Yuzvendra Chahal: ఆటగాడే.. ‘చాలా క్యూట్గా ఉన్నావు’ అంటూ మరో వివాదంలో స్టార్ బౌలర్.. వీడియో వైరల్.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Yuzvendra Chahal: టీమిండియా స్పిన్నర్, ఐపీఎల్ 2026లో పంజాబ్ కింగ్స్ తరఫున ఆడుతున్న యుజ్వేంద్ర చాహల్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. రెండు రోజుల క్రితం సిగరెట్ తాగుతూ రోడ్డుపై పడేసిన వీడియోపై విమర్శలు ఎదుర్కొన్న ఆయన, ఇప్పుడు వ్యక్తిగత జీవితం కారణంగా మళ్లీ వార్తల్లో నిలిచారు. అసలేం జరిగిందంటే.. నటి, మోడల్ టానియా ఛటర్జీ (Taniya Chatterjee) తాజాగా చాహల్‌పై సంచలన ఆరోపణలు చేశారు. చాహల్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీకి “Aap cute ho” (నువ్వు చాలా క్యూట్ గా ఉన్నావు) అంటూ వ్యక్తిగత మెసేజ్ పంపినట్టు ఆమె పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఆమె మీడియా వారికి తన ఇన్‌బాక్స్ చూపిస్తూ వెల్లడించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also Read
- IAF Chief: “F-35 దగ్గరకు కూడా రానివ్వరు.. అమ్ముతామని మాత్రం చెబుతున్నారు” .. అమెరికా పరువు తీసిన IAFచీఫ్..
- Lockie Ferguson: ‘వైభవ్ సూర్యవంశీకి ఓపెన్ ఛాలెంజ్’.. మా దేశంలో చూసుకుందాం..
- Dhruv Rathee: “గూండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
- Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
ఈ ఘటనతో సోషల్ మీడియాలో చాహల్ పై మరోసారి పెద్ద చర్చ ప్రారంభమైంది. ముఖ్యంగా చాహల్ వ్యక్తిగత జీవితం గత కొంతకాలంగా తరచూ వార్తల్లో నిలుస్తుండటం ఈ వివాదానికి మరింత ఆద్యం పోసినట్లయింది. గత ఏడాది చాహల్ తన భార్య, కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మ (Dhanashree Verma)తో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత RJ మహ్వాష్‌తో ఆయనకు సంబంధాలు ఉన్నట్టు వార్తలు వచ్చాయి. అయితే కొద్ది నెలలకే ఇద్దరూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో చేయడం మరోసారి చర్చకు దారితీసింది.
Stock Market: భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్.. లక్షల కోట్లు ఆవిరి
క్రికెట్ పరంగా చూస్తే చాహల్ ప్రదర్శన సాధారణ స్థాయిలోనే ఉంది. ఐపీఎల్ 2026లో ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌లలో మూడు వికెట్లు సాధించారు. గత సీజన్‌లో పంజాబ్ కింగ్స్ రన్నరప్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ మధ్య AB డివిల్లీర్స్ పోడ్‌కాస్ట్‌లో మాట్లాడిన చాహల్.. తన ఫిట్‌నెస్‌పై మరింత దృష్టి పెట్టినట్టు చెప్పారు. “నేను మద్యం పూర్తిగా మానేశాను. ఇప్పుడు 35 ఏళ్లు కావడంతో ఇంకా ఫిట్‌గా ఉండి జట్టుకు 150 శాతం ఇవ్వాలని భావిస్తున్నాను. సీనియర్ ప్లేయర్‌గా ఇతరులకు ఆదర్శంగా ఉండాలని అనుకుంటున్నాను” అని తెలిపారు.
తాజావార్తలు
-
Mamitha Baiju: రిషబ్ శెట్టి ‘జై హనుమాన్’లో మలయాళ క్రష్ ?
-
CM Revanth Reddy : రేవంత్ రెడ్డి గోవా పర్యటన.. కాంగ్రెస్ యాత్రలో కీలక పాత్ర
-
దసరాకు RC17 గ్రాండ్ లాంచ్! చరణ్ పక్కన ఆ హీరోయిన్.. నిజమేనా?
-
IAF Chief: “F-35 దగ్గరకు కూడా రానివ్వరు.. అమ్ముతామని మాత్రం చెబుతున్నారు” .. అమెరికా పరువు తీసిన IAFచీఫ్..
-
Lockie Ferguson: ‘వైభవ్ సూర్యవంశీకి ఓపెన్ ఛాలెంజ్’.. మా దేశంలో చూసుకుందాం..
ట్రెండింగ్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!