YouTube Launches Hype: వీడియో కంటెంట్ ప్రపంచంలో అగ్రగామిగా కొనసాగుతున్న యూట్యూబ్ తాజాగా భారతదేశంలోని చిన్న క్రియేటర్లను ప్రోత్సహించేందుకు ఓ కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. దీని పేరు ‘Hype’. ఈ ఫీచర్ ద్వారా చిన్న క్రియేటర్లకు ఆడియన్స్ పెరిగే అవకాశాలు ఎక్కువ అవుతాయి. భిన్న భాషల నుంచి, విభిన్న ప్రాంతాల నుంచి వస్తున్న కొత్త టాలెంట్‌ను వెలికితీయడమే యూట్యూబ్ లక్ష్యంగా సాగుతోంది.
Hype ఫీచర్ అంటే..?
Hype అనేది సబ్‌స్క్రైబర్ల సంఖ్య 500 నుండి 5 లక్షల మధ్య ఉన్న క్రియేటర్ల కోసం రూపొందించబడిన ఓ ప్రత్యేక ఫీచర్. అర్హత గల వీడియోల క్రింద లైక్ (Like) బటన్ పక్కన కొత్తగా Hype బటన్ కనిపిస్తుంది. వీక్షకులు ఈ బటన్‌ను క్లిక్ చేస్తే, ఆ వీడియోకి Hype పాయింట్లు లభిస్తాయి. ఈ పాయింట్ల ఆధారంగా ఆ వీడియో Top 100 లీడర్ బోర్డులోకి చేరుతుంది. ఈ లీడర్ బోర్డు, యూట్యూబ్ లోని Explore ట్యాబ్‌లో అందుబాటులో ఉంటుంది. ఇంకా చెప్పాలంటే, చిన్న సబ్‌స్క్రైబర్ బేస్ ఉన్న చానళ్లకు బోనస్ పాయింట్లు కూడా లభిస్తాయి. దీని వల్ల కొత్త క్రియేటర్లకు పెద్ద చానళ్లతో పోలిస్తే మెరుగైన అవకాశాలు పొందవచ్చు.
ఎవరు అర్హులు?
ఈ ఫీచర్‌ను వినియోగించాలంటే క్రియేటర్‌కి కొన్ని అర్హతలుండాలి. అవేంటంటే..
* YouTube Partner Programme (YPP)లో సభ్యత్వం ఉండాలి.
* 500 నుంచి 5,00,000 సబ్‌స్క్రైబర్లు మధ్య ఉండాలి.
* వీడియో కొత్తగా (గత 7 రోజులలో) పబ్లిష్ చేయబడినది అయ్యి ఉండాలి.
* అర్హత గల చానళ్లకు Hype ఫీచర్ ఆటోమేటిక్‌గా లభిస్తుంది. ప్రత్యేక సెటప్ అవసరం లేదు.
Instagram Auto Scroll: ఇక రీల్స్ స్వైప్ చేయాల్సిన అక్కర్లే.. ఆటోమేటిక్‌గా నెక్స్ట్ రీల్ చూసేయ్యండి!
వీక్షకుల కోసం ఎలా పనిచేస్తుంది?
యూట్యూబ్‌లో Hype ఫీచర్ ద్వారా వీక్షకులు తమకు నచ్చిన చిన్న క్రియేటర్లకు ప్రత్యక్షంగా మద్దతు ఇవ్వగలుగుతారు. అర్హత గల చానళ్ల వీడియోల క్రింద Like బటన్ పక్కన ‘Hype’ అనే కొత్త బటన్ కనిపిస్తుంది. అయితే, ఈ ఫీచర్ పనిచేయాలంటే ఆ వీడియో గత 7 రోజుల్లో పబ్లిష్ అయి ఉండాలి. అంటే వారం కంటే పాత వీడియోలకు ఇది వర్తించదు. ప్రతి యూట్యూబ్ వినియోగదారుడు వారానికి మూడు వీడియోలకు ఉచితంగా Hype చేయవచ్చు. మీరు Hype చేసిన వీడియోలకు Hype పాయింట్లు లభిస్తాయి. ఈ పాయింట్ల ఆధారంగా వీడియోలు Top 100 లీడర్ బోర్డులోకి ఎక్కుతాయి. లీడర్ బోర్డులో ఉన్న వీడియోలు YouTube Explore ట్యాబ్‌లో ఎక్కువగా కనిపించడంతో పాటు, రికమెండేషన్లలో ప్రాధాన్యతగా కనిపించే అవకాశాలు పెరుగుతాయి.
కొత్త క్రియేటర్లకు ఇది ఎలా ఉపయోగపడుతుంది?
యూట్యూబ్‌లో కొత్తగా పని ప్రారంభించిన వారికి ముఖ్యమైన సవాల్ ఏంటంటే విజిబిలిటీ. మంచి కంటెంట్ ఉన్నా, ప్రేక్షకుల దృష్టికి రావడం తక్కువగా జరుగుతుంది. కానీ, Hype ఫీచర్ వల్ల వీక్షకులు తమకు నచ్చిన క్రియేటర్లకు ప్రత్యక్షంగా మద్దతు ఇచ్చే అవకాశం పొందుతారు. ఇది చిన్న చానళ్లకు పెరుగుదల అవకాశాన్ని, పెద్ద చానళ్లను తలపడే అవకాశాన్ని కల్పిస్తుంది.