Allu Arjun: విజయ్ స్థానంపై కన్నేసిన బన్నీ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడులో సినిమా, రాజకీయం విడదీయలేని బంధం, అందుకే అక్కడ టాప్ హీరో స్థానం కేవలం బాక్సాఫీస్ రికార్డులకు మాత్రమే పరిమితం కాదు, అది ఒక సామాజిక శక్తి అనే చెప్పాలి. రజనీకాంత్, కమల్ హాసన్ వంటి దిగ్గజాలు సీనియర్ల కోటాలోకి వెళ్లడం, విజయ్ రాజకీయాల్లో బిజీ అవ్వడం, అజిత్ సినిమాల కంటే ఎక్కువ రేసింగుల మీదకి వెళ్ళడంతో ఇప్పుడు కోలీవుడ్ తదుపరి వారసుడి కోసం వెతుకుతోంది. ఈ రేసులో స్థానిక హీరోల కంటే పక్క రాష్ట్రం నుంచి వస్తున్న ‘పుష్పరాజ్’ స్పీడ్ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. సూర్య, ధనుష్, కార్తీ వంటి హీరోలకు తమిళనాడులో బలమైన ఫ్యాన్ బేస్ ఉన్నప్పటికీ, గత కొన్ని చిత్రాలు ఆశించిన స్థాయిలో భారీ వసూళ్లను రాబట్టలేకపోయాయి. శివకార్తికేయన్ (SK) వంటి యువ హీరోలు వేగంగా ఎదుగుతున్నా, విజయ్ రేంజ్ ‘మాస్ అప్పీల్’ అందుకోవడానికి ఇంకా సమయం పట్టేలా ఉంది. సరిగ్గా ఇదే గ్యాప్‌ను అల్లు అర్జున్ అందిపుచ్చుకుంటున్నారు.
అల్లు అర్జున్ కేవలం డబ్బింగ్ సినిమాలతో సరిపెట్టుకోకుండా, కోలీవుడ్ నాడి తెలిసిన టాప్ దర్శకులతో నేరుగా చేతులు కలుపుతున్నారు. షారుఖ్ ఖాన్‌కు ‘జవాన్’తో గ్లోబల్ హిట్ ఇచ్చిన అట్లీ, ఇప్పుడు అల్లు అర్జున్‌తో కలిసి ‘రాకా’ అనే భారీ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ చిత్రాన్ని ప్లాన్ చేశారు. ఈ సినిమాతో తమిళ ప్రేక్షకుల మాస్ పల్స్‌ను పట్టుకోవడం బన్నీకి సులువవుతుంది. కోలీవుడ్‌లో ప్రస్తుతం తిరుగులేని బ్రాండ్ LCU లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ చేయబోయే ప్రాజెక్ట్ అనౌన్స్ అయినప్పటి నుంచే కోలీవుడ్ వర్గాల్లో ప్రకంపనలు మొదలయ్యాయి. ‘పుష్ప’ సిరీస్‌తో తమిళనాడులోని బి, సి సెంటర్స్ వరకు బన్నీ పేరు మారుమోగిపోయింది. ఇప్పుడు నేరుగా తమిళ దర్శకులతో భారీ పాన్ ఇండియా ప్రాజెక్టులు చేయడం ద్వారా, ఆయన కేవలం అతిథిగా కాకుండా, కోలీవుడ్ టాప్ ఛైర్లో ఒక వాటాదారుడిగా మారబోతున్నారు. విజయ్ వదిలేస్తున్న స్థానాన్ని భర్తీ చేయడం అంత సామాన్యం కాదు. కానీ అల్లు అర్జున్ ఎంచుకున్న దర్శకులు, ఆ ప్రాజెక్టుల భారీతనం చూస్తుంటే.. 2026 నాటికి కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ‘తగ్గేదే లే’ అంటూ అల్లు అర్జున్ పాగా వేయడం ఖాయంగా కనిపిస్తోంది.
Also Read
- Idupu Kayitham : బంతి భోజనాల్లో 'మందు' కలకలం.. తెలంగాణ సంస్కృతిని కించపరుస్తున్నారా?
- Off The Record: ఎమ్మెల్యే vs మాజీ ఎమ్మెల్యే.. వయా ఎంపీ..!
- Tollywood : మన టాలీవుడ్ 'పాన్ ఇండియా' హీరోలు ఎంత సేఫ్?
- Senior Star Heroes Movies: ప్లానింగ్ లోపమా..? ఓటీటీ నిబంధనలా..? విచిత్ర డైలమాలో సీనియర్ స్టార్స్ సినిమాలు.!
తాజావార్తలు
-
Chairman’s Desk : కేంద్రం అనవసరంగా సర్‌ను వివాదం చేసుకుందా? ప్రతిపక్షాలు ఈ టెంపోను కొనసాగించగలవా?
-
Scene Movie: “హీరోలు చాలు.. ఒక విలన్ కావాలి! లోకేష్‌తో రోలెక్స్ ప్లాన్ నడుస్తోంది”: సూర్య
-
Diwali Lunch Menu Ideas : దీపావళి విందు స్పెషల్.. ఈ వెజ్ మెనూతో అదరగొట్టండి
-
OTR: తెలంగాణపై బీజేపీ మిషన్ స్టార్ట్.. అమిత్ షా సమరశంఖం
-
Off The Record: గులాబీ పార్టీలో కొత్త తలనొప్పులు.. మాజీ ఎమ్మెల్యేల సీట్లకే ఎసరు?
ట్రెండింగ్
-
రూ.10,999కే 50MP కెమెరా ఫోన్, 7000mAh బ్యాటరీతో Karbonn Rebel సిరీస్ లాంచ్..!
-
Women’s Cricket World Cup 2025: తొలిసారి విశ్వవిజేతగా నిలిచి ఏడాది.. ప్రపంచకప్‌తో చరిత్ర తిరగరాసిన భారత అమ్మాయిలు..!
-
ఆస్ట్రేలియాకు షాక్.. Hong Kong Sixes 2026 విజేతగా ఆఫ్ఘనిస్థాన్..!
-
మళ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి Karbonn.. Rebel సిరీస్‌లో రానున్న ఫోన్లు..!
-
9000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz డిస్ప్లేతో OnePlus Turbo 6Vs స్మార్ట్‌ఫోన్ లాంచ్..!