Youth: ఒక రోజు ఆలస్యంగా థియేటర్స్‌లో ‘యూత్’ సందడి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Youth: తమిళ్లో మంచి సక్సెస్ సాధించిన యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ ‘యూత్’ (Youth) తెలుగు విడుదలకు సంబంధించి ఒక అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. విడుదలకు కేవలం కొన్ని గంటల ముందు మేకర్స్ సినిమా రిలీజ్ డేట్‌ను మారుస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. తమిళ నటుడు కరుణాస్ కుమారుడు కెన్ కరుణాస్ కథానాయకుడిగా నటిస్తూ, దర్శకత్వం వహించిన సినిమా యూత్. ఈ సినిమాను తెలుగులో E2C టాకీస్ బ్యానర్‌పై విడుదల చేస్తున్నారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ చిత్రం మార్చి 26న విడుదల కావాల్సి ఉంది. అయితే, అనివార్య కారణాల వల్ల ఈ సినిమాను ఒక రోజు ఆలస్యంగా, అంటే మార్చి 27న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
READ ALSO: Kalki 2: మహాభారత పర్వం పీక్స్.. 20 ని. గూస్బంప్స్ అంతే!
Also Read
- AP Social Media Influencer Policy: సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు సర్కార్ గుడ్‌న్యూస్.. ఫాలోవర్లను బట్టి పారితోషికం..
- Sahil Wakode Death: ‘‘నేను తప్పు చేశా’’.. ఆతహత్యకు ముందు స్నేహితురాలికి సాహిల్ చివరి కాల్..
- UP: 2047 వరకు అఖిలేష్ కుటుంబంలో ఎవరూ ముఖ్యమంత్రి అవ్వరు.. యూపీ డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు
- Vivo S2 FE: 10,000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP68 + IP69 రేటింగ్.. వివో నుంచి మరో స్మార్ట్ ఫోన్..
సినిమాపై ఉన్న క్రేజ్ దృష్ట్యా, మేకర్స్ కొన్ని ప్రత్యేక షోలు వేయాలని ప్లాన్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన పెయిడ్ ప్రీమియర్స్ వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని చిత్ర యూనిట్ తెలిపింది. విడుదల తేదీ మారినప్పటికీ, సినిమాపై ఉన్న బజ్ ఏమాత్రం తగ్గలేదని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈ సినిమాలో కెన్ కరుణాస్, దేవదర్శిణి, సూరజ్ వెంజరమూడు, అనిష్మా అనిల్ కుమార్, ప్రియాన్షి యాదవ్, మీనాక్షి దినేష్ తదితరులు కీ రోల్స్ ప్లే చేస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు జి.వి.ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. యూత్‌ను ఆకట్టుకునే అంశాలతో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో వేచి చూడాల్సిందే.
తాజావార్తలు
-
AP Social Media Influencer Policy: సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు సర్కార్ గుడ్‌న్యూస్.. ఫాలోవర్లను బట్టి పారితోషికం..
-
Sahil Wakode Death: ‘‘నేను తప్పు చేశా’’.. ఆతహత్యకు ముందు స్నేహితురాలికి సాహిల్ చివరి కాల్..
-
UP: 2047 వరకు అఖిలేష్ కుటుంబంలో ఎవరూ ముఖ్యమంత్రి అవ్వరు.. యూపీ డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు
-
The Paradise: నాని కెరీర్లోనే రికార్డ్ ఓపెనింగ్ దిశగా ‘ది ప్యారడైజ్’.. రిలీజ్‌కు ముందే కోటి దాటేసిన సినిమా!
-
Vivo S2 FE: 10,000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP68 + IP69 రేటింగ్.. వివో నుంచి మరో స్మార్ట్ ఫోన్..
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!