YS Jagan: గుంటూరుకు వైఎస్ జగన్.. అంబటి కుటుంబానికి పరామర్శ!

Ys Jagan

Ys Jagan

YS Jagan: ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు (ఫిబ్రవరి 4) గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు. రాష్ట్రంలో ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు జగన్ ఈ పర్యటన చేపడుతున్నారు. జగన్ రేపు ఉదయం 10 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి రోడ్డు మార్గం ద్వారా గుంటూరు జిల్లాకు బయలుదేరనున్నారు. అనంతరం ఉదయం 11 గంటలకు మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసానికి చేరుకోనున్నారు.

MLA Arava Sridhar: జనసేన కమిటీ ముందు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ విచారణ పూర్తి.. ఇక నిర్ణయం అధినేత చేతుల్లో!

అక్కడ అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను జగన్ పరామర్శించి, వారికి ధైర్యం చెప్పనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. అంబటి నివాసంలో కొంతసేపు గడిపిన తర్వాత, దాడికి గురైన వైసీపీ కార్యాలయాన్ని కూడా జగన్ పరిశీలించనున్నారు. అక్కడి పరిస్థితులను స్వయంగా పరిశీలించి పార్టీ నాయకులతో మాట్లాడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు గుంటూరు నుంచి జగన్ తిరుగు ప్రయాణం ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 1 గంటకు తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారని సమాచారం.

Sarpanch as Chimpanzee: కోతులను తరిమేందుకు చింపాంజీ అవతారమెత్తిన సర్పంచ్!