పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల వైసిపి అభ్యర్థి వెన్నపూస రవీంద్ర రెడ్డి గ్రాడ్యుయేట్ ఎన్నికల ఓట్ల లెక్కింపు తీరుపై మండిపడ్డారు. ఎన్నికల కౌంటింగ్ నిష్పక్షపాతంగా జరగలేదు.. చాలా అక్రమాలు జరిగాయి. మేము రీపోలింగ్ రీకౌంటింగ్ అడగడం లేదు. కేవలం బండిల్స్ వెరిఫికేషన్ చేయాలని కోరుతున్నాం. టిడిపి నాయకులకు ధైర్యం ఉంటే ఎందుకు ఒప్పుకోవడం లేదు. కౌంటింగ్ విధుల్లో పాల్గొన్న అధికారులు నల్ల బ్యాడ్జీలు ధరించారు. మమ్మల్ని ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాడుకోమని సంకేతం ఇచ్చారు. టిడిపి మాజీ ప్రజా ప్రతినిధులు ఏజెంట్లుగా వచ్చారు. వారు అధికారులను ప్రభావితం చేశారన్నారు.
Bhumireddy Ramgopal Reddy: గెలవలేమని చెప్పి.. రూ 50 కోట్లు ఖర్చుచేశారు
మాకు వచ్చిన ఓట్లను టిడిపి బండిల్స్ లో కలిపారు. సాక్ష్యాలతో సహా చూపించి రీ వెరిఫికేషన్ చేయాలని కోరాము. కానీ జిల్లా ఆర్వో , జిల్లా ఎస్పీలు ఏకపక్షంగా వ్యవహరించారు. టిడిపి ఏజెంట్లు ఇండిపెండెంట్ ల పాసులు అడ్డం పెట్టుకొని పదుల సంఖ్యలో వచ్చారు. కనీసం పోలీసులు వారిని చెక్ చేయలేదు. మేము ఒక ఏజెంట్ ని కావాలని అడిగితే అనుమతి ఇవ్వలేదు. కచ్చితంగా అన్ని అంశాలను ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తున్నాం. ఆర్ఓ, జిల్లా ఎస్పీలు దీనికి బాధ్యత వహించాలి. నాకు మొదటి ప్రాధాన్యతలోనే 98 వేల ఓట్లు వచ్చాయి. టిడిపికి బిజెపి పిడిఎఫ్ అభ్యర్థుల ఓట్లు కలిశాయి. అయినప్పటికీ వారి మెజారిటీ కేవలం 7000 మాత్రమే. నైతికంగా ఇది నా విజయం..నాకు ఓటు వేసిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటాను అన్నారు వైసీపీ అభ్యర్థి వెన్నపూస రవీంద్రారెడ్డి.
Read Also: IND vs AUS 2nd ODI: పేకమేడల్లా కూడిన భారత్.. 117 పరుగులకే ఆలౌట్