15 Years of Chay Special Story: అక్కినేని నట వారసుడిగా రంగ ప్రవేశం చేసిన నాగచైతన్య తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమై 15 ఏళ్లు పూర్తయ్యాయి. ఆయన మొట్టమొదటి సినిమా జోష్ రిలీజ్ ఈరోజే సుమారు 15 ఏళ్ల క్రితం జరిగింది. అప్పటికే తండ్రి పెద్ద హీరో, తాత తెలుగు సినీ పరిశ్రమకే లెజెండరీ స్టార్. మేనమామ మరో పెద్ద హీరో. తమ్ముడు చిన్నప్పుడే సినీ రంగా ప్రవేశం చేశాడు. బంధువర్గంలో చాలామంది హీరోలు ఉన్నారు. అయినా తనదైన శైలిలో మొదటి సినిమాతోనే ప్రేక్షకులలో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేశాడు నాగచైతన్య. మొదటి సినిమా కమర్షియల్ గా సక్సెస్ కాకపోయినా నటుడిగా మంచి పేరు తీసుకువచ్చింది.
తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితులకు సినీ ప్రముఖులు ఎంతెంత విరాళం ఇచ్చారంటే?
తర్వాత చేసిన ఏం మాయ చేసావే సినిమా ఆయన కెరీర్నే ఒక మలుపు తిప్పేసింది. ఆ తర్వాత ఆయన చేసిన 100% లవ్, మనం, ప్రేమ, మజిలీ, వెంకీ మామ, లవ్ స్టోరీ, బంగార్రాజు లాంటి సినిమాలు ఆయనను తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర చేశాయి. లాల్ సింగ్ చద్దా సినిమాతో హిందీ సినీ పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చినా అది పెద్దగా ఆయనకు వర్కౌట్ కాలేదు.
నిజానికి నాగచైతన్యకు తండ్రి తరపు నుంచే కాదు తల్లి తరఫునుంచి కూడా సినీ బ్యాక్ గ్రౌండ్ ఉంది. ఆయన తల్లి డి రామానాయుడు కుమార్తె, దగ్గుబాటి వెంకటేష్ దగ్గుబాటి సురేష్ బాబుల సోదరి. నాగార్జునతో ఆమెకు వివాహం జరిగిన తర్వాత నాగచైతన్య జన్మించాడు. కొన్నాళ్ళకు వారు విడాకులు తీసుకున్న తర్వాత లక్ష్మి అమెరికా వెళ్ళిపోతే నాగార్జున హైదరాబాదుకు బాగా మార్చారు. చైతన్య చెన్నైలోనే పెరిగారు. చెన్నైలోనే స్కూలింగ్ పూర్తి చేసుకున్న ఆయన హైదరాబాదులో కాలేజీ పూర్తి చేసుకున్నాడు. నటన మీద ఆసక్తి ఉందనే విషయం తెలుసుకుని వెంటనే ముంబైలో యాక్టింగ్ కోర్స్ చేయించి నెమ్మదిగా సీనియర్ ప్రపంచం వైపు అడుగులేయించారు.
తనకు మొదటి బ్రేక్ ఇచ్చిన ఏం మాయ చేసావే సినిమా హీరోయిన్ సమంతతో ప్రేమలో పడిన నాగచైతన్య తర్వాత పెద్దలను ఒప్పించి వివాహం కూడా చేసుకున్నాడు. ఇక తర్వాత ఏం ఇబ్బందులు వచ్చాయో ఏమో తెలియదు కానీ ఆ జంట విడిపోయింది. తర్వాత నాగచైతన్య పాన్ ఇండియా స్థాయికి ఎదిగాడు. ఒకపక్క లాల్ సింగ్ చద్దా లాంటి సినిమా చేస్తూనే మరోపక్క దూత లాంటి వెబ్ సిరీస్ చేసి పాన్ ఇండియన్ ప్రేక్షకులకు సైతం పరిచయమయ్యాడు ఇక తర్వాత కస్టడీ అనే సినిమాతో తమిళ తెలుగు భాషల ప్రేక్షకులను పలకరించిన ఆయన ఇప్పుడు తండేల్ అనే ఒక రియల్ లైఫ్ లవ్ స్టోరీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు.
ఇక తన పర్సనల్ లైఫ్ ఒకసారి ఇబ్బంది పడినా వెనకాడకుండా ఇప్పుడు మరో హీరోయిన్ తో ప్రేమలో పడ్డాడు. శోభిత ధూళిపాళ్లతో గత కొన్నాళ్లు డేటింగ్ చేసిన నాగచైతన్య పెద్దలను ఒప్పించి ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. త్వరలోనే వీరు ఇరువురు పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధమవుతున్నారు ఇక తెలుగు సినీ పరిశ్రమలో 15 ఏళ్లు పూర్తి చేసుకున్న నాగచైతన్యకు ఎన్టీవీ శుభాకాంక్షలు తెలుపుతోంది.