గత ఇరవై సంవత్సరాలుగా ‘ఆటా వేడుకలు’ పేరుతో అమెరికా తెలుగు సంఘం ఓ వినూత్న కార్యక్రమాన్ని మొదలుపెట్టి నిర్విరామంగా నిర్వహిస్తుంది. తెలుగు భాష, సాహిత్యాలను ప్రేమిస్తూ విశేష కృషి చేస్తూ వస్తోంది. ఉమ్మడి తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో ప్రారంభమై.. నేడు రెండు తెలుగు రాష్ట్రాలలోనూ (ఏపీ, తెలంగాణ) ఆటా వేడుకలు ఘనంగా జరగటం విశేషం. సాహిత్య, సాంస్కృతిక, విద్యా, ఆధ్యాత్మిక, వ్యాపార లాంటి మరెన్నో రంగాల్లో పలు స్ఫూర్తినిచ్చే కార్యక్రమాల ద్వారా ఆటా తన మిషన్ లక్ష్యాలను…