Mizoram Election Result 2023: మిజోరం అసెంబ్లీ ఎన్నికలలో ZPM విజయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మిజోరాం అసెంబ్లీ ఎన్నికల్లో జోరామ్ పీపుల్స్ మూవ్‌మెంట్ (జోరం పీపుల్స్ మూవ్‌మెంట్) ఘనవిజయం సాధించింది. ఈసారి అధికార మిజో నేషనల్ ఫ్రంట్ (ఎంఎన్‌ఎఫ్), జోరామ్ పీపుల్స్ మూవ్‌మెంట్ (జెడ్‌పీఎం), కాంగ్రెస్ మధ్య ముక్కోణపు పోటీ ఉంటుందని అందరు భావించారు. అయితే, ఈ ఎన్నికల ఫలితాల్లో అధికార మిజో నేషనల్ ఫ్రంట్ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. 40 సీట్లున్న అసెంబ్లీలో జోరామ్ పీపుల్స్ మూవ్‌మెంట్ (జెడ్‌పిఎం) 27 సీట్లను గెలుచుకుంది. మిజో నేషనల్ ఫ్రంట్ (MNF) 10 స్థానాల్లో గెలుపొందింది. భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు 2 స్థానాల్లో గెలుపొందగా, కాంగ్రెస్ పార్టీ ఒక్క స్థానంలో మాత్రమే విజయం సాధించింది. మరోవైపు ఈ ఎన్నికల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి జొరామ్‌తంగా ఓడిపోయారు. దీంతో.. రాజ్‌భవన్‌లో గవర్నర్ కంభంపాటి హరిబాబును కలిసి తన రాజీనామా లేఖను ఇచ్చారు.
Satyendar Jain: సత్యేందర్ జైన్ మధ్యంతర బెయిల్ పొడిగించిన సుప్రీం కోర్టు..
Also Read
- Sonam Wangchuk: 24 గంటల్లో సీజేపీ నేతల్ని విడుదల చేయాలి, లేదంటే.. సోనమ్ వాంగ్‌చుక్ అల్టిమేటం.!
- Mohammed Shami: భువీని సెలెక్ట్ చేసి.. నన్ను దూరం పెట్టారు: మహ్మద్ షమీ ఎమోషనల్ కామెంట్స్
- Rahul Gandhi: ఎన్ని వేల మంది పోలీసులు వచ్చినా భయపడం.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
- CJP: ‘‘షేమ్.. షేమ్..’’ విమానంలో CJP నేతలకు అవమానం.. తోటి ప్రయాణికుల నుంచి వ్యతిరేకత!
మిజోరంలో విజయం సాధించిన ‘జోరం పీపుల్స్ మూవ్‌మెంట్’ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. అందుకు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో మంగళవారం సమావేశాన్ని నిర్వహించనున్నట్లు ఆ పార్టీ సీనియర్ నాయకుడు, వర్కింగ్ ప్రెసిడెంట్ కె. సప్దంగా తెలిపారు. సెర్చిప్‌లో ఉన్న జెడ్‌పీఎం నాయకుడు లాల్‌దుహోమా.. సోమవారం మధ్యాహ్నం కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలను కలవనున్నట్లు ఆయన చెప్పారు. లాల్‌దుహోమా సెర్చిప్ స్థానంలో పోటీ చేసి తన సమీప ఎంఎన్‌జే అభ్యర్థిపై దాదాపు 3వేల ఓట్లతో గెలుపొందారు.
ఇదిలా ఉంటే.. మిజోరంలో లాల్‌దుహోమా పేరు ఇప్పుడు మార్మోగుతోంది. మాజీ ఐపీఎస్ అధికారి అయిన లాల్‌దుహోమా ఒకప్పుడు ఇందిరా గాంధీ సెక్యూరిటీ ఇన్‌ఛార్జిగా పనిచేశారు. ఆమె స్ఫూర్తితోనే రాజకీయాల్లో అడుగుపెట్టిన లాల్‌దుహోమా.. నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంలో ఎన్నో కష్టసుఖాలు ఎదుర్కొన్నారు. అంతేకాకుండా.. పార్టీ ఫిరాయింపుల చట్టం కింద రెండుసార్లు అనర్హతకు కూడా గురయ్యారు. గెలుపోటములను భరించారు. ఎట్టకేలకు మిజోరంలో 1989 నుంచి వరుసగా రెండు సార్లు ఒకే పార్టీ అధికారంలోకి వచ్చే సంప్రదాయానికి తెరదించుతూ జడ్పీఎంను అధికారానికి చేరువ చేశారు. ఈ క్రమంలో.. మిజోరం కొత్త ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు.
Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ రద్దు.. గెటిట్ విడుదల
ఇదిలా ఉంటే.. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణతో పాటు మిజోరంలో కూడా ఆదివారం ఓట్ల లెక్కింపు జరగాల్సి ఉంది. అయితే.. రాజకీయ పార్టీలు, NGOలు, చర్చిలు, విద్యార్థి సంస్థల నుండి విజ్ఞప్తుల తర్వాత ఎన్నికల ఫలితాల లెక్కింపును ఆపేశారు. క్రైస్తవులు అధికంగా ఉన్న మిజోరాం ప్రజలకు ఆదివారం ప్రత్యేక ప్రాముఖ్యత ఉన్నందున ఎన్నికల సంఘం వాయిదా వేసింది. కాగా.. మిజోరం అసెంబ్లీకి నవంబర్ 7న ఓటింగ్ నిర్వహించగా, రాష్ట్రంలోని 8.57 లక్షల మంది ఓటర్లలో 80 శాతానికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
తాజావార్తలు
-
Sonam Wangchuk: 24 గంటల్లో సీజేపీ నేతల్ని విడుదల చేయాలి, లేదంటే.. సోనమ్ వాంగ్‌చుక్ అల్టిమేటం.!
-
Mohammed Shami: భువీని సెలెక్ట్ చేసి.. నన్ను దూరం పెట్టారు: మహ్మద్ షమీ ఎమోషనల్ కామెంట్స్
-
Vijay Deverakonda : ఏడేళ్ళ ఎక్స్పీరియన్స్ రౌడీ హీరోని మార్చలేదా?
-
Rahul Gandhi: ఎన్ని వేల మంది పోలీసులు వచ్చినా భయపడం.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
-
CJP: ‘‘షేమ్.. షేమ్..’’ విమానంలో CJP నేతలకు అవమానం.. తోటి ప్రయాణికుల నుంచి వ్యతిరేకత!
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!