Site icon NTV Telugu

YSRCP: “జగన్ అంటే నమ్మకం – చంద్రబాబు అంటే మోసం” పుస్తకం విడుదల..!

Book

Book

YSRCP: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి కావడంతో, వైఎస్సార్సీపీ స్పందనగా విమర్శలతో కూడిన పుస్తకాన్ని విడుదల చేసింది. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పుస్తకాన్ని ఆవిష్కరించారు. “జగన్ అంటే నమ్మకం – చంద్రబాబు అంటే మోసం” అనే శీర్షికతో ఈ పుస్తకం విడుదలైంది.

Read Also: Perni Nani: నాకు ఎదురైన బాధ ఎవరికి రాకూడదు.. మాజీ మంత్రి ఆవేదన..!

ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు అంబటి రాంబాబు, విడదల రజనీతో పాటు పలువురు ముఖ్య నేతలు పాల్గొన్నారు. పుస్తకం ఆవిష్కరణ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ.. గత ఏడాది మూడు పార్టీల కలయికగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కానీ, ఇప్పటి వరకు ఒక్క హామీని కూడా అమలు చేయలేకపోయారు. ప్రజల గొంతు వినకుండా, రాజ్యాంగాన్ని విరుద్ధంగా ఉపయోగించి పాలన చేస్తున్నారని ఆరోపించారు.

Read Also: Ukraine Russia War: ఉక్రెయిన్‌ బంపర్ ఆఫర్.. రష్యన్ డ్రోన్‌లను కూల్చేస్తే నెలకు రూ. 2 లక్షలు

అలాగే సజ్జల మాట్లాడుతూ.. 2019లో వైఎస్సార్సీపీ ఒంటరిగానే ఘన విజయం సాధించింది. జగన్ తొలి ఏడాది పాలనలో బంగారు భవిష్యత్తుకు బలమైన పునాదులు వేశారు. ప్రతి రంగానికి విశ్వసనీయతను అందించారని పేర్కొన్నారు. అయితే, ఈ కూటమి ప్రభుత్వం ఐదు కోట్ల ప్రజలకు వెన్నుపోటు పొడిచింది. చంద్రబాబు నాయుడు ఈ వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్‌గా నిలిచారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని నిర్వీర్యం చేసి, అన్ని రంగాలను ధ్వంసం చేశారని విమర్శలు గుప్పించారు. ఈ పుస్తకం ప్రజలకు నిజాలను తెలియజేయాలనే ఉద్దేశంతో విడుదల చేశామన్నారు. అందులో పేర్కొన్న అంశాలన్నీ వాస్తవ ఆధారాలపై ఆధారపడ్డాయని, ప్రజలు ఈ సమాచారాన్ని గమనించి నిశితంగా విశ్లేషించాలని వైసీపీ నేతలు కోరారు.

Exit mobile version