YS Jagan: నేడు అరకు, విశాఖలో మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటన!
- నేడు అరకు, విశాఖలో వైఎస్ జగన్ పర్యటన
- ఎమ్మెల్యే రేగం కుమారుడి వివాహ వేడుకకు జగన్
- మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ నివాసానికి జగన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Jagan to Visit Araku and Visakhapatnam Today: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇవాళ అల్లూరి సీతారామరాజు, విశాఖ జిల్లాల్లో పర్యటించనున్నారు. వివాహ వేడుకల్లో పాల్గొనేందుకు ఆయన ఈ పర్యటన చేపట్టారు. ఉదయం 11.30 గంటలకు అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు వ్యాలీలోని తంగుల్‌గూడా గ్రామంలో ఉన్న రాధాకృష్ణ ఆలయానికి జగన్ చేరుకోనున్నారు. అక్కడ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం కుమారుడి వివాహ వేడుకలో పాల్గొని నూతన దంపతులను ఆశీర్వదించనున్నారు.
Also Read
అనంతరం మధ్యాహ్నం 1.30 గంటలకు వైఎస్ జగన్ విశాఖకు చేరుకుని రాణాప్రతాప్ నగర్‌లోని మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ నివాసానికి వెళతారు. ఇటీవల వివాహం చేసుకున్న నూతన వధూవరులను ఆశీర్వదిస్తారు. ఆ తరువాత అక్కడి నుంచి తిరుగు ప్రయాణం ప్రారంభించనున్నారు. ఇక రేపు వైఎస్సార్ కడప జిల్లాలోని ప్రొద్దుటూరుకు జగన్ వెళ్లనున్నారు. ఉదయం 11.30 గంటలకు ప్రొద్దుటూరుకు చేరుకుని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్ వేడుకలో పాల్గొననున్నారు. కార్యక్రమం అనంతరం మధ్యాహ్నం తిరుగు పయనమవుతారు.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణలో కేబినెట్ విస్తరణ ఎప్పుడు..? ఎవరికీ ఛాన్స్..?
-
OTR: వివాదాలకు కేరాఫ్‌గా బోనబోయిన శ్రీనివాస్..
-
Gut Health: జీర్ణక్రియ మెరుగుపడాలంటే..? రోజువారీ ఆహారంలో ఈ ఐదు చేర్చండి
-
OTR: యాక్టివ్ మోడ్‌లోకి షకీల్.. కవిత ఎఫెక్ట్, కేటిఆర్ వార్నింగ్ కారణమా ?
-
OTR: కొండా సురేఖ బీజేపీలో చేరుతుందా ?
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!