Yuvraj Singh: “శాంతియుత పరిష్కారమే మార్గం”.. సీజేపీ ఆందోళనలపై స్పందించిన సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Yuvraj Singh: ఢిల్లీలో నీట్ (NEET) పేపర్ లీక్ వివాదంపై ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) చేపడుతున్న ఆందోళనలు మరింత ఉద్రిక్తంగా మారాయి. మొదట జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా ప్రారంభమైన ఈ నిరసన, జూలై 20, 2026న విద్యార్థులు చేపట్టిన ‘సంసద్ చలో’ మోర్చాతో తీవ్రరూపం దాల్చింది. ఆందోళనకారులను అడ్డుకునేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో పాటు టీర్ గ్యాస్ ప్రయోగించడంతో పరిస్థితి చేయిదాటింది. పోలీసుల ఈ చర్యకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడంతో, పలువురు సెలబ్రిటీలు, ప్రతిపక్ష నేతలు దీనిపై తీవ్రంగా స్పందిస్తున్నారు. చాలా మంది విద్యార్థులకు తమ మద్దతును ప్రకటిస్తున్నారు. కొందరు ప్రముఖులు స్వయంగా ఢిల్లీకి చేరుకుని నిరసనలో పాల్గొనగా, మరికొందరు సోషల్ మీడియా వేదికగా నిరసనకారులకు మద్దతు తెలిపారు.
ఈ క్రమంలో భారత మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ సైతం స్పందించాడు. “ప్రతి ఒక్క చిన్నారికి, విద్యార్థికి, పురుషుడికి, మహిళకు ప్రశాంతమైన వాతావరణంలో విద్యనభ్యసించే, సురక్షితంగా ఎదిగే, తమ కలలను నెరవేర్చుకునే హక్కు ఉండాలి. మీ సంక్షేమమే ఒక బలమైన భారత్‌కు ప్రాతిపదిక. మనమందరం కలిసి శ్రద్ధ, అవకాశాలు, ఆశలతో కూడిన సమాజాన్ని నిర్మించుకోవడానికి కృషి చేద్దాం. భారతదేశ భవిష్యత్తు కోసం పరస్పర చర్చల ద్వారా ఈ సమస్యకు శాంతియుతమైన పరిష్కారాన్ని కనుగొనవచ్చు” అని తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో తన సందేశాన్ని పంచుకున్నాడు.
Also Read
- Paneer Tomato Rice: బిజీ లైఫ్‌కి బెస్ట్ హెల్తీ చాయిస్.. రెస్టారెంట్ రుచితో కుక్కర్లోనే ఘుమఘుమలాడే ‘పన్నీర్ టమాటో రైస్’ సులువుగా చేసేయండి ఇలా.!
- Breakfast Scheme: స్కూల్ పిల్లలకు గుడ్‌న్యూస్.. ఉచిత టిఫిన్ పథకం ప్రారంభం.. మెనూ ఇదే..
- Raghav Juyal: 'ది ప్యారడైజ్' ఈవెంటా.? లేక రాఘవ్ జుయల్ డ్యాన్స్ షోనా..? డాన్స్‌తో అదరగొట్టేసాడుగా.!
- Hyderabad: మాదాపూర్ ఓయో రూమ్‌లో యువతి మృతి.. ప్రియుడిపై అనుమానం?
మరోవైపు ఈ పేపర్ లీకేజీ అంశం పార్లమెంట్‌ను తీవ్రంగా కుదిపేస్తోంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తుండటంతో ప్రభుత్వం, విపక్షాల మధ్య తీవ్ర మునిగిపోకలు సాగుతున్నాయి. ప్రత్యేక నిబంధనల కింద చర్చ జరపాలని విపక్షాలు పట్టుబడుతుండగా, సాధారణ చర్చకు సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం చెబుతోంది. దీంతో ఉభయ సభల (లోక్‌సభ, రాజ్యసభ) కార్యకలాపాలు పదేపదే వాయిదా పడుతున్నాయి. ఈ క్రమంలో జూలై 21న ప్రతిపక్ష నేతలు ప్రధాని నివాసం వైపునకు మోర్చాగా వెళ్లేందుకు యత్నించగా, రాహుల్ గాంధీ సహా పలువురు ముఖ్య నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని, ఆ తర్వాత విడుదల చేశారు.
తాజావార్తలు
-
Paneer Tomato Rice: బిజీ లైఫ్‌కి బెస్ట్ హెల్తీ చాయిస్.. రెస్టారెంట్ రుచితో కుక్కర్లోనే ఘుమఘుమలాడే ‘పన్నీర్ టమాటో రైస్’ సులువుగా చేసేయండి ఇలా.!
-
Breakfast Scheme: స్కూల్ పిల్లలకు గుడ్‌న్యూస్.. ఉచిత టిఫిన్ పథకం ప్రారంభం.. మెనూ ఇదే..
-
Raghav Juyal: ‘ది ప్యారడైజ్’ ఈవెంటా.? లేక రాఘవ్ జుయల్ డ్యాన్స్ షోనా..? డాన్స్‌తో అదరగొట్టేసాడుగా.!
-
Radha vs Ambika: అబద్ధాలాడుతోంది, నేను కూడా ఫిర్యాదు చేస్తా.. రాధాకు అంబిక వార్నింగ్!
-
Dhanush’s ‘OM’ : పోస్ట్ పోన్ ప్లాన్‌లో ధనుష్ “ఓమ్”.. అప్డేట్స్తో జోరు చూపిస్తున్న జైలర్2
ట్రెండింగ్
-
100+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో VIVO WATCH 6 స్మార్ట్‌వాచ్ లాంచ్.. ఫీచర్స్, ధర ఇవే.!
-
42 గంటల బ్యాటరీ, అల్ట్రా-లైట్ డిజైన్, AI ఫీచర్లతో VIVO Buds Clip ఓపెన్-ఇయర్ ఇయర్‌ఫోన్స్ లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..!
-
50MP Zeiss కెమెరా, 1.5K 144Hz డిస్ప్లే, 6,510mAh బ్యాటరీతో ఫ్లాగ్షిప్ మొబైల్ VIVO X500 Pro లాంచ్.!
-
200MP Zeiss టెలిఫొటో కెమెరా, 2K 144Hz డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో VIVO X500 Pro Max లాంచ్..!
-
144Hz డిస్ప్లే, IP68+IP69 రేటింగ్, 1TB స్టోరేజ్, 90W ఛార్జింగ్‌తో VIVO X500.. ధర, ఫీచర్లు ఇదిగో.!