YVS Chowdary : అక్టోబర్ 30న తొలిసారి కనిపించనున్న ఎన్టీఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YVS Chowdary : అనేకమంది హీరోలను పరిచయం చేసి సూపర్ హిట్లు అందుకున్నాడు వైవిఎస్ చౌదరి. చివరిగా సాయి ధరమ్ తేజ్ హీరోగా రేయ్ అనే సినిమా చేశాడు. ఇక ఈ సినిమా చేసి చాలా కాలమే అయింది. తర్వాత మరో సినిమా అనౌన్స్ చేయలేదు. కొన్నాళ్ల క్రితం నందమూరి జానకీరామ్ కొడుకు నందమూరి తారకరామారావుని హీరోగా అనౌన్స్ చేస్తూ ఒక ప్రెస్ మీట్ పెట్టడం హాట్ టాపిక్ అయింది. ఒకప్పుడు వైవీఎస్ చౌదరి బ్లాక్‌బస్టర్ చిత్రాలకు కేరాఫ్‌గా ఉండేవారు. ఆయన రూపొందించిన చిత్రాలు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండేవి. అయితే, ఆయన కొంత గ్యాప్ తరువాత ఇప్పుడు మళ్లీ మెగా ఫోన్ పట్టుకున్నారు. అయితే, ఈసారి నందమూరి ఫ్యామిలీ నుండి మరో కొత్త హీరోను ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేయబోతున్నట్లు వైవీఎస్ చౌదరి ఇప్పటికే వెల్లడించారు.
Read Also:Astrology: అక్టోబర్ 26, శనివారం దినఫలాలు
Also Read
- INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
- CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
- India vs Pakistan: అంపైర్లు కూడా భారత్‌కే సపోర్ట్.. పాక్ క్రికెటర్ సంచలన ఆరోపణలు..
- TG20 League: 'హైదరాబాద్ ఈ ఛాంపియన్స్' ఫైనల్ స్క్వాడ్.. ఇదిగో పూర్తి లిస్ట్..
ఈ సినిమాను న్యూ టాలెంట్ రోర్స్ అనే బ్యానర్‌పై ఆయన సతీమణి యలమంచిలి గీత ప్రొడ్యూస్ చేస్తున్నారు. అయితే, ఈ ప్రాజెక్ట్ నుండి ఇప్పటికే హీరోయిన్ ఎవరనే విషయాన్ని చిత్ర యూనిట్ ప్రకటించేసింది. కాగా నందమూరి జానకీరామ్ తనయుడు నందమూరి తారక రామారావు ఈ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నట్లు కూడా ఆయన గతంలోనే ప్రెస్ మీట్ పెట్టి తెలిపారు. అయితే, ఇప్పుడు ఎన్టీఆర్ అసలు ఎలా ఉంటాడు అనే విషయాన్ని రివీల్ చేయబోతున్నట్లు వైవీఎస్ చౌదరి అనౌన్స్ చేశారు. ఎన్టీఆర్ తొలి దర్శనం అక్టోబర్ 30న ఉంటుందని.. నందమూరి అభిమానులకు ఇది కనుల పండుగగా ఉండబోతుందని వైవీఎస్ చౌదరి ప్రకటించారు. ఇక ఈ సినిమాను కూడా తనదైన మార్క్ ఎంటర్‌టైనర్‌గా అన్ని హంగులతో తెరకెక్కించబోతున్నట్లు ఆయన ఇదివరకే తెలిపారు. దీంతో ఈ సినిమాలో హీరో ఎన్టీఆర్ ఎలా ఉండబోతున్నాడా అని ఆసక్తి నందమూరి అభిమానుల్లో నెలకొంది.
Read Also:Bagavanth kesari : హిట్ కొట్టాడు.. కారు పట్టాడు..
Dynamic Director @helloyvs is bringing a Massive Surprise from @NewTalentRoars' Prestigious Production No. 1🔥
Get Ready for the Powerful FIRST DARSHAN of Debutant Hero 𝐍andamuri 𝐓araka 𝐑amarao – The Great-GrandSon of Legendry NTR 💥😎
This WEDNESDAY – OCTOBER 30th❤️ pic.twitter.com/9Mxg26LSMZ
— NTR @ (@NewTalentRoars) October 25, 2024
- Tags
- Devara
- ntr
- october30
- YVS Chowdary
తాజావార్తలు
-
Carrot Oil : ముఖం గ్లో అవ్వాలా.? క్యారెట్ నూనెతో మెరిసే చర్మం..
-
INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
-
CM Revanth Reddy : సైబరాబాద్‌కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
-
Kitchen Hacks: ఇలా చేస్తే మీ వంటింట్లోకి చీమలు చచ్చినారావు.. కేవలం 2 నిమిషాల్లో ఇంట్లోనే ఈ నాచురల్ స్ప్రే చేసుకోండిలా!
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!