Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Nri Ata Vedukalu 2025 Grand Celebrations Across Telugu States Complete Events Schedule

ATA Vedukalu 2025: తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున ‘ఆటా వేడుకలు’.. ఫుల్ డీటెయిల్స్ ఇవే!

Published Date :November 21, 2025 , 8:08 pm
By Sampath Kumar
  • గత ఇరవై సంవత్సరాలుగా 'ఆటా వేడుకలు'
  • ఆటా వేడుకలు డిసెంబర్ 12 నుంచి 27 వరకు
  • గ్రాండ్ ఫినాలే రవీంద్ర భారతిలో
ATA Vedukalu 2025: తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున ‘ఆటా వేడుకలు’.. ఫుల్ డీటెయిల్స్ ఇవే!
  • Follow Us :
  • google news
  • dailyhunt

గత ఇరవై సంవత్సరాలుగా ‘ఆటా వేడుకలు’ పేరుతో అమెరికా తెలుగు సంఘం ఓ వినూత్న కార్యక్రమాన్ని మొదలుపెట్టి నిర్విరామంగా నిర్వహిస్తుంది. తెలుగు భాష, సాహిత్యాలను ప్రేమిస్తూ విశేష  కృషి చేస్తూ వస్తోంది. ఉమ్మడి తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో ప్రారంభమై.. నేడు రెండు తెలుగు రాష్ట్రాలలోనూ (ఏపీ, తెలంగాణ) ఆటా వేడుకలు ఘనంగా జరగటం విశేషం. సాహిత్య, సాంస్కృతిక, విద్యా, ఆధ్యాత్మిక, వ్యాపార లాంటి మరెన్నో రంగాల్లో పలు స్ఫూర్తినిచ్చే కార్యక్రమాల ద్వారా ఆటా తన మిషన్ లక్ష్యాలను చేరుకోవడమే కాకుండా.. తెలుగు తేజాన్ని నాలుగు దిశల విస్తరింప చేస్తూ ఉంది.

విశ్వఖ్యాతిగా మన తెలుగును బహుళ ప్రచారం చేస్తూ భవిష్యత్తు తరాలను ప్రభావిత పరుస్తూ వస్తోంది ఆటా. తేనెలొలుకు తెలుగు తియ్యదనాన్ని ప్రచారం చేస్తూ.. తెలుగు మాతృభాష గల ప్రజలను, భాషాభిమానులను ఆకర్షిస్తూ ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే.. భవిష్యత్తు నిర్మాణానికి ఎంతగానో ఈ ఆటా వేడుకలు ఉపయోగపడుతున్నాయి. ఆటా అధ్యక్షుడు శ్రీ జయంత్ చల్ల గారి సహాయ సహకారాలతో, ఆటా ప్రెసిడెంట్ ఎలెక్ట్ అండ్ ఆటా వేడుకల కమిటీ చైర్ శ్రీ సతీష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆటా వేడుకలు డిసెంబర్ 12 నుంచి 27 వరకు జరగబోతున్నాయి.

డిసెంబర్ 12 రంగా రెడ్డి జిల్లాలో స్కూల్ మౌలిక సదుపాయాల అభివృద్ధి మరియు సాంస్కృతిక కార్యక్రమాలు
డిసెంబర్ 13: సంగారెడ్డి – ఐఐటీలో స్టార్ట్ అప్ పిచ్
డిసెంబర్ 14: హైదరాబాద్‌లో సాహిత్య కార్యక్రమం
డిసెంబర్ 16–17: బిజినెస్ సెమినార్స్ – హైదరాబాద్, విశాఖపట్నం
డిసెంబర్ 20–23: స్పోర్ట్స్, ఎడ్యుకేషన్ కార్యక్రమాలు, స్కూల్ మౌలిక సదుపాయాల అభివృద్ధి, వాటర్ ప్లాంట్, ఉమెన్స్ హెల్త్ క్యాంప్స్
డిసెంబర్ 24–25: పిల్లల కొరకు హెల్త్ క్యాంప్స్ మరియు చారిటబుల్ ప్రోగ్రామ్స్
డిసెంబర్ 27: గ్రాండ్ ఫినాలే రవీంద్ర భారతిలో సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటా అవార్డ్స్ ప్రధానం

Also Read: IBomma Ravi: ముగిసిన ఐబొమ్మ రవి రెండోరోజు విచారణ.. కరేబియన్ దీవుల్లో ఆఫీస్, 20 మంది ఉద్యోగులు!

రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో జరిగే అన్ని కార్యక్రమాలని ముగించుకుని హైద్రాబాద్‌లోని రవీంద్రభారతిలో జరిగే గ్రాండ్ ఫినాలే కార్యక్రమంలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో చక్కటి వినోదాన్ని అందించడానికి సిద్ధమవుతున్నారు ఎందరో కళాకారులు. చివరగా రుచికరమైన విందు భోజనంతో ముగియబోయే ఈ వేడుకలు.. అమెరికాలో బాల్టిమోర్ నగరంలో జులై 31 – ఆగష్టు 2 జరగబోయే ఆటా మహాసభల సన్నాహాల కోసం అందరిలో సరికొత్త ఉత్సాహాన్ని నింపుతుందని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఆటా ఆధ్వర్యంలో పలు సేవ కార్యక్రమాలు రెండూ రాష్ట్రాలలో నిర్వహిచటం గమనార్హం. డిసెంబర్ మాసంలో నిర్వహించే ఆటా వేడుకలలో ప్రవాసులు పెద్ద ఎత్తున పాల్గోవాలిసిందిగా ఆటా బోర్డ్ విజ్ఞప్తి చేసింది. తమ గ్రామాలు, పట్టణాలలో సేవ కార్యక్రమాలు చేయాలనుకునే వారు www.ataworld.org సంప్రదించవలిసిందిగా కోరారు.

Ata Vedukalu

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • American Telugu Association
  • Ata Vedukalu
  • ATA Vedukalu 2025
  • ATA Vedukalu 2025 Dates
  • ATA Vedukalu 2025 Schedule

తాజావార్తలు

  • Gold Rates: బంగారం ధర జోరు.. వెండి ఉపశమనం.. నేటి ధరలు ఇలా..!

  • GDS 2nd Merit List 2026: జీడీఎస్ పోస్టుల 2వ మెరిట్ జాబితా విడుదల.. ఇలా చెక్ చేసుకోండి

  • Kadapa Police Encounter: ప్రేమోన్మాదిపై పోలీసుల కాల్పులు..

  • Mangli: మంగ్లీపై 10 కోట్ల చీటింగ్ కేసు.. అసలు ఏం జరిగిందంటే?

  • Islamabad: ఇరాన్-అమెరికా చర్చల వేళ ఇస్లామాబాద్‌లో హై-టెన్షన్.. భారీగా కమాండోలు మోహరింపు

ట్రెండింగ్‌

  • సరికొత్త కలర్స్, అబ్బురపరిచే డిజైన్, 200MP కెమెరాతో మార్కెట్ ను షేక్ చేయడానికి సిద్దమైన Huawei Pura 90 సిరీస్..!

  • Pillow Cover Stains : నూనె మరకలతో దిండ్లు చెడిపోయాయా.? ఇలా చేస్తే కొత్తలాగే మెరుస్తాయి.!

  • Ragi Bread : ఈస్ట్ అక్కర్లేదు.. గ్లూటెన్ భయం లేదు.. ఆరోగ్యకరమైన ‘రాగి బ్రెడ్’ ఇప్పుడు ఇంట్లోనే.!

  • రికార్డు సృష్టించిన MG Majestor.. రైలును లాగి గిన్నిస్ బుక్‌లో స్థానం!

  • Car Prices Hike: కారు కొనాలనుకుంటే కోనేయండమ్మా.. మే 1 నుండి మరింత కాస్ట్లీ కాబోతున్నాయి..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions