Jani Master: జానీ మాస్టర్ జాతీయ అవార్డు రద్దు కరెక్టేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Is it Correct to Cancel Jani Master National Award: జాతీయ అవార్డు తీసుకునేందుకు ఢిల్లీకి వెళ్లడానికి రెడీ అయిన జానీ మాస్టర్ కు షాక్ తగిలింది. ఆయనకు ప్రకటించిన బెస్ట్ కొరియోగ్రాఫర్ నేషనల్ అవార్డును నిలిపివేస్తూ అవార్డు కమిటీ శనివారం రాత్రి నిర్ణయాన్ని ప్రకటించడం చర్చనీయాంశం అయింది. జానీమాస్టర్‌కు ప్రకటించిన జాతీయ పురస్కారాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు నేషనల్ ఫిల్మ్ అవార్డ్ సెల్ శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. పోక్సో కేసు నమోదైన నేపథ్యంలో అవార్డు నిలిపివేస్తున్నట్లు ఆ సెల్ వెల్లడించింది. నిజానికి 2022 సంవత్సరానికి గాను జాతీయ ఉత్తమ నృత్య దర్శకుడిగా జానీ మాస్టర్ ఎంపికయ్యారు. ఈనెల 8న అంటే రేపే డిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో పురస్కారం పొందేందుకు జానీ మాస్టర్‌కు ఆహ్వానం అందింది. అయితే పోక్సో కేసు నేపథ్యంలో అవార్డు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు, ఆహ్వానపత్రికను రద్దు చేస్తున్నట్లు ప్రకటనలో నేషనల్ ఫిల్మ్ అవార్డు సెల్ వెల్లడించింది.
Shocking: బాయ్‌ఫ్రెండ్‌తో పెళ్లికి ఒప్పుకోలేదని.. 13 మందికి విషం పెట్టి చంపిన యువతి..
Also Read
గత సెప్టెంబర్ 16న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై అతని వద్ద పని చేసి ఇప్పుడు స్వతంత్రంగా సినిమాలు చేస్తున్న ఒక కొరియోగ్రాఫర్ లైంగిక వేధింపుల కేసును పెట్టారు. ఈ వేధింపులు 2019 నుంచి ఉన్నాయని 2017లో జానీ మాస్టర్ పరిచయం అయ్యారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆమె పేర్కొంది. 2019లో అతని బృందంలో సహాయ నృత్య దర్శకురాలిగా చేరగా అదే ఏడాది ముంబయిలో ఓ సినిమా చిత్రీకరణ నిమిత్తం వెళ్లామని తెలిపింది. అక్కడ హోటల్ గదిలో తనపై జానీ మాస్టర్ అత్యాచారం చేశారని వెల్లడించింది. ఈ విషయం ఎవరికైనా చెబితే ఇక డ్యాన్స్ చేయవని బెదిరించినట్లు, సినిమా పరిశ్రమలో ఇక ఎప్పటికీ పని చేయలేవని లొంగ తీసుకున్నట్లు ఫిర్యాదులో తెలిపింది. దీన్ని అవకాశంగా తీసుకున్న జానీ హైదరాబాద్‌లో కూడా పలుమార్లు అత్యాచారం చేసినట్లు తెలపగా ఈ మేరకు రాయదుర్గం పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేయగా ఆ కేసు నార్సింగికి బదిలీ చేశారు. ఇక పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ చేశారు.
ఇక ఆ అవార్డుల కార్యక్రమానికి హాజరయ్యేందుకు జానీ మాస్టర్ మధ్యంతర బెయిల్ కూడా పొందారు. 6 నుంచి 9 వరకు జానీ మాస్టర్ కు బెయిల్ లభించింది. అయితే ఇప్పుడు అవార్డు రద్దు కావడంతో ఆయన బెయిల్ పై బయటకు రావడం కష్టమే. అయితే ఇంకా ఆరోపణలు రుజువు కాకుండా ఇలా జాతీయ అవార్డుని తాత్కాలికంగా రద్దు చేయడం కరెక్ట్ కాదు అనే వాదన వినిపిస్తోంది. జానీ మాస్టర్ మీద ఎవరైనా కావాలనే ఇలా ఆరోపణలు చేయించి ఉండవచ్చు అని అంటున్నారు. ఆయన అవార్డు ప్రకటించిన తర్వాతే ఈ ఆరోపణలు తెరమీదకు వచ్చాయి. ఆయన అవార్డు అందుకోకూడదు అనే ఉద్దేశంతోనే ఎవరైనా రెచ్చగొట్టి ఆమెను ఫిర్యాదు చేయించి ఉండవచ్చు. కాబట్టి ఈ విషయంలో పునరాలోచించాలని జానీ మాస్టర్ అభిమానులు పలువురు సినీ ప్రముఖులు ఆఫ్ ది రికార్డ్ కామెంట్ చేస్తున్నారు. అయితే పోక్సో చట్టం కింద కేసు కావడంతో తమ బాధ్యతగా తన తప్పు లేదని జానీ మాస్టర్ నిరూపించుకునే దాకా దాన్ని తాత్కాలికంగా రద్దు చేయడం కరెక్ట్ అని కొందరు కామెంట్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Dhruv Rathee: “గుండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
-
Chennai Metro Phase 2: చెన్నై మెట్రో ఫేజ్-2 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సీఎం విజయ్‌తో కలిసి మెట్రో ప్రయాణం!
-
Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
-
Dragon : రామోజీఫిల్మ్ సిటీలో వేటకు టైగర్ రెడీ..14 నుండి షూటింగ్లో అడుగుపెట్టబోతున్న ఎన్టీఆర్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
ట్రెండింగ్
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!