Virat Kohli: సీల్ తీయని మొబైల్ పోయిందని కోహ్లీ ట్వీట్..జొమాటో రిప్లై అదుర్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం సిద్ధమవుతున్నాడు టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ. నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా మంగళవారం కోహ్లీ ఓ ట్వీట్ చేశాడు. తన కొత్త మొబైల్‌ను పోగొట్టుకున్నానంటూ పోస్ట్ పెట్టాడు. ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అయ్యింది. ‘కొత్త ఫోన్‌ను కనీసం అన్‌బాక్స్ చేయకుండానే పోగొట్టుకోవడం కంటే బాధాకరమైన విషయం మరొకటి ఉండదు. మీరు ఎవరైనా ఆ ఫోన్‌ను చూశారా? ‘అని విరాట్ కోహ్లీ ట్వీట్ చేశాడు. కోహ్లీ ఫోన్ పోయిందనే ఈ ట్వీట్ క్షణాల్లో వైరలవ్వగా.. అతని అభిమానులు ఓదార్చే ప్రయత్నం చేశారు. మరికొందరు మాత్రం తమ ఫన్నీ ట్వీట్లతో నవ్వులు పూయిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో ఇచ్చిన రిప్లై అందరినీ ఆకట్టుకుంటోంది.
Also Read: Virat Kohli: అరుదైన రికార్డు ముంగిట కోహ్లీ..మరో 64 రన్స్ చేస్తే!
Also Read
- AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
- AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
- Story Board: ఏపీలో లోకల్ వార్.. రిజర్వేషన్లు ఎవరికి లాభం..?
- Off The Record: వైసీపీ టు కూటమి వయా జనసేన.. పాత నేతల అసంతృప్తి వెనుక అసలు కథ..!
‘వదిన ఫోన్ నుంచి ఐస్‌క్రీమ్ ఆర్డర్ ఇచ్చేందుకు ఏమాత్రం సందేహించొద్దు. అది కచ్చితంగా మీకు సహాయ పడుతుంది’అని జొమాటో రిప్లై ఇచ్చింది. ఈ ట్వీట్‌కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఫ్రీగా తమ బిజినెస్‌ను అడ్వైజ్ చేసుకుంటుందని కొందరు ఫ్యాన్స్ కామెంట్ చేయగా.. మరికొందరు మాత్రం జొమాటోలో ఆర్డర్ చేయడం కంటే ఐస్‌క్రీమ్ తినకుండా ఉండటం మేలని కామెంట్ చేస్తున్నారు. మొత్తానికి కోహ్లీ మొబైల్ ఫోన్ పోవడం ఏమో కానీ జొమాటో వార్తల్లో నిలిచింది.
feel free to order ice cream from bhabhi's phone if that will help 😇
— zomato (@zomato) February 7, 2023
ప్రమోషన్లో భాగమేనా..
విరాట్ కోహ్లీ తన ఫ్యామిలీ మెంబర్స్ కోసం ఆ ఫోన్‌ను కొనుగోలు చేయగా.. ఆ మొబైల్‌ను కనీసం ఓపెన్ చేయకుండానే పోయినట్లు నెటిజన్లు అంచనా వేస్తున్నారు. మరికొందరు మాత్రం ఏ మొబైల్ కోసం ఈ పెయిడ్ ట్వీట్ అని విరాట్ ప్రశ్నిస్తున్నారు. వివో ఫోన్ ప్రమోషన్స్‌లో భాగంగానే ఈ ట్వీట్ చేశాడని కామెంట్ చేస్తున్నారు. అయితే విరాట్ తన ట్వీట్లో ఎలాంటి బ్రాండ్స్ మెన్షన్ చేయలేదని, నిజంగానే అతని మొబైల్ పోయినట్లుందని మరికొందరు అంటున్నారు.
తాజావార్తలు
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
-
AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
-
AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!