Site icon NTV Telugu

Yuvraj Singh: భార‌త్‌ వ‌ర‌ల్డ్‌క‌ప్ గెల‌వాలంటే.. వారు ఆ పని చేయాలి..!

Yuvaraj

Yuvaraj

ఐపీఎల్ ముగియగానే టీమిండియా.. టీ20 వరల్డ్ కప్ 2024 ఆడనుంది. అందుకు సంబంధించి బీసీసీఐ అన్ని ఏర్పాట్లు చేస్తుంది. అమెరికా, వెస్టిండీస్ వేదికగా జూన్ 1 నుంచి పొట్టి ప్రారంభం కానుంది. ఈ క్ర‌మంలో ఈ టోర్నీలో భాగ‌మయ్యే ఆయా జ‌ట్లు త‌మ వివ‌రాల‌ను మే 1లోపు ఐసీసీకి స‌మ‌ర్పించాల్సి ఉంది. దీంతో భార‌త జ‌ట్టును ఎంపిక చేసే ప‌నిలో అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ పడింది. కాగా.. ఏప్రిల్ 28 లేదా 29న భార‌త జ‌ట్టును ప్ర‌క‌టించే అవ‌కాశ‌ముంది. ఇదిలా ఉంటే.. టీమిండియా ఆటగాళ్లు ఈ టోర్నీకి ఎవరైతే ఆడగలరో అని పలువురు మాజీ క్రికెటర్లు అంచణా వేస్తున్నారు.

Off The Record: నిజామాబాద్‌ కారు పార్టీలో కొత్త చిచ్చు

తాజాగా.. 2007 టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ హీరో, టీమిండియా మాజీ క్రికెటర్ యువ‌రాజ్ సింగ్‌ ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశాడు. టీమిండియా టీ20 వరల్డ్ కప్ గెలవాలంటే సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా వీరిద్దరూ కీల‌క పాత్ర పోషించాల‌ని చెప్పాడు. భారత జట్టుకు సూర్యకుమార్ కీలకం కానున్నాడని.. తన బ్యాట్ కు పని చెబితే ఇండియా ఛాంపియన్స్ గా నిలుస్తుందన్నాడు. ఒక్కసారి ఫామ్ లోకి వచ్చాడంటే.. కేవలం 15 బంతుల్లోనే అతను మ్యాచ్ స్వరూపానే మార్చేయగలడన్నాడు. అటు బుమ్రా కూడా.. బంతితో రాణించాలని యువరాజ్ పేర్కొన్నాడు. టీ20 ప్రపంచ కప్ 2024 అంబాసిడర్‌గా యువీ ఎంపికయ్యాడు. కాగా.. టీ20 వరల్డ్ కప్ మెగా ఈవెంట్‌లో టీమిండియా త‌మ తొలి మ్యాచ్‌లో జూన్ 5న న్యూయార్క్ వేదిక‌గా ఐర్లాండ్‌తో త‌ల‌ప‌డ‌నుంది.

Kejriwal: ఢిల్లీ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం.. ఎంసీడీ స్కూళ్ల తీరుపై ఆక్షేపణ

Exit mobile version