Ambati Rambabu: అంబేద్కర్ విగ్రహం శిలాఫలకంపై దాడి.. రాజ్యాంగంపై జరిగినట్లే
- విజయవాడలో అంబేద్కర్ విగ్రహం మీద దాడి.. శిలాఫలకం ధ్వంసం నేపథ్యంలో..
- రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నిరసనలు
- ఈ దాడి ఘటనను రాజ్యాంగంపై జరిగిన దాడిగా అభివర్ణించిన అంబటి రాంబాబు
- దాడిని నిరసిస్తూ గుంటూరులో క్యాండిల్ నిరసన ర్యాలీ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విజయవాడలో అంబేద్కర్ విగ్రహం మీద దాడి, శిలాఫలకం ధ్వంసం నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. అంబేద్కర్ విగ్రహం శిలాఫలకంపై దుండగులు చేసిన దాడి ఘటనను, రాజ్యాంగంపై జరిగిన దాడిగా అభివర్ణించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు.. ఈ దాడిని నిరసిస్తూ.. వైసీపీ శ్రేణులు గుంటూరు శంకర్ విలాస్ నుండి లాడ్జి సెంటర్ వరకు క్యాండిల్ నిరసన ర్యాలీ చేశారు.
Read Also: Jammu Kashmir: అనంతనాగ్ జిల్లాలో ఎదురుకాల్పులు.. ఇద్దరు సైనికులు మృతి
Also Read
- Pakistan: ఆపరేషన్ సిందూర్ దెబ్బ తర్వాత.. మళ్లీ సిద్ధమైన జైష్ ఉగ్ర స్థావరం!
- Pakistan: టర్కీ నుంచి భారీగా ఆయుధాలు.. పాక్ ఏదో పెద్ద స్కెచ్ వేస్తోందా?
- Shah Jahan Daughters: షాజహాన్ తన ముగ్గురు కుమార్తెలకు ఎందుకు పెళ్లిళ్లు చేయలేదు.? అసలు కారణం ఇదేనా.?
- Nijjar Killing: ఖలిస్తానీ నిజ్జర్‌ను చంపింది మేమే.. గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్ సంచలనం..
ఈ సందర్భంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. విజయవాడ అంబేద్కర్ స్మృతి వనం మీద సుత్తెలు, రాళ్ళతో దాడి చేయడం దుర్మార్గం అని అన్నారు. ఈ దాడి అంబేద్కర్ విగ్రహంపై జరిగిన దాడిగా భావిస్తున్నానని పేర్కొన్నారు. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వంలో అరాచక పాలన సాగుతున్నదని.. వైఎస్ జగన్ చేసిన అభివృద్ధి పనుల శిలాఫలకాలు ధ్వంసం చేస్తున్నారని, వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాలను తగలబెడుతున్నారని అంబటి రాంబాబు మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్ధతి కాదని.. ఏదో ఒకరోజు టీడీపీ ప్రభుత్వం కూడా కూలిపోతే, ఇదే దుష్ట సంప్రదాయాన్ని వైసీపీ కొనసాగిస్తే ఏమవుతుందో టీడీపీ నాయకులు ఆలోచించుకోవాలని అంబటి పేర్కొన్నారు. జరుగుతున్న దాడులపై హోంమంత్రి స్పందించాలని.. చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి అంబటి డిమాండ్ చేశారు.
Read Also: Jr NTR Watch: ఎన్టీఆర్ చేతి వాచ్ తో హైదరాబాదులో మూడు లగ్జరీ ఫ్లాట్లు కొనేయచ్చు తెలుసా?
తాజావార్తలు
-
Telangana: ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్.. రూ.1.50 లక్షల సాయం, వెల్ఫేర్ బోర్డు
-
Pakistan: ఆపరేషన్ సిందూర్ దెబ్బ తర్వాత.. మళ్లీ సిద్ధమైన జైష్ ఉగ్ర స్థావరం!
-
Vishwanath and Sons: రూ.200 కోట్ల క్లబ్‌లోకి ‘విశ్వనాథ్ అండ్ సన్స్’.. బాక్సాఫీస్ దగ్గర సూర్య మూవీ మాస్ ర్యాంపేజ్!
-
Pakistan: టర్కీ నుంచి భారీగా ఆయుధాలు.. పాక్ ఏదో పెద్ద స్కెచ్ వేస్తోందా?
-
Prabhas: డార్లింగ్ సినిమాల్లో అసలు జరుగుతున్నదేంటి? ‘కన్నప్ప’తో మొదలైన బాడీ డబుల్ రచ్చ.. ‘స్పిరిట్’పై క్లారిటీ!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!