Anchor Charmila Exclusive Interview : హీరోయిన్ ఆఫర్’కి నో, డబ్బింగ్ ఆర్టిస్ట్ అవ్వాలనుకున్నా..విజయవాడ ఆర్జే to టాలీవుడ్ సెన్సేషన్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సినిమా ఈవెంట్లకు యాంకరింగ్ చేయడం అంత సులువైన పనేమీ కాదు, ఒకరకంగా కత్తి మీద సాము లాంటి విషయమే. కానీ, ఈ మధ్యకాలంలో లీడింగ్ యాంకర్స్ తో పాటు ఒక కొత్త ముఖం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఏకంగా స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, స్టార్ ప్రొడ్యూసర్ కం డైరెక్టర్ ఎమ్.ఎస్. రాజు సైతం ఆమెను తమ సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తావా అని అడిగేంతగా, ఆమె ఇప్పుడు వరుస ఈవెంట్లతో దూసుకుపోతోంది. అందం మాత్రమే కాదు, సినిమా ఈవెంట్లను హ్యాండిల్ చేయగల స్పాంటేనిటీ ఆమె సొంతం. ఇప్పుడు ఇదంతా ఎవరి గురించి చెప్తున్నామో ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఆమె ఇంకెవరో కాదు, చర్మిల నల్లూరి. ఒక్కసారిగా తెలుగు యువత మోస్ట్ ఫేవరెట్ పర్సన్ గా మారిపోయిన ఆమెను ఎన్టీవీ వెబ్ ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేసింది. ఈ సందర్భంగా ఆమె తన నేపథ్యం, తన మనసులో మాటలు ఎన్టీవీతో పంచుకున్నారు.
Q. హాయ్ చర్మిల, మీ నేపథ్యం ఏమిటి? ఎక్కడ పుట్టారు? ఏం చదువుకున్నారు?
A. నేను పుట్టి పెరిగింది అంతా విజయవాడలోనే. కేఎల్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ లో బీటెక్ చేశాను.
Also Read
Q. అసలు ఈ యాంకరింగ్ వైపు ఆసక్తి ఎలా కలిగింది?
A. నేను యాంకరింగ్ చేయడం కన్నా ముందు విజయవాడ రెడ్ ఎఫ్ఎమ్ లో RJగా పనిచేశాను. అక్కడ పనిచేస్తున్న సమయంలో చాయ్ బిస్కెట్ కంపెనీ నన్ను అప్రోచ్ అయింది. వాళ్లు తాము సిద్ధం చేసిన కొత్త యాప్ లాంచ్ ఈవెంట్ కి నన్ను హోస్ట్ గా వ్యవహరించమని అడిగారు. అలా నా యాంకరింగ్ ప్రస్థానం మొదలైంది.
Q. అయితే అసలు ఆర్జే అవ్వాలి అని ఎలా అనిపించింది?
A. నిజానికి బీటెక్ అయ్యాక నాకు ఒక సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. కాకపోతే ఉద్యోగ జాయినింగ్ కి ఇంకా టైమ్ ఉంది. సాఫ్ట్ వేర్ జాబ్ వచ్చిన సమయంలోనే రెడ్ ఎఫ్ఎమ్ లో కూడా అవకాశం వచ్చింది. ఎలాగో ఖాళీగానే ఉన్నాను కదా అనే ఉద్దేశంతో ఆర్జేగా వర్క్ మొదలుపెట్టాను. అలా అనుకోకుండా RJ అయ్యాను.
Q. మీరు చేసిన ఫస్ట్ సినిమా ఈవెంట్ ఏంటి?
A. నేను చేసిన ఫస్ట్ సినిమా ఈవెంట్ ‘రావు బహదూర్’ సాంగ్ లాంచ్ ఈవెంట్. ఆ రోజు నేను హోస్ట్ చేసిన కార్యక్రమానికి, నా హోస్టింగ్ కి మంచి ప్రశంసలు దక్కాయి. ఆ తరువాత వరుసగా సినిమా ఈవెంట్లకు అవకాశాలు రావడం మొదలైంది. అలా నేను ఫిబ్రవరిలో హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాను. ఆ తరువాత వెనక్కి తిరిగి చూసుకోకుండా వరుస అవకాశాలు వస్తున్నాయి.
Q. మిమ్మల్ని అల్లు అరవింద్ హీరోయిన్ లా ఉన్నారని అన్నారు, MS రాజు ఏకంగా అవకాశం ఇస్తానని అన్నారు. మీకు సినిమాల్లో నటించే ఉద్దేశం ఉందా?
A. లేదండి, నాకు సినిమాల్లో నటించే ఉద్దేశం లేదు. నాకు నటన మీద పెద్దగా ఆసక్తి లేదు, మా తల్లిదండ్రులకు కూడా నేను నటించడం ఇష్టం లేదు. వారి మాట మీరి నేను నటన వైపు అడుగులు వేయాలనుకోవడం లేదు. యాంకరింగ్ లోనే మరింత పైస్థాయికి వెళ్లాలని అనుకుంటున్నాను. నాకు డబ్బింగ్ మీద ఆసక్తి ఉండేది, డబ్బింగ్ ఆర్టిస్ట్ అవ్వలనుకున్నాను. కానీ ఇప్పుడు యాంకరింగ్ మీదనే ఫోకస్ అంతా ఉంది.
Q. చాలా తక్కువ సమయంలోనే మీకు ఇండస్ట్రీ నుంచి, ప్రేక్షకుల నుంచి మంచి ప్రేమ లభిస్తుంది, దీనిపై ఏమనిపిస్తుంది?
A. ఎంతోమంది ఎంతో ప్రయత్నం చేసినా దొరకని అదృష్టం ఇది. నేనైతే అటు ఆడియన్స్ కి చాలా రుణపడిపోయి ఉన్నాను. నా నుంచి ఏమీ ఆశించకుండా వాళ్లు నా మీద అన్ కండిషనల్ లవ్ చూపిస్తున్నారు, వాళ్లకి జీవితాంతం రుణపడి ఉంటాను. అలానే అల్లు అరవింద్ గారు, MS రాజు గారు నా గురించి మాట్లాడిన మాటలు వారి గొప్పతనానికి నిదర్శనం. ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఉన్న నన్ను వాళ్లు అంత ఎంకరేజింగ్ గా మాట్లాడటం కచ్చితంగా వాళ్ల గొప్పతనమే.
ఆల్ ది బెస్ట్ చర్మిల
థ్యాంక్యూ
తాజావార్తలు
-
Tamil Nadu Bypolls: తమిళనాడు ఉప ఎన్నికల్లో బిగ్ ఫైట్.. విజయ్ వర్సెస్ స్టాలిన్.!
-
Suvendu Adhikari on UCC: UCCపై సువేందు అధికారి కీలక ప్రకటన.. 6 నెలల్లో ‘లవ్ జిహాద్’, ‘ల్యాండ్ జిహాద్’ చట్టాలు!
-
Redmi TV X RGB Mini LED 2027 Launched: రూ.40 వేల లోపే 360Hz గేమింగ్ TV.. 85 ఇంచెస్ Redmi కొత్త Mini LED TV లాంచ్
-
Fire Accident : ప్లాస్టిక్ గోదాంలో భగ్గుమన్న మంటలు.. వరుసగా పేలిన కెమికల్ డ్రమ్ములు
-
Petrol Diesel Price: 100 డాలర్లు దాటిన క్రూడ్ ఆయిల్ ధరలు! OPEC+ కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!