Zerodha Kite Backup: దేశంలోని ప్రముఖ స్టాక్ బ్రోకరేజ్ సంస్థ జీరోధా (Zerodha) తన వినియోగదారుల కోసం కైట్ బ్యాకప్ (Kite Backup) అనే ప్రత్యేక ఎమర్జెన్సీ మోడ్‌ను ప్రారంభించింది. ఇది వాట్సాప్ (WhatsApp) ద్వారా పనిచేస్తుంది. ప్రధాన ట్రేడింగ్ ప్లాట్‌ఫారమ్ కైట్‌లో సాంకేతిక సమస్యలు లేదా అవుటేజ్ ఎదురైనప్పుడు, ఈ సదుపాయం ద్వారా ట్రేడర్లు తమ పొజిషన్లను క్లోజ్ చేయడం, పెండింగ్ ఆర్డర్లను రద్దు చేయడం చేయగలరు.
ఆన్‌లైన్ ట్రేడింగ్ ప్లాట్‌ఫారమ్‌లు స్టాక్ ఎక్స్చేంజీలతో లీజ్ లైన్ల ద్వారా కనెక్ట్ కావడం నుంచి.. పలు క్లౌడ్ ఇంకా ఫిజికల్ డేటా సెంటర్లలో ఆపరేట్ అవ్వడం వరకు, అనేక సాంకేతిక వ్యవస్థలపై ఆధారపడతాయి. ఈ చైన్‌లో ఏ చిన్న లోపం వచ్చినా సేవలు అంతరాయం కలుగుతాయి. అందువల్ల బ్యాకప్ సిస్టమ్స్ చాలా కీలకం. ఇకపోతే, భారతీయ మార్కెట్ నిబంధనలు బ్రోకర్లకు విస్తృతమైన బ్యాకప్ సిస్టమ్స్ ఉంచడం తప్పనిసరి చేస్తాయి.
Hussainiwala history: ఆ విభజన రేఖతో పాక్‌కు 12 గ్రామాలు.. అసలు భారత్ వాటిని ఎందుకు వదులుకుంది..!
అయితే, కైట్ బ్యాకప్ ఈ నియమాలకు మించి వినియోగదారులకు అదనపు రక్షణను ఇస్తుందని జీరోధా చెబుతోంది. ఇది అమెజాన్ AWS (Amazon AWS), Cloudflare వంటి ప్రధాన హోస్టింగ్ భాగస్వాముల నుండి అలాగే కైట్ వెబ్, మొబైల్ యాప్ నుండి పూర్తిగా స్వతంత్రంగా పనిచేస్తుంది. ఇక ఈ కొత్త సదుపాయంపై జీరోధా సహ వ్యవస్థాపకుడు నితిన్ కమత్ మాట్లాడుతూ.. ట్రేడింగ్ ప్లాట్‌ఫారమ్‌లు చాలా క్లిష్టమైనవి. ఎక్స్చేంజ్ కనెక్షన్ నుంచి క్లౌడ్ సర్వర్‌వరకు ఏ చిన్న లోపం వచ్చినా సమస్యలు వస్తాయి. మేము ఎన్నో భద్రతా చర్యలు తీసుకున్నప్పటికీ, ఇంకా అప్రమత్తంగానే ఉంటాము. అందుకే వాట్సప్ ద్వారా పూర్తిగా స్వతంత్రంగా పనిచేసే ఈ కొత్త ఎమర్జెన్సీ మోడ్‌ను రూపొందించామని తెలిపారు. అలాగే, మార్కెట్ అవర్స్‌లో ఏదైనా పెద్ద సాంకేతిక లోపం వల్ల కైట్ వెబ్, మొబైల్ యాప్ రెండూ పనిచేయకపోతే ఈ మోడ్ ద్వారా ఆర్డర్లు రద్దు చేయడం, పొజిషన్లు క్లోజ్ చేయడం సాధ్యమవుతుందని చెప్పారు.
ఇక ఈ Kite Backup ఎలా ఉపయోగించాలి? అనే కదా మీ ప్రశ్న.. లాగండి అక్కడికి వస్తున్నాం.. ఈ కింద తెలిపిన సూచనలను పాటిస్తే సులువుగా మీరు ఈ సేవలను పొందవచ్చు. మరి అవేంటంటే..
1. మొదట +91 99644 52020 అనే నెంబర్ ను మీ ఫోన్ కాంటాక్ట్స్‌లో సేవ్ చేయండి.
2. ఆ తర్వాత ఆ నెంబర్ తో వాట్సాప్ (WhatsApp) చాట్ ను ప్రారంభించండి.. ఈ నంబర్‌కి “Hi” అని పంపండి.
3. ఆ తర్వాత అక్కడ ప్రాంప్ట్ వచ్చినప్పుడు మీ Zerodha User ID, PAN డీటెయిల్స్ ఇవ్వండి.
4. దానితో మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కు SMS ద్వారా వచ్చిన OTP ను నమోదు చేసి ప్రాసెస్ పూర్తి చేయండి.
Suspicious Death: హత్యా? ఆత్మహత్యా? నర్సింగ్ హోంలో నర్సు అనుమానాస్పద మృతి!
ఈ సేవకు ఎలాంటి అదనపు ఖర్చు లేదు. అనుకోని సాంకేతిక సమస్యల సమయంలో వినియోగదారులకు సేవలను కలిగించడమే ఈ సదుపాయం ఉద్దేశమని కమత్ తెలిపారు.
Trading platforms are ridiculously complex. One hiccup anywhere from exchange connections to cloud servers can create an issue. Over the years, we've built tons of safeguards and redundancies, but we're still paranoid.
Apart from all of this, we've built a new emergency trading… pic.twitter.com/qPoqjnKo1n
— Nithin Kamath (@Nithin0dha) August 14, 2025