NTV Telugu Site icon

YSR Bima: వైఎస్సార్‌ బీమా నమోదు ప్రక్రియ ప్రారంభం.. వారికి రూ.5లక్షల సాయం

Ysr Bima

Ysr Bima

YSR Bima Scheme: ఆంధ్రప్రదేశ్‌లో 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను వైఎస్సార్‌ బీమా పథకం నమోదు ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నెల 7వ తేదీ వరకు ఇది కొనసాగనుంది. ఈ పథకం ద్వారా 18 నుంచి 50 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న కుటుంబ పెద్ద ప్రమాదవశాత్తూ మరణిస్తే కుటుంబసభ్యులకు ప్రభుత్వం రూ.5 లక్షల ఆర్ధిక సాయం అందిస్తుంది. కుటుంబ పెద్ద సహజంగా మరణిస్తే ఆ కుటుంబానికి రూ. లక్ష అందిస్తారు. అలాగే 18- 70 సంవత్సరాలోపు వయస్సు ఉన్న కుటుంబ పెద్ద ఏదైనా పెద్ద ప్రమాదం జరిగి మరణించినా లేదా శాశ్వత వైలక్యం పొందినా రూ.5 లక్షలు పరిహారం ఇస్తారు.

గత నెల 29న నమోదు ప్రక్రియ ప్రారంభమ­వ్వగా.. గ్రామ, వార్డు సచివాలయాల్లో వాలంటీర్లు వివరా­లను నమోదు చేస్తున్నారు. ఈ నెల 7లోగా నమోదు ప్రక్రియ పూర్తి చేయా­లని కలెక్టర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కె.ఎస్‌.­జవహర్‌రెడ్డి ఆదేశించారు. వైఎస్సార్‌ బీమా పథకాన్ని 2021 జులై 1న సీఎం వైఎస్‌ జగన్‌ ప్రారంభించారు. అప్పటినుంచి ప్రతి ఆర్ధిక సంవత్సరంలో వైఎస్సార్ బీమా నమోదు ప్రక్రియను చేపడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1.32 కోట్ల కుటుంబాలకు వైఎస్సార్ బీమా అమలు చేస్తున్నారు. పథకం ప్రారంభించిన మొదటి రెండు సంవత్సరాల్లో రూ.1307 కోట్లు ఖర్చు చేశారు. గత టీడీపీ ప్రభుత్వం చంద్రన్న బీమా పథకం ఉండగా.. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్సార్ బీమా పేరుతో అమలు చేస్తోంది. ఈ పథకానికి ప్రతి ఆర్ధిక సంవత్సరానికి ఒకసారి నమోదు ప్రక్రియను చేపట్టి లబ్ధిదారులను గుర్తిస్తారు.

Read Also: GVL Narasimha Rao: పోలవరంపై బీజేపీ ఎంపీ జీవీఎల్ కీలక ప్రకటన

దారిద్య్ర రేఖకు దిగువున ఉన్న కుటుంబాలకు గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు.కాగా, 2023–24కు సంబంధించి జూలై 1 నుంచి వైఎస్సార్‌ బీమా పథకం అమలుకు కార్మిక శాఖ ఉత్తర్వులిచ్చింది. బీమా కంపెనీలు, బ్యాం­కులతో సంబంధం లేకుండా నేరుగా గ్రామ, వార్డు సచివాలయాల ద్వారానే పరి­హా­రం చెల్లింపును ఏపీ సర్కారు చేపట్టింది. ఈ పథకానికి బడ్జెట్‌లో రూ.372 కోట్లను ప్రభుత్వం కేటాయించింది.

Show comments