టీ20 క్రికెట్ లో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మొదటి తరం ఆటగాళ్లలో బ్యాట్స్‌మెన్ యువరాజ్ సింగ్ ఒకడు. 2007లో జరిగిన తొలి టీ-20 ప్రపంచకప్ లో యువరాజ్ ఒక ఓవర్‌లో 36 పరుగులు చేసి ఔరా అనిపించాడు. అప్పటి నుండి, ఎవరూ ఈ ఫీట్‌ను పునరావృతం చేయలేకపోయారు. 2007 ప్రపంచకప్ లో భారత్ గెలవడానికి యువరాజ్ తనవంతు సహాయం చేశాడు. ఇకపోతే, టీ20 ప్రపంచ కప్ జూన్ 1 నుండి వెస్టిండీస్, యూఎస్ఏ లో జరుగుతుంది.
Also read: Miss Universe Buenos Aires: 60 ఏళ్లకు అందాల కిరీటం.. చరిత్రలోనే తొలిసారి..
ప్రపంచకప్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా యువరాజ్ సింగ్‌ను ఐసీసీ నియమించింది. కాగా, టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు పాల్గొనడంపై ఇప్పటికే పలువురు మాజీ ఆటగాళ్లు తమ అభిప్రాయాలను వెల్లడించారు. తాజాగా యూవి కూడా తన మనసులోని మాటను బయటపెట్టాడు. “ఈ ప్రపంచకప్‌లో ఓవర్‌లో 6 సిక్సర్లు ఎవరు కొట్టగలరు..?” అని ఇటీవల ఓ కార్యక్రమానికి హాజరైన యువీని ప్రశ్నించారు. దానికి యువీ బదులిస్తూ.., “హార్దిక్ పాండ్యాకు ఆ సామర్థ్యం ఉందని నేను భావిస్తున్నాను” అని తెలిపాడు.
Also read: Mobile Internet: ఫోన్‌లో ఇంటర్నెట్ స్లోగా వస్తోందా.. అయితే ఇలా చేయండి..
హార్దిక్ ప్రపంచకప్ జట్టులో ఉండగలడా..? లేదా..? అనే అనుమానం ఉన్న సమయలో ఇప్పుడు యువీ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఈ సీజన్‌లో ఎటాకింగ్ ఆటను ఆస్వాదించిన దినేష్ కార్తీక్ ఎంపికపై యువీ స్పందించాడు. కార్తీక్ ను ఎంచుకునే ముందు మీరు ఆలోచించాలి. తుది జట్టులో స్థానం ఉంటేనే అతడిని తీసుకోవాలమీ., ఒకవేళ కార్తీక్ ను డగౌట్‌కే పరిమితం చేసేలా ఉంటే., అతన్ని తీసుకెళ్లకూడదని తెలిపాడు. అతని స్థానంలో కొత్త ఆటగాడిని తీసుకుంటే అతనికి అనుభవం వస్తుందని యువీ అన్నాడు.