హైదరాబాద్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఫార్ములా ఈ రేస్‌పై యూత్ కాంగ్రెస్ అభ్యతరం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే.. ఖైరతాబాద్ జంక్షన్ దగ్గర యూత్ కాంగ్రెస్ ఆందోళన చేపట్టారు. కార్ రేసింగ్‌లతో ఎవరికీ ఉపయోగం లేదని యూత్ కాంగ్రెస్ నేతలు నిరసన వ్యక్తం చేశారు. ఒక్కసారిగా ఖైరతాబాద్ జంక్షన్ దగ్గరికి యూత్ కాంగ్రెస్ నేతలు వచ్చారు. నెక్లెస్ రోడ్డువైపు దూసుకెళ్లేందుకు యూత్ కాంగ్రెస్ నేతలు ప్రయత్నించడంతో.. యూత్ కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదిలా ఉంటే.. హైదరాబాద్‌లో సందడిగా ఫార్ములా ఈ-రేసింగ్ కొనసాగుతోంది.
Also Read : NTR: యంగ్‌టైగర్ ఎన్టీఆర్ అభిమానులకు శుభవార్త?
కార్ రేసింగ్ చూసేందుకు సెలబ్రిటీస్, అభిమానులు తరలివచ్చారు. రేసింగ్‌లు చూసేందుకు రామ్‌చరణ్, సచిన్, శిఖర్ ధావన్, దీపక్ చాహర్, కేటీఆర్, కిషన్‌రెడ్డి వచ్చారు. ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాలు కోలాహలంగా మారాయి. ఇండియాలో తొలిసారిగా హైదరాబాద్ వేదికగా ఫార్ములా ఈ రేసింగ్ జరుగుతోంది. హైదరాబాద్ వేదికగా ప్రారంభమైన మెగా ఇంటర్నేషనల్ ఈవెంట్ సందర్భంగా హుస్సేన్ సాగర్ తీరాన స్ట్రీట్ సర్క్యూట్‌పై కార్లు రయ్ రయ్ మంటూ దూసుకెళుతున్నాయి. ఇవాళ ఉదయం 10 గంటల 40 నిమిషాలకు ఫార్ములా ఈ క్వాలిఫైయింగ్ రేస్ ప్రారంభం కాగా.. సాయంత్రం నాలుగున్నర గంటల వరకు మెయిన్ రేస్ కొనసాగుతుంది.
Also Read : Mallikarjun Kharge: దేశంలో వాక్ స్వాతంత్య్రం లేదు.. బీజేపీపై ఖర్గే మండిపాటు