తుఫాన్ ఎఫెక్ట్.. ఉత్తరాంధ్రకు అలర్ట్
-
Xi Jinping Welcomes Trump: ట్రంప్‌కు జిన్‌పింగ్ గ్రాండ్ వెల్కమ్.. ప్రోటోకాల్ పక్కనపెట్టి ఆలింగనం! వైరల్‌గా వీడియో
-
AP High Court: చంద్రబాబుపై కేసుల మూసివేత.. హైకోర్టు కీలక ఆదేశాలు
-
Muslim Population 2035: 2035 నాటికి ప్రపంచంలోనే అతిపెద్ద మతంగా ఇస్లాం?.. ప్యూ రీసెర్చ్ సంచలన అంచనాలు!
ట్రెండింగ్
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో భారత్‌లోకి రానున్న VinFast VF5 ఫేస్‌లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!
-
38 గంటల బ్యాటరీ బ్యాకప్, IP57 రేటింగ్, 11mm డ్రైవర్లతో Xiaomi Clip Earbuds లాంచ్..!
-
21 రోజుల బ్యాటరీ లైఫ్, 150కి పైగా స్పోర్ట్స్ మోడ్ Xiaomi Watch S5 41mm వచ్చేసింది..! Smart Band 11 కూడానూ..