YV Subba Reddy: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది.. దీంతో.. అన్ని పార్టీలో ఎన్నికల ప్రచారంపై ఫోకస్ పెడుతున్నాయి.. ఇప్పటికే అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించి.. ప్రచారంలో దూసుకుపోతోంది.. సిద్ధం సభలతో మరింత హీట్ పెంచుతోంది.. అయితే, 55 రోజుల ఎన్నికల ప్రచార ప్రణాళిక అమలుపై ఉత్తరాంధ్ర ఎమ్మేల్యేలు, అభ్యర్థులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ కో-ఆర్డినేటర్, రాజ్యసభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి కీలక సమావేశం నిర్వహించారు.. ఎన్నికల ప్రచారంగా మరోసారి గడపడప విస్తృతంగా చేపట్టాలని దిశానిర్దేశం చేశారు..
Read Also: Muthol Ex MLA: బీఆర్ఎస్కు మరో షాక్.. కాంగ్రెస్లోకి ముథోల్ మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి
ఐదేళ్ల అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజల ముందు చర్చకు పెట్టేందుకు సిద్ధమని సవాల్ చేశారు వైవీ సుబ్బారెడ్డి.. మా ఎన్నికల ప్రచారాన్ని ఫాలో అయ్యే దుస్థితిలో కూటమి ఉందంటూ.. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమిపై సెటైర్లు వేసిన ఆయన.. సిద్ధం సభల తర్వాత బహిరంగ సభ పెట్టుకునే ధైర్యం కూడా చేయలేకపోయాయన్నారు. ఢిల్లీ నుంచి ప్రధాని నరేంద్ర మోడీ వస్తే తప్ప ఎన్నికల ప్రచారం చేయలేని పరిస్థితుల్లో వున్నారంటూ దుయ్యబట్టారు. వారాహిని ఎన్నిసార్లు దించుతారు.. ఎన్నిసార్లు ఎత్తుతారు అంటూ ప్రశ్నించారు. 2014-19 మధ్య ఎదురైన మోసాలు ఇప్పటికీ జనానికి గుర్తుకువస్తున్నాయన్నారు. ఆ కూటమి మరోసారి జనం ముందుకు వస్తోంది.. కాబట్టి, ప్రజలను అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ కో-ఆర్డినేటర్, రాజ్యసభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి.