NTV Telugu Site icon

YS Jagan: ముగిసిన వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం.. ఎంపీలకు జగన్‌ దిశానిర్దేశం

Jagan

Jagan

YS Jagan: వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ముగిసింది.. ఎంపీలతో 40 నిమిషాల పాటు భేటీ అయిన వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌.. వారికి వివిధ అంశాలపై దిశానిర్దేశం చేశారు.. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణలో తీవ్ర వైఫల్యం చెందిందని విమర్శించిన ఆయన.. వైసీపీ నాయకులు, కార్యకర్తల మీద దారుణంగా దాడులు జరగుతున్నాయి. నుకొండలో జరిగిన హత్యా ఘటన పరాకాష్ట. వీడియో దృశ్యాలు చూస్తే.. ఈ రాష్ట్రంలో పరిస్థితులు ఎలా జరుగుతున్నాయన్నారు. ప్రజలందరూ చూస్తుండగా, నడిరోడ్డుమీద కత్తితో జరిగిన దాడి అత్యంత అమానుషం.. రాజకీయ ప్రత్యర్థులకు, వైయస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలకు ఒక మెసేజ్‌ పంపడానికి చేసిన ప్రయత్నం ఇది. రషీద్‌.. వైన్‌షాపులో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నాడు. జరిగిన ఘటనను వక్రీకరించడానికి ప్రభుత్వం నానా ప్రయత్నాలు చేస్తోందని.. ఏదో బైక్‌ కాల్చిన ఘటనకు, జరిగిన దారుణహత్యకు ముడిపెట్టే ప్రయత్నంచేస్తున్నారని మండిపడ్డారు.. మా కొడుకు ఏం తప్పుచేశాడని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. జగన్‌ ఉంటే.. మంచి జరుగుతుందని నమ్మడం మా తప్పు అవుతుందా? అని వాళ్లు ప్రశ్నిస్తున్నారని తెలిపారు.

Read Also: Union Minister Pemmasani Chandrasekhar: రాజకీయ పరిస్థితులు అడ్డుపడుతున్నాయి.. త్వరలోనే అభివృద్ధి పనులు పట్టాలెక్కిస్తా..

ఇక, కొత్త ఎస్పీ వచ్చిన రెండు మూడురోజుల్లో ఘటనలు జరిగాయి. దీనికి ముందు ఉన్న ఎస్పీ మల్లికాగార్గ్‌ను ఉద్దేశపూర్వకంగా బదిలీచేశారు. ఇప్పటివరకూ 36 మంది రాజకీయ హత్యలకు గురయ్యారు.. వేయికిపైగా దౌర్జన్యాలు, దాడులు జరిగాయి. హత్యలు, దాడులు చేయడానికి టీడీపీ వాళ్లకి లైసెన్స్‌ ఇచ్చినట్టుగా ఉంది అని మండిపడ్డారు వైఎస్‌ జగన్.. స్థానిక ఎమ్మెల్యేతో హంతకుడి ఫొటోలనుకూడా తల్లిదండ్రులు చూపారు. తన సొంత పార్లమెంటు నియోజకవర్గంలో, తన తండ్రి ఎమ్మెల్యేగా ఉన్న నియోజకవర్గంలో ఎంపీ మిథున్‌రెడ్డిపై దాడులు చేశారు.. టీడీపీ మనుషులను అక్కడ కావాలని ఉంచేలా పోలీసులతో ప్లాన్‌చేసి దాడులు చేశారు. మాజీ ఎంపీ రెడ్డప్ప, న్యాయవాది అయిన రెడ్డప్ప ఇంటికి వెళ్తే దాడులు చేశారు. తప్పులు వారు చేసి తిరిగి మన పార్టీ వాళ్లమీద కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, రాష్ట్రంలో హత్యలు, దాడులు, ఇతర హింసాత్మక ఘటనలపై పార్లమెంటులో గళమెత్తాలి.. 15 సంవత్సరాలుగా వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రస్థానంలో ఉంది.. చంద్రబాబు ఆశించినట్టుగా వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని అణగదొక్కలేరన్నారు.. జరుగుతున్న ఘటనలు ప్రజల్లో మరింత ఆగ్రహానికి దారితీస్తున్నాయి. రాష్ట్రపతి పాలనకు డిమండ్‌ చేయాలని సూచించారు. పోరాటం చేయకపోతే దారుణాలకు అడ్డుకట్ట పడదన్న ఆయన.. రేపు అసెంబ్లీ సమావేశాల్లో నిరస తెలుపుతాం.. మంగళవారం నాటికి ఢిల్లీకి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ముఖ్యమైన నాయకులు వస్తారు.. బుధవారం నాడు నిరసన తెలుపుతాం అన్నారు వైఎస్‌ జగన్‌.

Read Also: MMTS Services: రెండు రోజులు ఎంఎంటీఎస్ రైళ్లు ర‌ద్దు.. వివ‌రాలివే..

రాష్ట్రంలో జరిగిన దారుణాలన్నింటినీ కూడా దేశ ప్రజలకు చూపుతాం అన్నారు వైఎస్‌ జగన్.. ఈ విషయంలో మనతో కలిసి వచ్చే పార్టీలను కూడా కలుపుకుపోవాలి.. జరిగిన ఘటనలపై అందరూ గళమెత్తాల్సిన అవసరం ఉందన్న ఆయన.. ఇప్పటికే రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర హోంమంత్రుల పాయింట్‌మెంట్లను కోరాను.. ఎవరు అధికారంలో ఉన్నా ఇలాంటి దాడులు మంచివికావు అన్నారు. అధికారంలో ఉన్న పార్టీ, అధికారంలో లేని పార్టీమీద దాడులు చేయడం అనేది ధర్మమా? ఇక ప్రజాస్వామ్యానికి విలువ ఏముంటుంది? అని ప్రశ్నించారు.. రాష్ట్రంలో జరుగుతున్న ఘటనలు ఒక పార్టీకి సంబంధించిన అంశం కాదు.. ప్రజాస్వామ్యం మనుగడకు పెద్ద దెబ్బగా భావించాలన్నారు. అన్ని పార్టీలకూ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను వివరించాలి.. రాష్ట్రంలో ఇవాళ జరుగుతున్న పరిస్థితులు ప్రజాస్వామ్యానికి మంచిదికాదన్నారు.. ప్రభుత్వాలు చేసే మంచి పనులు ఆధారంగా ఆ పార్టీ పరిస్థితులు ఉంటాయి.. బుధవారం ధర్నా అయిన తర్వాత లోక్‌సభ, రాజ్యసభలో రాష్ట్రంలో దారుణమైన, హింసాత్మక పరిస్థితులపైన గళం విప్పాలని ఎంపీలకు సూచించారు.. పార్లమెంటు దృష్టికి, దేశ ప్రజల దృష్టికి చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న దారుణాలను తీసుకు వెళ్లాలి.. ఢిల్లీలో ధర్నా, నిరసన కార్యక్రమానికి సంబంధించి ఒక్కో ఎంపీకి, ఒక్కో బాధ్యత అప్పగించాలని వైఎస్‌ జగన్‌ ఆదేశించారు.. ఎంపీలంతా ఢిల్లీకి వెళ్లి వెంటనే ఈ కార్యక్రమంలో నిమగ్నం కావాలని స్పష్టం చేశారు వైఎస్‌ జగన్.