NTV Telugu Site icon

YSRCP Samajika Sadhikara Yatra: గత పాలకులకు, నేటి జగన్ పాలనకు తేడా గుర్తించాలి..

Samajika Sadikara Yatra

Samajika Sadikara Yatra

YSRCP Samajika Sadhikara Yatra: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను సాధికారత దిశగా నడిపించిన వైనాన్ని, వారికి చేసిన మేలును వివరించడానికి వైఎస్సార్‌సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర మంగళవారం విజయనగరం జిల్లాలో నెల్లిమర్లలో జరిగింది. నెల్లిమర్లలో ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు ఆధ్వర్యంలో బస్సు యాత్ర జరగింది. మంత్రులు సీదిరి అప్పలరాజు, రాజన్నదొర, బూడి ముత్యాలనాయుడు, మాజీ మంత్రి పుష్ప శ్రీవాణి తదితరులు హాజరయ్యారు.

అది పవన్‌ కళ్యాణ్‌కు తెలియదా: మంత్రి సీదిరి అప్పలరాజు
వైజాగ్‌లో జగన్ ఇల్లు కడుతున్నరట… అది జగన్ ఇల్లు కాదని పవన్ కళ్యాణ్ తెలియదా అంటూ మంత్రి సీదిరి అప్పలరాజు ప్రశ్నించారు. అది ప్రభుత్వ ఆస్తి… అది కూడా తెలీక పవన్ మాట్లాడుతున్నాడని మంత్రి మండిపడ్డారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు ఏనాడైనా మత్స్యకారులకు మంచి చేశాడా అంటూ ప్రశ్నించారు. విలువలు లేని రాజకీయ నాయకులు కూటమిగా వస్తున్నారు.. జాగ్రత్త అంటూ మంత్రి వ్యాఖ్యానించారు. జగన్ మోహన్ రెడ్డి సింహంలా సింగిల్‌గా వస్తున్నాడన్నారు. ప్రజలు మళ్ళీ జగన్‌ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నామని మంత్రి సీదిరి అప్పలరాజు ఆకాంక్షించారు.

Read Also: Pragathi: జాతీయ స్థాయిలో సత్తా చాటిన నటి ప్రగతి.. పవర్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్ లో కాంస్యం

అన్ని వర్గాలు, కులాలకు సమానత చేకూర్చారు: డిప్యూటీ సీఎం రాజన్న దొర
జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ప్రజల జీవన సరళి మారిందని, పరిస్థితులు మెరుగు పడ్డాయని డిప్యూటీ సీఎం రాజన్నదొర పేర్కొన్నారు. గత పాలకులకు.. నేటి జగన్ పాలనకు తేడా గుర్తించాలన్నారు. సామాన్యులను గుర్తించి రాజ్యాంగ అధికారం సీఎం జగన్‌ అప్పగించారని మంత్రి తెలిపారు. అన్ని వర్గాలు, కులాలకు సమానత చేకూర్చారని చెప్పారు. గతం ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చి నెరవేర్చలేకపోయారని విమర్శించారు. అన్ని వర్గాలను, సామాన్యులను, ఓటు బ్యాంకుగా గత పాలకులు వాడుకున్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వంలో ప్రజలు ఎలా మోసపోయారో చూశామన్న ఆయన.. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక కులాలు, మతాలు లేకుండా అన్ని వర్గాలకు సమన్యాయం జరుగుతోందన్నారు.బాబు వస్తే జాబు వస్తోందని అన్నారు… ఆయన బాబుకి మూడు శాఖల మంత్రి పదవి కట్టబెట్టారని విమర్శలు గుప్పించారు. జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకునే మనిషి అని నిరూపించుకున్నారని.. మళ్ళీ జగన్ ముఖ్య మంత్రి అయితేనే ప్రజలకు అండగా నిలుస్తారన్నారు.

Read Also: CEO Vikas Raj: సైలెంట్‌ పీరియడ్ మొదలైంది.. ఈ 48 గంటలు చాలా కీలకం..

అందుకే విశాఖ పరిపాలనా రాజధానిగా నిర్ణయం: మంత్రి గుడివాడ అమర్నాథ్
ఉత్తరాంధ్ర అత్యంత వెనుకబడిన ప్రాంతమని.. విశాఖ మాత్రం కొంత అభివృద్ధి చెందిందని మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఉత్తరాంధ్ర అభివృద్ధికి కంకణం కట్టుకున్నారని ఆయన చెప్పారు. అందుకే విశాఖ పరిపాలనా రాజధానిగా నిర్ణయం తీసుకున్నారని మంత్రి వెల్లడించారు. 4700 కోట్ల రూపాయలతో విమానాశ్రయం భోగాపురంలో రూపుదిద్దుకుంటుందని.. హైదరాబాద్‌లో శంషాబాద్ ఎలా అభివృద్ది చెందిందో అలాగే భోగాపురం కూడా అభివృద్ధి చెందుతోందన్నారు. ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని, సారిపల్లిలో ఇండస్ట్రియల్ పార్క్ ప్రారంభం కాబోతుందన్నారు. నాలుగున్నర ఏళ్ల కాలంలో ఏవిధంగా అభివృద్ధి చెందిందో అందరికీ తెలుసన్నారు.

వ్యవస్థలను అన్నింటినీ సరిద్దిద్దారు జగన్: మంత్రి ధర్మాన ప్రసాదరావు
ఇవి సరదాగా పెట్టుకున్న సభలు కాదు.. పరిపాలv ఎలా సాగుతుంది.. అనేది చెప్పాల్సిన అవసరం ఉందని మంత్రి ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. గత పాలనలో ఎలా మోసపోయారు.. పాలకులు ఎలా మోసాలు చేశారు అనేది చెప్పాల్సిన అవసరం మాపై ఉందన్నారు. మంచి పాలకులు వస్తే సమాజంలో అసమానతలు తొలగిపోతాయని ప్రజలు ఆశపడతారని.. కానీ ప్రజలు ఆశించిన మేరకు గత పాలకులు చేయలేకపోయారని విమర్శించారు. గతంలో చంద్రబాబు పూర్తి అధికార మధంతో పాలించారని.. ఈ నాలుగున్నర ఏళ్లలో పూర్తిగా పరిస్థితులు మారిపోయాయన్నారు. వ్యవస్థలను అన్నింటినీ జగన్ సరిద్దిద్దారని.. ఈ విషయాన్ని ప్రజలు గుర్తించాలన్నారు. గతంలో విజన్ ఉంది అన్న నాయకుడు ఏం చేశాడు.. జన్మ భూమి కమిటీలు అని చెప్పి ఊరిమిద వదిలేశారని మండిపడ్డారు మంత్రి ధర్మాన. జగన్ వచ్చాక అన్ని మారిపోయి.. పారదర్శకత పెరిగింది, ప్రజల జీవన విధానం మారిందన్నారు. మార్పుకు నాంది పలకడమే కాదు.. మంచి ఫలితాలు అందిస్తున్నారు జగన్ అంటూ మంత్రి చెప్పుకొచ్చారు. జగన్ విద్యా వ్యవస్థ, వైద్య వ్యవస్థల్లో సంచలన మార్పులు తెచ్చారన్నారు.