NTV Telugu Site icon

Perni Nani: హింసకు సంబంధించి వీడియోలు చూసి గవర్నర్ ఆశ్చర్యపోయారు..

Perni Nani

Perni Nani

Perni Nani: ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక టీడీపీ నేతలు బీహార్ తరహా హింసా రాజకీయాలు చేస్తున్నారని వైసీపీ నేత పేర్ని నాని తీవ్రంగా మండిపడ్డారు. వైసీపీ నేతలు గురువారం సాయంత్రం గవర్నర్‌ అబ్దుల్ నజీర్‌ను కలిసి ఈ దాడుల గురించి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన అనంతరం వైసీపీ నేతలు మీడియాతో మాట్లాడారు. టీడీపీ గుండాలు వైసీపీ నేతల ఇళ్లపై దాడులు చేస్తున్నారని పేర్ని నాని పేర్కొన్నారు. హింస కోసమే అధికారంలోకి వచ్చినట్టు టీడీపీ నేతల ప్రవర్తన ఉందన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు.

Read Also: Palnadu: పిన్నెల్లిని అరెస్ట్ చేస్తారన్న ప్రచారంతో పల్నాడులో టెన్షన్

జరుగుతున్న హింసకు సంబంధించి వీడియోలు చూసి గవర్నర్ ఆశ్చర్యపోయారన్నారు. డీజీపీని పిలిపించి విచారణ చేస్తానని గవర్నర్ చెప్పారని పేర్ని నాని పేర్కొన్నారు. ఈ దాడులను సీరియస్‌గా తీసుకుని చర్యలు తీసుకుంటానని గవర్నర్ చెప్పారన్నారు. ఈ తరహా సంస్కృతి కొనసాగితే ఎల్లకాలం టీడీపీయే అధికారంలో ఉండదు గుర్తుంచుకోవాలన్నారు. కూటమి నేతల ఒత్తిడి మేరకు పోలీసులు చోద్యం చూస్తున్నారన్నారు. ఈ దాడులను నిలువరించడానికి 26 జిల్లాలో జగన్ కమిటీలు ఏర్పాటు చేశారని.. 26 జిల్లాల్లోని లీగల్ టీంలను యాక్టివేట్ చేశారని.. న్యాయ పోరాటం చేస్తామని పేర్ని నాని వెల్లడించారు. కార్యకర్తలకు, నేతలకు అన్ని రకాలుగా అండగా ఉంటామన్నారు. ఎక్కడైనా దాడులు జరిగితే కమిటీ వాళ్ళకి అండగా ఉంటుందన్నారు. టీడీపీ చేసే హింసను ప్రజలకు తెలియజేస్తామన్నారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు కాపాడుకోడానికి మేము తిరుగుబాటు చెయ్యాల్సి వస్తుందని పేర్ని నాని హెచ్చరించారు.