YSRCP: టార్గెట్ 175.. వైసీపీ శ్రేణులకు దిశా నిర్దేశం చేయనున్న సీఎం జగన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YSRCP: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన రెడ్డి గేర్ మారుస్తున్నారు. గత నాలుగున్నర ఏళ్లుగా పాలన, సంక్షేమ పథకాల అమలుపైనే ఎక్కువగా దృష్టి పెట్టిన సీఎం, ఇక తన ఫోకస్ పార్టీ పైకి మారుస్తున్నారు. ప్రధానంగా మండల స్థాయి నేతలు, క్షేత్రస్థాయి శ్రేణులతో సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. రీజనల్ కోఆర్డినేటర్లు, మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ సమన్వయకర్తల నుంచి పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులు, జోనల్ ఇంఛార్జుల వరకు పాల్గొంటారు. మొత్తం మీద సుమారు 8 వేల మంది ఈ సభకు హాజరు కానున్నారు.
నాలుగున్నర ఏళ్లుగా తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్ళే విధంగా ఈ కార్యక్రమం ఉండనుంది. సీఎం జగన్ స్వయంగా సమావేశంలో పాల్గొని పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేస్తారు. 175కు 175 స్థానాల్లో విజయమే లక్ష్యంగా ఎన్నికలకు శ్రేణులను సమాయత్తం చేసేందుకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సన్నద్ధమయ్యారు. అందులో భాగంగా పార్టీ ప్రతినిధుల సభలో దిశా నిర్దేశం చేయనున్నారు.. గత 53 నెలలుగా సుపరిపాలన, సంక్షేమాభివృద్ధి పథకాల ద్వారా ప్రతి ఇంటికీ, గ్రామానికీ, నియోజకవర్గానికీ, జిల్లాకు, రాష్ట్రానికీ చేసిన మంచిని మరింత ప్రభావవంతంగా వివరించడం.. ప్రతిపక్షాలు, ఎల్లో మీడియా చేస్తున్న ఎక్కడికక్కడ తిప్పికొట్టడంపై ప్రతినిధులకు కీలక ఆదేశాలు ఇస్తారు. అధికారంలోకి వచ్చాక విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో విప్లవాత్మక సంస్కరణలు – పరిపాలన వికేంద్రీకరణ ద్వారా రాష్ట్రం సమగ్రాభివృద్ధి దిశగా పరుగులెత్తిస్తున్న తీరును కళ్లకు కట్టినట్లుగా వివరించి.. ప్రగతిపథంలో రాష్ట్రం దూసుకెళ్లాలంటే మళ్లీ వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పాలని సూచించనున్నారు.
Also Read
- Nana Patekar Funeral: నానా పటేకర్ చివరి కోరిక ఇదే.. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు.. ఎక్కడంటే?
- Kitchen Sink Tips: గిన్నెలు తోమేటప్పుడు బట్టలు తడుస్తున్నాయా? రూపాయి ఖర్చు లేకుండా ఈ 5 ట్రిక్స్ ట్రై చేయండి
- Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే "వెజ్ ఆమ్లెట్".. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
- UPI చార్జీలు వాయిదా పడతాయా? NPCI కీలక నిర్ణయం..!
గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు, వాటిలో నెరవేర్చింది ఎంత అన్న విషయంపై పార్టీ శ్రేణులకు సీఎం జగన్ వివరిస్తారు. అదే విధంగా వైసీపీ గత ఎన్నికల సమయంలో ఏం హామీలు ఇచ్చింది…వచ్చిన తర్వాత ఎంత మేరకు నెరవేర్చారు అన్న అంశాలను సభలో చర్చిస్తారు. వీటన్నింటినీ మండల స్థాయి నాయకులతో పంచుకుంటారు సీఎం. ఇవన్నీ ప్రజలకు వివరించి వచ్చే ఎన్నికల్లో ప్రజా మద్దతు కోరతారు. ఇక ముఖ్యమంత్రి జగన్ ఇచ్చే దిశానిర్దేశం కోసం పార్టీ శ్రేణులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. అయితే.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధుల సభకు హాజరయ్యే ఆహ్వానితులు సకాలంలో సభ ప్రాంగణానికి చేరుకోవాలని చెబుతున్నారు. పాస్‌లు ఉన్నవారినే అనుమతిస్తారు.. ఉదయం టిఫిన్‌తో పాటు మధ్యాహ్నం మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, రొయ్యల కూర, పీతల వేపుడు, రసం, కుండ పెరుగు.. తదితర 30 రకాల వంటకాలతో పసందైన భోజనం అందిస్తామన్నారు. ఆహ్వానితులు ఉదయం 8.30 గంటలకు సభ ప్రాంగణానికి చేరుకోవాలని.. పాసులు ఉన్న వారిని మాత్రమే లోపలికి అనుమతిస్తారని, పోలీసులు స్టేడియం లోపల, బయట కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారని చెబుతున్నారు పార్టీ నేతలు.
తాజావార్తలు
-
Airtel Postpaid Plans Price Hike: Airtel కస్టమర్లకు షాక్.. పోస్ట్‌పెయిడ్ ప్లాన్స్ ధరలు భారీగా పెంపు
-
Nana Patekar Funeral: నానా పటేకర్ చివరి కోరిక ఇదే.. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు.. ఎక్కడంటే?
-
Kitchen Sink Tips: గిన్నెలు తోమేటప్పుడు బట్టలు తడుస్తున్నాయా? రూపాయి ఖర్చు లేకుండా ఈ 5 ట్రిక్స్ ట్రై చేయండి
-
Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే “వెజ్ ఆమ్లెట్”.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
-
AA 23 : అల్లు అర్జున్ – లోకేష్ కనకరాజ్ సినిమా క్యాన్సిల్?
ట్రెండింగ్
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!