YS Jagan: స్థానిక ఎన్నికల్లో అక్రమాలు.. శ్రేణులు అప్రమత్తంగా ఉండాలి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్లో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ నాయకులకు, శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. కూటమి ప్రభుత్వంలో గతంలో ఎన్నడూ చూడని విధంగా నామినేషన్ల ఘట్టం నుంచే అక్రమాలు, దాడులు మొదలయ్యాయని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నామినేషన్ కేంద్రాలను ఆక్రమించడం, బి-ఫారాలను మాయం చేయడం, ఫోర్జరీ సంతకాలతో ఉపసంహరణలు చేయించడం, చివరికి రిటర్నింగ్ ఆఫీసర్లే నామినేషన్ పత్రాలను చింపేయడం వంటి దారుణాలు తొలిసారిగా చూస్తున్నామని విమర్శించారు. అధికారులను, పోలీసులను అడ్డుపెట్టుకుని చంద్రబాబు ప్రభుత్వం ఒక మాఫియా ముఠాలా వ్యవహరిస్తోందని, ప్రజల రాజ్యాంగ హక్కులను హరిస్తోందని ఆరోపించారు.
రాబోయే పోలింగ్, లెక్కింపు సమయంలో కూడా రిగ్గింగ్ చేయడం, బ్యాలెట్ బాక్సులను మార్చడం వంటి చర్యలకు అధికార పక్షం దిగవచ్చని, అందుకే పార్టీ శ్రేణులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. ప్రతి తప్పును వీడియోల రూపంలో రికార్డు చేయాలని, సీసీ కెమెరాలు లేని చోట ప్రైవేటుగానైనా కెమెరాలు ఏర్పాటు చేసి సాక్ష్యాలు సేకరించాలని సూచించారు. పోలింగ్, కౌంటింగ్ ఏజెంట్లకు ప్రత్యేక ఓరియెంటేషన్ ఇచ్చి సమర్థవంతంగా పనిచేసేలా చూడాలని తెలిపారు.
Also Read
- OTR: ఎమ్మెల్సీ ఎన్నికలపై కేటీఆర్, హరీష్ రావు మాస్టర్ ప్లాన్! BRS వ్యూహం ఏంటి?
- Israel Elections: ఇజ్రాయిల్ ఎన్నికల్లో జోక్యం.. ‘‘మమ్మల్ని బలిపశువు చేయొద్దు’’ అని ఖతార్ కౌంటర్..
- Neha Bora: నాలుగోసారి కూడా.. శాంతి ఒప్పందంపై సంతకానికి నేహా బోరా నిరాకరణ
- AP Intermediate: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ఇంటర్ బోర్డు.. పరీక్షల ఫీజు గడువు పెంపు..
జిల్లా అధ్యక్షులు రోజూ రెండుసార్లు అసెంబ్లీ కోఆర్డినేటర్లతో రివ్యూ నిర్వహించాలని, ఏవైనా సమస్యలు ఎదురైతే లీగల్ సెల్ ద్వారా వెంటనే న్యాయపోరాటం చేయాలని ఆదేశించారు. స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగే పరిస్థితి లేదని, ఒక రాక్షసుడితో యుద్ధం చేస్తున్నామనే భావనతో పనిచేయాలని పేర్కొన్నారు. నామినేషన్ల సమయంలో జరిగిన అక్రమాలపై ఆధారాలు సేకరించి కోర్టు మెట్లుక్కుతామని, తప్పు చేసిన అధికారులు, నాయకులు భవిష్యత్తులో వడ్డీతో సహా చెల్లించుకుంటారని, తప్పకుండా శిక్ష అనుభవిస్తారని హెచ్చరించారు.
తాజావార్తలు
-
OTR: ఎమ్మెల్సీ ఎన్నికలపై కేటీఆర్, హరీష్ రావు మాస్టర్ ప్లాన్! BRS వ్యూహం ఏంటి?
-
OTR : యనమల ఫ్యామిలీలో విభేదాలు.. తుని మున్సిపల్ ఎన్నికల్లో కూటమికి చిక్కులేనా?
-
YS Jagan: స్థానిక ఎన్నికల్లో అక్రమాలు.. శ్రేణులు అప్రమత్తంగా ఉండాలి..
-
Om Movie: ఎర్రచందనం స్మగ్లింగ్ సినిమా కాదు.. ధనుష్ ‘ఓం’ స్టోరీ పాయింట్ చెప్పిన డైరెక్టర్!
-
Israel Elections: ఇజ్రాయిల్ ఎన్నికల్లో జోక్యం.. ‘‘మమ్మల్ని బలిపశువు చేయొద్దు’’ అని ఖతార్ కౌంటర్..
ట్రెండింగ్
-
Scalp Care Tips : చలికాలంలో చుండ్రు వేధిస్తోందా? ఈజీ అండ్ నాచురల్ చిట్కాలతో చెక్ పెట్టండిలా
-
Ragi Biscuits: ఓవెన్ లేకుండానే ఇంట్లో కరకరలాడే ‘రాగి బిస్కెట్లు’.. ఇలా చేస్తే పిల్లలు లొట్టలేసుకుంటూ తింటారంతే..!
-
Rice Flour Poori Recipe: ప్రతీసారి గోధుమ పిండి పూరీలేనా?.. ఈ ఫెస్టివల్ సీజన్లో సాఫ్ట్ బియ్యప్పిండి పూరీలు ట్రై చేయండి..
-
Remove Stubborn Stains: ఈ ఒక్క చిట్కా పాటిస్తే చాలు.. బట్టలపై ఉండే ఎంతటి జిడ్డు, మొండి మరకలైనా ఇట్టే వదలాల్సిందే..!
-
Tata Motors Diwali Offers: ఆఫర్లే.. ఆఫర్లు.. టాటా మోటార్స్ దీపావళి సేల్..! ఏ కారుపై ఎంత తగ్గించారంటే..?