నందమూరి బాలకృష్ణ హీరోగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘అఖండ’ (తాండవం కాదు) అనే సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉంది కానీ, పలు కారణాలతో వాయిదా పడి ఎట్టకేలకు డిసెంబర్ 12వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా మొదటి ఆట నుంచి మంచి పాజిటివ్ టాక్ దక్కించుకుంది. అయితే, ఈ సినిమా లాజిక్స్‌కు అందకుండా ఉందని కొంత నెగటివ్ ప్రచారం అయితే సోషల్ మీడియాలో జరిగింది. తాజాగా, మీడియా ప్రతినిధులతో మాట్లాడిన బోయపాటి శ్రీను ఈ అంశం మీద స్పందించారు.
ఆయన మాట్లాడుతూ, తాను ఈ సినిమాలో అన్ని లాజిక్ ప్రకారం ఉండేలా చూసుకున్నానని అన్నారు. వాస్తవానికి ఏ అంశాన్ని అయినా విభేదించగల వారు ఎక్కడైనా ఉంటారని ఆయన అన్నారు. ఒక విషయం ఒకరికి నచ్చవచ్చు, ఒకరికి నచ్చకపోవచ్చు. కానీ, నేను మాత్రం పర్ఫెక్ట్ లాజిక్స్‌తోనే సినిమా రాసుకున్నాను.
ఒక అష్టసిద్ధి సాధన సుమారు 14 నుంచి 16 సంవత్సరాల పాటు సాగుతుందని, అది చేసిన తర్వాత ఆ సాధన చేసిన వారికి మానవాతీత శక్తులు వస్తాయని ఆయన అన్నారు. అలాగే, ఈ సినిమాలో కూడా అఖండ అష్టసిద్ధి సాధన చేశాక, ఆయన చేయి తగిలితేనే శవాలు లేచేలా పరిస్థితి ఉంటుందని తాను ముందుగానే హింట్ ఇచ్చానని అన్నారు. ఈ విషయాన్ని అర్థం చేసుకోకుండా ట్రోల్ చేసే వాళ్ళు చేస్తున్నారని అన్నారు. తాను ఈ సినిమా లాజిక్స్ విషయంలో ఎక్కడా పొరపాటు చేయలేదని ఈ సందర్భంగా ఆయన కామెంట్ చేశారు.
